Friday, February 14, 2020

నీ కలమీద నీ శక్తి మీద విశ్వాసం ఉంచు, ఆ కల తప్పక నిజమవుతుంది.

నా మాట నమ్మి చెడినవారు లేరు నమ్మండి

చూడానిదానిని నమ్మటం విశ్వాసం. ఆ విశ్వాసానికి ఫలితం నమ్మిన దానిని చూడటం

ఓ అసామి కి బాగా కడుపునొప్పిగా ఉంది. హుటాహుటిన డాక్టరు గారి దగ్గరకు పరుగేత్తాడు. ఆయన చేరే సమయానికి డాక్టరు గారు డిస్పెన్సరీ తలుపులు మూసి తాళం వేస్తూన్నాడు. మన ఆసామి రొప్పుతూ,రోజుతూ డాక్టరు గారిని బ్రతిమిలాడు. తనకు మందిచ్చాక డిస్పెన్సరీ మూయమని.

ఆ డాక్టరు గారు పట్టువిడుపులేని మనిషి, పేషేంటుకి రేపొద్దున రమ్మని,తాళం చెవులు జేబులో వేసుకొని, కొంచెం దూరంలో ఉన్న ఇంటికి బయలుదేరాడు. పేషేంటు వెంబడేంచాడు పొట్టచేతబట్టుకొని తనకేదన్నా మందిచ్చి తన భాద నివరించమని, పేషేంటు పోరు తట్టుకోలేక, డాక్టరుగారు జేబులోంచి ఏదో తీసి పేషేంటుకిచ్చి మెల్లగా చప్పరించమన్నాడు ,'కొంచమైన నొప్పి తగ్గిందా'అని.తొంబైశాతం పోయేందన్నాడు. అయితే నోట్లో ఉన్నది ఉమ్మేసి పొద్దున నొప్పిగా ఉంటే మళ్ళీ రమ్మన్నాడు.ఉమ్మేసాక, ఏం ఉమ్మేసానా అని చూశాడు పేషేంటు. అది కోటు గుండీ, నమ్మకానికి ఉన్న శక్తి అలాంటిది మరి.

మీ సంగతేమో కానీ, నాకు మాత్రం ఇటువంటి అనుభవాలు ఎన్నో ఎదురురయ్యాయి. ఏదో చిన్న సమస్యని ఊహాల్లో విపరీతంగా పెంచేసి, డాక్టరు దగ్గరకు పరగెత్తడం ,ఆయన బిపి, నాడి గట్రా చెక్చేసి ఏమీ లేదనటం, వెంటనే ఠపీ మ ని మనసు కుడుటపడటం......అన్నీ నార్మల్ కావటం.... దేనివల్ల అంటారు?

డాక్టరుగారి మీద ఉన్న నమ్మకం,విశ్వాసం.


ఓ స్వామి గారు నది ఒడ్డున చిన్న అశ్రమం నిర్మించుకొని ,పురాణాలు చెబుతూ కాలం వెళ్ళబుచ్చుతున్నారు .

రోజు పాలు పొసే ఆవిడ ఒక రోజున పాలు పోయాక పోవడంతో మరునాడు అడిగారు స్వామి గారు ,నిన్నెందుకు రాలేదని అమె చెప్పింది ,ఎడతెరిపిలేని వానలవల్ల నది ఉదృతంగా ప్రవహిస్తుందని,అందువల్ల నది దాటలేకపోయి తేలేదని .

స్వామి వారన్నారు 'అమ్మా ,నువ్వెన్నిసార్లు నేను చెప్పిన రామాయణం వినలేదు ,అందులొ వనరులు రామనామం స్మరిస్తూ నిర్మించి వారధిని గురించి విన్నావు కదా ! నివు అలాగే రామనామ జపం చేస్తూ ,నది దాటలేకపోయావా 'అని .

అమె విని ఊరుకుంది .

ఆ మరునాడు మళ్ళీ కుంభవృష్టి .అయినా సరే పాలతో వచ్చిందామె .స్వామివారు ఆశ్చర్యపోయి ,ఇంత వానలో ఎలా నదిని దాటివచ్చావమ్మా అని అడిగారు ....'నిన్న మీరు చెప్పినట్లుగా రామా రామా అంటూ నదిని దాటాను 'అంది అమె .'అయితే ,నాకు చూపించు ఎలా నదిని దాటావో 'అని ఆమెతో సహా స్వామి గారు నది వద్దకి వెళ్లారు .

అమె భక్తి పారవశ్యంతో కళ్ళు మూసుకొని ,రామా రామా అంటూ సునాయాసంగా నదిని దాటి ,అవతలి గట్టుకు చేరింది .

స్వామిగారు భయం భయంగా కళ్లు మూస్తూ ,తెరుస్తూ ,రెండడుగులు నదిలో వెసి ,మునుకెళ్లే ధ్యేర్యం లేక వెనుతిరిగారు .

అమె రాముని చూడాలా ,స్వామివారు చెప్పారు రాముడున్నాడని .......అమె విశ్వసించింది .ఆ విశ్వాసానికి ఫలితంగా రామ తత్వాన్ని ,రామ ఫలితాన్ని చుచిందావిడ .స్వామివారికి తన మాటల మిద తనకే నమ్మకం లేదు . మరి ఫలితమెక్కడ నుంచి వస్తుంది ?

ఈ రెండు కథలు మనం చేస్తున్న పనిమీద ,మన శక్తి మీద మనకు సంపుర్ణ విశ్వాసం ఉంటే ,ఫలితాలు రాక ఎక్కడకు పోతాయంటారు.

If you can capacity to dream, same way you have that much of Caliber to make it a Successfull Completion.

(నీవు కలలే కంటే ,అవి తప్పక నిజం అవుతాయి )
సృష్టి లోని రహస్యం ఇదే
నీ కలమీద నీ శక్తి మీద విశ్వాసం ఉంచు, ఆ కల తప్పక నిజమవుతుంది.

No comments:

Post a Comment