మానవ జన్మ దుర్లభం
సమస్త ప్రాణుల్లోకి మానవజన్మ ఉత్తమైనది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది లభించడం చాలా కష్టం అని ఉపనిషత్తులు ఉద్ఘోషిస్తున్నాయి. ఒక్కసారి మానవ జన్మలోకి ప్రవేశించాడు అంటే, ఎంతెంతో పుణ్యం, ఎన్నో జన్మల సుకృతం, భగవంతుని యొక్క దయ చేరితే మానవ జన్మ లభిస్తుంది. ఏమిటి మానవ జన్మ యొక్క గొప్పతనం అంటే మళ్ళీ ఈ దుఃఖ భూయిష్టమైన జన్మలలలోకి రాకుండా నేరుగా ఈ మానవ జన్మ నుండి తరించే అవకాశం ఉంది. మిగతా జన్మలలోకి వెళ్తే అట్లా తరించే అవకాశంలేదు, క్రమంగా ఒక్కో మెట్టు ఎక్కి వచ్చినట్లు ఒక్కో జన్మ మారుతూ రావల్సిందే. మిగతా జీవులు ఏకాస్తనైనా తరించాలి అంటే అది మానవుడి అనుగ్రహం వల్ల తప్ప వాటంతట అవి తరించలేవు, ఏమో భగవంతుడు నేరుగా తరింపజేస్తే అది వేరే విషయం.
పశుః మనిష్యః పక్షీవా ఏష వైష్ణవ సంశ్రయాః |
తేనైవ తేప్రయాస్యంతి తద్విష్ణోపరమంపదం ||
ఎప్పుడైతే ఒక వైష్ణవుడిని ఆశ్రయించినప్పుడు, వైష్ణవుడి అభిమానాన్ని పొందినప్పుడు పశువులు కానీ, పక్షులు కానీ, మనుషులు కానీ విష్ణు లోకమైన పరమపదానికి వెళ్ళగలవు. మానవ జన్మకు ఉత్తమమైన యోగ్యత ఉంది. మననం, ఆ మననానికి తగ్గ కర్మ చేయగలిగేవాడు మానవుడు అంటే. మానవుడు తన స్థితిని, గతిని గురించి మననం చేయగలడు, ఆ చేసినదాన్ని కార్య రూపంలోకి తేగలడు. మిగతా జంతువులు కొంతవరకే ఆలోచన చేయగలుగుతాయి, కేవలం తన శరీరం, శరీర సంరక్షణ వరకు మాత్రమే ఆలోచన సాగుతుంది. శరీరం పెరుగుతూ వస్తుంది, తిరిగి క్షీణిస్తుంది, శరీరం మారుతుంది కానీ మార్పులేని నేను అనేది ఎప్పటికి మార్పుచెందక ఉన్నాను అని గుర్తించగలడు మానవుడు. ఈ పరిణితిని గుర్తించిన వాడిని మరొక్క అడుగు ముందుకు వెళ్ళమని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతాడు "తదాదేహాంతర ప్రాప్తిః ధీరః తత్ర నముహ్యతి" రెండో అధ్యాయంలో. వయసు పెరిగిన కొద్ది శరీరం యొక్క సామర్థ్యం మారుతోంది, ఈ శరీరం పోయి మరొకటి రావడం కూడా ఇట్లానే ఉంటుంది. ఒక చిన్న పిందగా ఉన్నది కాయగా మారుతుంది, ఆకాయ పండుగా అయి రాలి పోతుంది ఒకనాడు. మనం కూడా అట్లానే పక్వంచెంది బయటికి వెళ్ళాలి, ముందే రాలిపోకూడదు. అందుకే పక్వం చెందటానికి ఆలోచించాలి. అది ఆలోచించగలిగితే జరిగే మార్పుల్లో ఏడుపు రాదు. రాలిపోతుంది అంటే కూడా ఏడుపురాదు, వాడిని ధీరః అని అంటారు. 'నముహ్యతి' బుద్దిని అట్లా వాడుకో గలిగిన వాడు మోహంచెందాల్సిన పని లేదు. ఏడిచే పని వానికి రాదు. ఇదే భగవంతుడు చెప్పినది. మనం ఇక్కడ ఉండగా హాయిగా బ్రతికేట్టు చేద్దాం అనేది ఆయన సంకల్పం. అందుకే మనకోసం ఆయన ఇన్ని ఉపదేశాలు చేయడం, మనకే ఎందుకు చేయాలి అంటే గుర్తించగలిగే ప్రాణి మనిషి కనుక. మిగతా జంతువులు గుర్తించలేవు.
