విష్ణు సహస్రనామం ఎలా జనించింది ?
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
హిందూ సాంప్రదాయం లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన స్తోత్ర రత్నం విష్ణుసహస్రనామావళి. ఈ విష్ణు సహస్రనామాలను మొదట ఎవరు స్తుతించారు?
భారత యుద్ధం లో అత్యంత ప్రధాన పాత్రధారి అయిన భీష్మ పితామహునికీ విష్ణుసహస్రనామాలకీ సంబంధం ఏమిటి? భీష్మ ఏకాదశి ని “విష్ణు సహస్ర నామ జయంతి” అని ఎందుకంటారు?
☘భీష్ముని గొప్పదనం :☘
మహాభారత కథలో అత్యున్నతమైన పాత్ర భీష్మ పితామహునిది. కురు వంశ పెద్దగా తన ధర్మాన్ని దాటలేక, తప్పక కౌరవ పక్షాన నిలిచి చివరికి అంపశయ్యపై అసువులుబాసిన వాడు భీష్ముడు.
ఆయన గంగా శంతనుల పుత్రుడు. అసలు పేరు దేవవ్రతుడు. సవతి తల్లి అయిన సత్యవతికి ఇచ్చిన మాటకొసం జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీషణ ప్రతిజ్ఞ చేసి భీష్ముడయ్యాడు. రాచరికాన్ని తుచ్ఛంగా పరిత్యజించిన మహోన్నతుడు భీష్ముడు.
పాండవులందరినీ ఒంటిచేత్తో సంహరించగల అజేయమైన శక్తిమంతుడు భీష్ముడు.
కృష్ణుడంతటి వాడు తమ పక్షాన ఉన్నా భీష్ముని జయించే శక్తి లేక అంబను అడ్డుపెట్టుకుని ఆయనను అంపశయ్య పాలుచేశారు పాండవులు.
యుద్ధం లో రథసారధ్యం తప్ప ఆయుధాలు చేపట్టను అని ప్రతిన బూనిన శ్రీకృష్ణుడు భీష్ముని ప్రతాపాన్ని తాళలేక ఉగ్రుడై రథచక్రాన్ని ఎత్తి భీష్ముని పైకి వచ్చాడు.
తాను కోరినప్పుడే తనకు చావు రావాలన్న వరం పొందిన వాడు భీష్ముడు. నిండు సభలో ద్రౌపదికి అవమానం జరుగుతున్నా తాను నోరువిప్పనందుకు గాను శిక్షగా 58 రోజులు అంపశయ్యపై నే ఉన్నాడు.
భీష్ముడు చాలా గొప్ప కృష్ణభక్తుడు. అర్జునుని కన్నా ఎక్కువగా స్వామికి ఆత్మసమర్పణ చేసుకుని, చేసేది చేయించేదీ అంతా కృష్ణపరమాత్ముడే అని నమ్మిన వాడు. అందుకే
“మాతా పితా భ్రాతా నివాసః శరణం సుహ్రుత్ గతిః గమ్యం సర్వం నారాయణః” అంటాడు. తల్లీ, తండ్రీ, సోదరుడూ, ఇల్లూ అన్నీ నారాయణుడే, సద్గతీ, గమ్యం అన్నీ నారాయణుడే అనుకుంటాడు భీష్ముడు .
☘విష్ణుసహస్రనామం ఎలా జనించింది ?☘
శ్రీకృష్ణుడు భీష్ముని సకాలశాస్త్ర పారంగతునిగా, మహామనిషిగా భావించాడు. ప్రపంచం లోని ధర్మ విషయాలను ప్రామాణికంగా చెప్పగల వాడు ఒక్క భీష్ముడే అని గుర్తించాడు.
అందుకే పాండవులతో సహా భీష్ముని చేరుకుని ఆయన చివరి సందేశాన్ని ఆ పరమాత్ముడే సాక్షీభూతమై విన్నాడు.
భీష్ముడు పాండవులకు అనేక ధర్మాలనూ, విష్ణు సహస్ర నామాలను చెప్పాడు. మాఘ శుద్ధ ఏకాదశి నాడు చివరికి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత విష్ణుమూర్తిని సహస్రనామాల తో కొలిచి విశ్వరూప సందర్శనాన్ని పొంది, తన ఇచ్ఛా నుసారంగా తనువును చాలించాడు.
భీష్ముడు విష్ణుసహస్రనామాలను వెల్లడించిన రోజుని “జయ ఏకాదశి” మరియు “విష్ణు సహస్రనామ జయంతి” అని అంటారని పెద్దలు చెబుతారు.
ఈ రోజున విష్ణు సహస్రనామ జపం చేయడం వల్ల సకల శుభాలూ కలిగి జన్మాంతం లో హరి సాన్నిధ్యం కలుగుతుందని భీష్ముని ఉవాచ.

No comments:
Post a Comment