Wednesday, February 5, 2020

మన నాలుకే మనకు మిత్రుడు, శత్రువు, బంధువు.

ఓం నమశ్శివాయ🙏
ఫ్రెండ్స్ మాటలు ఎంతో విలువైనవి
వాటిని జాగ్రత్తగా వాడాలి
ఎవరిని తగ్గించి మాట్లాడకూడదు
ఎవరిని మాటలతో భాదించకూడదు
ఇవాళ మనం శక్తివంతంగా ఉండొచ్చు
కానీ కాలం మన కన్నా శక్తివంతమైనదని గుర్తుంచుకోవాలి
ఒక చెట్టు నుంచి లక్షల అగ్గి పుల్లల తయారవుతాయి లక్షల చెట్లను బూడిద చేయడానికి
ఒక అగ్గిపుల్ల చాలు
అలాగే ఒక్క మాటతో మనతో ఉన్న బంధాలు తెగిపోతాయి తర్వాత ఎంత బాధపడినా ప్రయోజనం లేదు.
కాకి అరిస్తే దాన్ని తరిమేస్తాం.
కోకిల కూస్తే ఆనందంగా వింటాము.
కోకిల చేసిన పుణ్యమేమి?
కాకి చేసిన పాపమేమి?
వాటి నోటి నుంచి వచ్చిన ధ్వనిలో ఆ భేదం ఉంది.
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని
పెద్దలు చెప్తారు.
ఒకరి కష్టం మనము తీర్చలేకపోవచ్చు.
కాని కొంత ఊరటగా మాట్లాడవచ్చు.
దానివలన వారికి కొంత ఉపశమనం కలుగుతుంది.
మన నాలుకే మనకు మిత్రుడు, శత్రువు, బంధువు.
అది మంచిదైతే మనకు అన్నీ సుఖాలను తెస్తుంది. చెడ్డదైతే కష్టాలను తెస్తుంది.
కాబట్టి నాలుకను అదుపులో ఉంచుకోవాలి.
కోపం మనసులో కాదు మాటలు మాత్రమే ఉండాలి ప్రేమ మాటల్లో మాత్రమే కాదు
మనసులో కూడా ఉండాలి
ఎన్నో జన్మల పుణ్యఫలము ఈ మానవ జన్మ
ఆ తండ్రి పాదాల చెంత చెరు వరకు
ప్రతిక్షణం ఆ భగవన్నామ స్మరణ చేస్తూ
మంచి మాట్లాడుతూ మంచి మాటలు పంచుతూ
ఈ జన్మ సార్థకం చేసుకుందాం ఓం నమశ్శివాయ 🙏

శివయ్య అందరినీ చల్లగా చూడు తండ్రి🙏

No comments:

Post a Comment