మానవ జన్మ ఎక్కువ కాలం ఉండదు. ఉన్న కాలాన్ని సక్రమంగా వాడుకోవాలి. "దుర్లభో మానుషోదేహః" శరీరం లభించడమే చాలా కష్టం, "దేహినాం క్షణ భంగురః" లభించినది ఒక క్షణమంత కూడా ఉండదు. "మిన్నిన్ నిలయిల మన్ను ఇఱాక్కెగళ్" అని చెబుతారు నమ్మాళ్వార్. ఇది మెరుపు కంటే కూడా ప్రమాదకరమైనది. మెరుపు ఎట్లా ఐతే పోయేదో, ఆ వెలుతురును పట్టించుకోం, అట్లానే శరీరం పోయేది అని తెలిసి కూడా దానికోసం ఎన్ని తప్పుడు పనులు చేస్తున్నారే! పోయేదే అయినా ఇది పోయేది అని అనుకోనివ్వటం లేదు. కేవలం శరీరంకోసం బ్రతుకుతున్నాం అంటే ఇది ఎంత ప్రమాదమైనదో గుర్తించాలి. తెలియని శత్రువువంటిది అని చెబుతాడు నమ్మాళ్వార్. మెరుపు పోతుందని తెలుసు మనం వాడుకోం, అందుకే ఆ మెరుపే నయం. ఇట్లాంటి స్థితిలో మనం ఎన్నో జన్మలలో ఒక సారు మనిషి అయినప్పుడు దైవాన్ని గురించి ఆలోచించి, ఆ జ్ఞానాన్ని ఇచ్చే మహానుభావులని విశ్వసించి వారికి తగినట్లు బ్రతికగలిగితే, అట్లాంటి జన్మ కోటికి ఒకటైనా ఉంటుందో లేదో అని చెప్పవచ్చు. "తత్రాపి దుర్లభం మన్యే వైకుంఠ ప్రియదర్శనం" మానవ జన్మలభించడమే గొప్ప అంటే, అట్లాంటి మానవ జన్మలో దైవాన్ని గుర్తించి బ్రతకడం, వైకుంఠ ప్రియులైన వారి దర్శనం లభించడం, వారి అభిమానం పొందటం ఎంత కష్టమో అనేది ఋషివాక్కు!! పరాశర మహర్షి వంటి వారికే అట్లా అనిపిస్తే ఇక మన గురించి ఆలోచించాలి. ఇవన్నీ మనిషికి చెప్పాల్సొచ్చింది, అది చెప్పడానికే రామావతారం.
మానవ జన్మని ఎట్లా వాడుకోవాలో తెలిపేదే రామావతారం
మనిషి బుద్దిని సరిగ్గా వాడుకోవాలంటే కొన్ని స్థాయిలు ఉన్నాయి. మొదట శరీరాన్ని గుర్తించాలి. శరీరానికి తగినట్లు పనిచేయాలి. శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, శరీరాన్ని పోషించుకోవాలి, దానికి తగినట్లు పనిచేయాలి, పనిచేయడానికి వీలయ్యేట్టు ఆలోచించాలి. ఇది ఒక మెట్టు. ఆలోచనలలో ఒక భాగం శరీరం కోసం వాడుకోవాలి, కానీ అక్కడికే సర్వస్వం కాదు, ఇక్కడితోనే ఆగిపోవడం కాదు, ఇది ఒక భాగమే. శ్రీకృష్ణుడు 6వ ఆధ్యాయంలో "యుక్త ఆహార యుక్త విహార యుక్త చేష్టశ్చ్య కర్మసు యుక్త స్వప్న యుక్త అవబోధ", ఇవన్నీ యుక్తంగా ఉండాలి, మానేయాల్సిన అవసరం లేదు. ఆహారం ఏవి ఎంతవరకు అవసరమో తెలుసుకొని తిని. హాయిగా తిరుగు, కానీ ఎవరెవరో తెలుసుకొని తిరుగు. ఏఏపనులు తగివవో ఏవి తగనినో తెలుసుకొని చెయ్యి. ఎంత అవసరమో అంత నిద్ర,ఎంత మెలుకువగా ఉండాలో అంత తప్పవు. శరీరానికి ఒక క్రమం ఉంది, ఆక్రమాన్ని గుర్తించి దాన్ని గౌరవించి జీవిస్తే అప్పుడు శరీర పోషణ తప్పుకాదు.
