Saturday, February 15, 2020

ఆచరణ

☘ సముద్రం మింగేస్తుందని భయపడితే, పడవ పుట్టేదే కాదు. 🍀

🍃 ఇది నేను చేయగలనా?మునిగిపోతానేమో!...అనిపించినప్పుడల్లా, మొదటిసారి నీటిలో తేలిన పడవ అడుగుని గుర్తుతెచ్చుకో.🍃

🎋 ఆకాశం తోసేస్తుందని ప్రయత్నించడం ఆపితే, విమానం ఎగిసేదే కాదు. 🌾

🍃 ఇది నా వల్ల అవుతుందా? పడిపోతానేమో!...అని భయపడినప్పుడల్లా, మొదటిసారి గాలిని చీలుస్తూ ముందుకు దూసుకుపోయిన విమానపు రెక్క అంచుని గుర్తుతెచ్చుకో.🍃


🌿 ఏది చదివాకా ఆలోచిస్తావు... ఇదంతా నాకు తెలుసులే, అర్థం అయ్యింది లే! అని వదిలేసే నీ జీవితానికి సార్థక ఇచ్చే అవకాశం కోల్పోతావు... 🌿

🍃ఆలోచించి.... 🌿ఆచరించి చూడు.... 🌱ఈ ప్రపంచం లో నీకు ఒక స్థానము ఉంటుంది.

🌿నీవు చేసే కార్యక్రమానికి నీతో నడవడానికి ఎన్నో కాళ్ళు కదులుతాయి. ☘నీకు తోడుగా ఎంతోమంది వాళ్ళ చేయిని అందిస్తారు. 🍃

☘నీ మెదడు లో ఉండే ఆలోచన ఎంత అద్భుతమైందైనా దాని అవసరం తెలియనంతవరకు ప్రపంచానికి అనవసరం. ☘

🌿ఎంత చిన్నదైనా ఆచరణే దానికి అవసరం. 🌿

🍃సాయం చేద్దాం అనేది మథర్‌ తెరెస్సా ఆలోచన కాదు,🌿 ఆచరణ.🍃

☘భార్య జ్ఞాపకాన్ని చరిత్రలో శాశ్వతం చేద్దాం అనేది షాజహాన్‌ ఆలోచన కాదు, ☘ఆచరణ.🌿

🍃ఆలోచన అంకె.🍃 ఆచరణ సంతకం.🍃

☘అంకెలు ఎవరు రాసినా ఒకటే.🍀 సంతకం మాత్రం పెట్టినవాడికే సొంతం. 🍀

🌿ఆలోచన మంత్రమైతే, 🌿ఆచరణ యజ్ఞం.🌿 నీ జీవితానికి ఒక చరిత్ర. 🌿

🍃దేవతలు దయ తలుస్తారో లేదో తరువాత సంగతి. నిన్ను నువ్వు కాల్చుకొనైనా, ముందు యజ్ఞం పూర్తి చేయి. ప్రచండ శంఖమైనా పూరించకపోతే శవంతో సమానం. 🍂

🍃శని ఆదివారాలూ, అమావాస్య పౌర్ణమిలు, నెలలు, వస్తూ పోతూ వుంటాయి. 🍃

🌿లే............ ☘ప్రతి రోజు నీదే... 🍀ప్రతి క్షణం ఒక యజ్ఞమే.. 🍀ఆచరించు... 🌿

🍃చిన్న చిన్న నీ ఆలోచనలని ఆచరణలో చూపించు... ఫలితం అదే వస్తుంది... 🍀

☘చరిత్రలో అంకెలు చాలా వున్నాయి. సంతకాలు కావాలి. ☘

🎋ఎన్నో సంతకాలగురించి... ఎందరో మేధావుల గురించి ఈ ప్రపంచం మాట్లాడుకుతుంది.. నీవు వాళ్ళ చెంతన చేరడానికి కృషి చేయి... చిరస్థాయిగా నిలిచిపో... 🌾

☘ప్రతి ఒకరికి మరణం ఉంటుంది... మరణించాక కూడా అందరి మనస్సులో కాకున్నా కొందరి మనస్సులో నీవు నిలిచినా నీవు జీవిస్తునట్లే... 🍀

☘నీవు చేసే మంచి పనులకి... నీకు మరణం లేదు...🍀

🍃ప్రతి మనిషి మంచిగా ఉండాలి.. 🍀నలుగురికి సహాయపడాలి... 🍃అందరు బాగుండాలి 🙏

No comments:

Post a Comment