స్నేహితుడు
🕉🌞🌎🏵🌼🚩
ఒక కొలనులోని రెండుచేపలు చాలా స్నేహంగా ఉండేవి.
ఆ రెండు చేపలు ఏ పని చేసినా కలిసే చేసేవి.
ఓ రోజు ఒక చేపలు పట్టేవాడు చేపల కోసం వల విసిరాడు. ఒక చేప వలలో పడగా ఇంకొకటి తప్పించుకుంది.
'' ఆహా! ఈ చేప ఎంత పెద్దగా ఉంది. దీన్ని అమ్మితే నాకు చాలా డబ్బు వస్తుంది'' అని సంతోషపడ్డాడు చేపలవాడు.
ఆ చేపను వల నుండి తీసి బుట్టలో వేస్తుండగా అది ఏడుస్తున్నట్టు గ్రహించి ''ఎందుకు ఏడుస్తున్నావు? వలలో చిక్కుకుని నాకు దొరికావని బాధపడుతున్నావా?'' అని అడిగాడు చేపలవాడు ఆ చేపని.
'' నేను నా గురించి ఏడవట్లేదు. నా స్నేహితుడు కోసం ఏడుస్తున్నాను. అతను కూడా వలలో చిక్కుకున్నాడని బాధగా ఉంది'' జవాబిచ్చింది ఆ చేప.
'' బాధపడకు! నువ్వొక్కడివే వలలో చిక్కుకున్నావు. ఇంకో చేప తప్పించుకుంది'' అని అన్నాడు చేపలవాడు.
ఇది విని ఆ చేప చాలా సంతోషించింది.
''ఓ చేపలవాడా! నా మాట విను!'' అని నీటి నుంచి వినిపించింది. చేపలవాడు ఆశ్చర్యపోయాడు. ఎవరు మాట్లాడుతున్నారు అని నీళ్ళల్లోకి చూశాడు. రెండో చేప నీటిపై తేలుతూ కనిపించింది.
''నా స్నేహితుడు నీ వలలో చిక్కుకున్నాడా?'' అడిగింది రెండోచేప. ''అవును!'' బదులిచ్చాడు చేపలవాడు.
'' నీకు చేపలన్నీ సమానమే, కదా! దయచేసి నన్ను పట్టుకుని, నా స్నేహితుడిని విడిచిపెట్టు! లేకపోతే నన్ను కూడా పట్టుకెళ్ళు. నేను నా స్నేహితుడు లేకుండా జీవించలేను'' అని ప్రాధేయపడింది రెండోచేప.
చేపలవాడు ఆ చేపల స్నేహానికి ఆశ్చర్యపోయి ''మిమ్మల్ని విడదీస్తే ఈ లోకంలో ఎవరూ కూడా నన్ను క్షమించరు!"అని అంటూ మొదటి చేపను నీటిలో వదిలేశాడు.
క్షాంతిశ్చేత్ కవచేన కిం కిమరిభి: క్రోధోస్తి చేద్దేహినాం,
ఙ్ఞాతిశ్చే దనలేన కిం యది సుహృద్దివ్యౌషధై: కిం ఫలం,
కిం సర్పైర్యది దుర్జనా: కిము ధనైద్విద్యానవద్యా
వ్రీడా చేత్ కిము భూషణై: సుకవితా యద్యస్తి రాజ్యేన కిమ్ ?
ఓర్పు కల వానికి వేరే కవచం అక్కర లేదు.
కోపం కల వానికి వేరే శత్రువులెవరూ ఉండనక్కర లేదు.
దాయాదులు ఉంటే వేరే అగ్ని అక్కర లేదు.
మంచి మిత్రులున్న వారికి వేరే గొప్ప ఔషధాలతో పని లేదు.
దుష్టులు ఉండగా వేరే విష సర్పాలతో పని లేదు.
మంచి విద్య ఉన్న వారికి వేరే గొప్ప నిధులు అక్కర లేదు.
లజ్జ కలిగిన వారికి వేరే ఆ భరణాలు అక్కర లేదు
కవితా శక్తి కల వారికి వేరే రాజ్య మక్కర లేదు*

No comments:
Post a Comment