రెండో భాగం, ఈ లోకంలోకి తెచ్చే వ్యవస్థ ప్రకృతి, ఇది మనకు తల్లిగా, తండ్రిని ఇచ్చింది. వారికి వారి తల్లి తండ్రులు, మరికొన్ని కుటుంబాలు ఉన్నాయి. అందులో ఒకనిగా మనం వచ్చాం. మనంతట మనం స్వతంత్రంగా రాలేదు. శరీరాన్ని మనం కాపాడుకోవడానికి ఎంత భాగం ఆలోచిస్తున్నామో, అంత మన కుటుంబ విషయంలో కూడా ఆలోచించాలి. శరీరాన్ని కొంతకు మించి వాడుకోలేము. అట్లానే మనం జన్మించిన కుటుంబం యొక్క నియమాన్ని పాటిస్తూ, అందరిని గౌరవించి బ్రతకాలి. అందులో తల్లి తండ్రులు ఉండొచ్చు, భార్య, భర్త, పిల్లలు, బంధువులు ఉండొచ్చు. హద్దులు తెలుసుకొని ప్రవర్తించాలి. జంతువులు వాటి హద్దులు తెలిసి ప్రవర్తిస్తాయి. తమ పిల్లలను ఎంత వరకు అవసరమో అంతవరకు పెంచుతాయి. మనుషులం కనక ఎంతవరకు చేయాలో చేసి, ఆపై పిల్లలు అడిగితే సలహా ఇవ్వడానికి ఉండాలి తప్ప అన్నింటిని తమపై పూసుకోకూడదు. "వార్ధకే ముని వృత్తినాం" ఒక కాలంలో వృద్దాప్యం వచ్చాక బాధ్యతలు అప్పగించి ప్రశాంతంగా భగవంతుని గురించి ఆలోచించుకొనే వారు. సలహాలు మాత్రం ఇచ్చేవారు. పిల్లలు పాటిస్తున్నారా లేదా అని కూడా ఆలోచించేవారు కాదు. చెప్పడం వరకు పెద్దల బాధ్యత. మాట వినక నష్టపోతుంటే పట్టించుకోనవసరం లేదు. హద్దులు ఉంటాయి అని గుర్తించాలి. అట్లా ఒక భాగం కుటుంబం కోసం ఆలోచించాలి, ఆ ఆలోచనని ఆచరణలోకి తేవాలి. ఇది రెండవ మెట్టు.
మన కుటుంబం చుట్టూ సమాజం ఉంది, కొన్ని కోట్ల సంస్కారాలు కలిగిన సమాజం ఉంది. దాన్ని గుర్తించి, దాన్ని ఇబ్బంది కలిగించకుండా, దానికి తగినట్లుగా మనం బ్రతకాలి. ఇది మూడో భాగం. శరీరం, కుటుంబం ఎంత వాస్తవమో సమాజం కూడా అంతే వాస్తవం, దాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రయత్నించాలి. ఇది మూడో మెట్టు.
సమాజంతో పాటు, రకరకాల ప్రాణికోటి జీవిస్తుంది, వాటిని కాపాడుకోవడం కూడా మన బాధ్యతే. శాస్త్రం కూడా అదే చెబుతుంది. ప్రతి వస్తువు కూడా మన యొక్క ఉనికికి ఆధారమే. కొన్ని జీవుల ద్వారా మనం ఎక్కువ లాభం పొందవచ్చు, కొన్ని ఉపయోగపడక పోవచ్చు. కానీ వాటి కంటూ ఒక ప్రయోజనం ఉండే ఉంటుంది, ఈ విశ్వంలోని ప్రతి వస్తువుకి మరొక వస్తువుకి పరస్పర సంబంధం ఉంటుంది. ప్రపంచంలో ఏమూల ఒక గడ్డిపోచ కదిలినా అది ప్రపంచం అంతటిమీదా ప్రభావం ఉంటుంది. ఎంత ఎలా అనేది మనం గుర్తించలేనంతగా ఉంటుందేమో కాని తప్పక ఒక ప్రభావం ఉంటుంది. మన శరీరంలో ఒక భాగంలో నొప్పి అయితే మరొక భాగం ఎందుకు స్పందిస్తుంది. ఈ ప్రపంచంలోని ధూలికణం కదిలినా, గాలి తరంగం వీచినా, చిన్న నీటి బొట్టు కదిలినా ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువుకీ స్పందన ఉంటుంది. అట్లా ప్రపంచంలో ఉండే ప్రతి జీవితో మనకు సంబంధం ఉంటుంది. కదిలే జంతువులే కాదు, కదలని చెట్లు, రాల్లు, గాలి అన్నింటితో సంబంధం ఉంటుంది. మన బుద్దిలో ఒక భాగం వాటికి కూడా కెటాయించాలి. మన చుట్టూ ఉండే ప్రాణికోటితో సహా ప్రకృతిలోని నీటితో, నేలతో, గాలితో అట్లానే ప్రవర్తించాలి. అందుకే వేదమంత్రాలలో "ఓం ద్యౌ శాంతిః అంతరిక్షగుం శాంతిః పృథివీ శాంతిః " ఆకాశానికి శాంతి కలుగుగాక, భూమికి శాంతి కలుగుగాక, అంతరిక్షానికి శాంతి కలుగుగాక అని ప్రార్థిస్తారు. ఇదంతా ఏమిటో చాదస్తం అని కొందరి అభిప్రాయం. అది ఎవడెవడికి వాడిదాకా వచ్చినప్పుడు అర్థం అవుతుంది. శరీరం పంచభూతాల కలయిక. ఒక్కో సారి ఒకటి ఎక్కువ, తక్కువ లైతే ఏమవుతుందో మనకు తెలుసు. ఆకాశం తక్కువైటే అంటే ఖాలి తక్కువ అయితే భుక్తాయసం. నీటి శాతం పెరిగితే శరీరం వాచి కష్టమే. ఒక్కో సారి వేడి శాంతం పెరిగి నీరు తగ్గుతుంది, అప్పుడు శరీరంలో నీటిని ఎక్కించుకోవాల్సి ఉంటుంది. ప్రకృతిలో కూడా అంతే కదా. అది గుర్తించగలిగేవాడు మానవుడు. మన శరీరంలో మట్టి భాగం కానీ, నీటిభాగం కానీ, గాలి భాగం గానీ, అగ్ని భాగం గానీ ఎక్కువైతే ఏమవుతుందో తెలుసు మనకు. ఎది ఎక్కువైనా, ఏది తక్కువైనా ఇబ్బందే. అట్లానే ప్రకృతిలో ఏది ఎక్కువ ఏది తక్కువ కాకుండా చూసుకోవడం మన బాధ్యత. ఇది నాలుగో స్థాయి.
ఈ శరీరాన్ని మనకిచ్చి, వెనకాతల ఉండి నడిపే తత్వం బ్రహ్మ తత్వం. దైవం అంటాం. పరమాత్మ అంటాం. అక్కడి దాకా గుర్తించి, మనకు దైవానికి ఉన్న సంబంధం గుర్తించి మన బుద్దిలో ఒక భాగాన్ని కెటాయించ గలిగితే అది ఐదవ భాగం. ఇది ఐదో మెట్టు.
ఈ ఐదింటికి మన బుద్దిలో ఒక్కో భాగం ఇచ్చి ఆలోచించగలగాలి, దాన్ని కార్య రూపం చేయాలి. ఒకదానితో ఒకటి పరస్పర భేదాలు రాకుండా చూసుకోవాలి. ఒకదానితో ఒకటి పరస్పర సంబంధం కలిగినటువంటివి, ఏదో ఒకదానికే మనం పూర్తిగా కెటాయిస్తే, అది సరికాదు. ఇవన్నింటిని ఆలోచించి బ్రతక గలిగితే మనిషి అంటారు. ఇది మానవ జన్మకు ఉన్న గొప్పతనం. అది గ్రహించి బ్రతికితే వేరే యోగాలు, యాగాలు చేయనవసరం లేదు, ఈ దుఃఖ భూయిష్టమైన జన్మలలోకి రానవసరం లేదు. అది మోక్షం అంటే. శరీరం పోతే మరోక శరీరం వస్తుంది, మనం అది కోరటంలేదు, ఈ కర్మ బంధం తొలగాలి అని కోరుకుంటుంన్నాం. ఆట్లా తొలగించుకొనే అవకాశం మానవ జన్మకు మాత్రమే ఉంది. జీవితాన్ని ఎలా వాడుకోవాలో, మన చుట్టు ఉండే వారి ప్రేమను ఎట్లా పొందగల్గుతామో, అట్లే వారిని ఆనందంగా ఉంచగలమో ఒకరు ఆచరించి చూపితే మనం కొంతనైనా సాధించగలం. ఇవన్నీ ఆచరించి చూపాడు శ్రీరామచంద్రుడు ఒక మానవుడిగా, ఆయన ఎలా ఆచరించాడు, ఎందుకు ఆచరించాడు, ఏమి ఆచరించడం తెలుసుకోవడం విలువలకి తిలోదకాలు ఇచ్చే ఈనాటి మన వంటి వారికి చాలా అవసరం.

No comments:
Post a Comment