Sunday, February 2, 2020

మనసు

💐 మనసు 💐

👉 మనసును స్వేచ్ఛగా వదిలేయకూడదు.

👉దానిలోని భావాల్ని నిత్యం కనిపెడుతుండాలి.

👉అసలు కొన్ని ఆలోచనలు మనిషికి తెలియకుండా లోపలికి ఎలా ప్రవేశిస్తాయా అనిపిస్తుంది ఒక్కోసారి.

👉అప్పుడు అతడు తనను తాను మరచి, వాటికి వశమవుతుంటాడు.

👉 ప్రతి ఆలోచనకూ అవకాశమిస్తే, మనిషి తుపానులో ఇరుక్కుపోతాడు.

👉 తనకు తానే గందరగోళ పరిస్థితి సృష్టించుకుంటాడు.

👉 అందువల్ల అతడు తన మనసును ఎప్పుడూ వేయి కళ్లతో కనిపెట్టాలి.

👉 ఒక భావాన్ని మనసు పట్టుకొని వస్తుంది.

👉దానితో మనిషి స్నేహం చేసి, మరిన్ని భావాలకు ఆస్కార మిస్తాడు.

👉 అవి మంచివైతే మంచి వైపు, లేదంటే చెడు వైపు లాగుతుంది.

👉 మనసు పనిగట్టుకుని అన్నీ మంచి భావాలనే ఇవ్వదు.

👉 అతడే ప్రతి భావనలోనూ మంచిని చూడాలి.

👉 తన మనసుకు నిరంతర ధ్యానం ద్వారా శిక్షణనివ్వాలి.

👉 ఒక్క ప్రతికూల ఆలోచననైనా రానివ్వకూడదు. దానికి అవకాశమూ ఇవ్వకూడదు.

👉 పలు రకాల ఆలోచనలతో, మానవ జీవన ప్రయాణం చిల్లులు పడిన పడవలా మారుతుంది.

👉 ‘నా సాధన అంతా నా మనసుతోనే’ అనేవారు అరుణాచల రమణ మహర్షి .

👉 ప్రతీ మనషీ కూడాను ధ్యానం ద్వారా తన మనసు యెుక్క తీరుతెన్నులను ఎప్పటికప్పుడు పరిశీలించు కోవాలని ఆయన చెబుతుండేవారు.

👉 గొప్ప భావాలనే మనిషి పోషించాలి.

👉 భ్రమల్లోకి బలవంతంగా నెట్టే వూహల్ని మొగ్గలోనే ధ్యానం ద్వారా తుంచాల్సిన బాధ్యత అతడిదే.

👉 వూహను ఉపయోగించుకునే నేర్పరితనం పెంచుకోవాలి.
👉 వీటన్నింటికీ ముందు, అతడికి తెలియాల్సింది తన మనసు పోకడ !సంపర్కం తీరుతెన్నులు.

👉 మనసు గురించి తెలియకుండా, ఆధ్యాత్మికతపై మాట్లాడే అవకాశమే మనిషికి లేదు.

👉 అతడి సాధన అంతా మనసుతోనే! తను చేసే యుద్దం తన మనస్సుతోనే.

👉 మనసు లోపలికి, తనలోకి తానే అతడు ప్రయాణించాలి.

👉 తన అంతరంగ ప్రయాణం అద్భుతంగా సాగాలి.

👉 అందమైన మనసు. రంగురంగుల మనసు. ఇంతవరకు ఒక ప్రపంచాన్ని చూపించింది.

👉మనసు లో ఎన్ని ప్రపంచాలో! వాటి నుంచి బయటకు వెళ్లాలి మనిషి.

👉 అలా లేనప్పుడు అది పురోగమనం కాదు- తిరోగమనం!

👉 మనసుకు మించిన దేవుడు లేడు.

👉 నేను ను మించిన మంత్రం లేదు.

👉 మనసులోనే అంతరాలయంలో మూల విరాట్టు సేదతీరుతున్నాడు.

👉నీలోపల దివ్యంగా ఉన్నాడు.

👉పాల సముద్రంలో శేషశయ్యపై పవళించి ఉన్నాడు

👉 నీవు ధ్యానం చేసి మేల్కొలుపు.

మంచిగా మల్చుకొంటే

👉 నీ మనసే దైవం

👉 నువ్వే దైవం

👉 అహం బ్రహ్మాస్మి అని ఓంకారం చెట్టుమీద గల ఆత్మపక్షి అరిచి చెబుతోంది.

👉 అదొక దివ్యమైన, అద్భుతమైన, అపురూపమైన దృశ్యం. అనంతమైన అనుభూతి.

👉 దాని కోసమే మనిషి జన్మించాడు.

👉 తన మనసుతోనే అతడు బతుకుతాడు.

👉 ఆ మనస్సును ధ్యానం అనే అద్దంలోనే అన్నీ చూస్తాడు.

👉 అంతరంగంలో అంతర్ముఖుడైనవాడికి ఆకలిదప్పులు ఉండవు.

👉 ఇంతకాలం ఏ మనసైతే అతణ్ని పట్టి పీడించిందో- అదే మనస్సు వేషం, భాషలు మార్చుకొని ‘జ్ఞాన బ్రహ్మ’గా దర్శనమిస్తుంది.

👍 అదే మనసు యెుక్క విశ్వరూపం!

👉 ‘తన ధర్మం వైపు అడుగు వేసే ఉత్తమ మానవుణ్ని దేవుడుగా తయారుచేయడమే దేవతల లక్ష్యం.

👉 ఆ లక్ష్యసాధనకు ముందుగా కావాల్సింది మనస్సును ధ్యానంతో వసుపర్చుకోవడం.

👉 ‘మర్రి విత్తనంలోనే మహావృక్షం ఉంది’ అని పెద్దల మాట.

👉 అలాగే సర్వ లోకాలూ మనిషి మనసులోనే ఉన్నాయి.

👉 ఆలోకాలతోనే అతడికి పని.
👉ఆకాశంలా విశాలత్వం,
వాయువులా సర్వ వ్యాపకత్వం. మనియికి
అవసరమవుతాయి.
👉 మనసు సంపర్కం తేజస్సును అగ్నిలా, స్వచ్ఛతను జలంలా, సుగంధాన్ని మట్టిలా అనుభవంలోకి తెచ్చుకోవాల్సింది మనిషే!

👉 తన మనసును దాటిపోవాల్సింది, హృదయంగా మారిపోవాల్సింది, దివ్యత్వాన్ని నలుదిశలా వ్యాపింపజేయాల్సింది అతడే!

👉 మారిన మనసే ఉదాత్త హృదయం.
👉 ఆ హృదయ నివాసి దైవమే!
👉అలా అన్నింటినీ చూస్తుంటే, మనిషి మనసు నిర్మల మవుతుంది.

👉బుద్ధుడు బోధించినట్లు- తాపీగా ఒడ్డున ఉండండి. మనసును అలాగే నిశితంగా గమనిస్తుండండి.

👉 ఏం జరుగుతుందో అప్పుడు మీరే చూడండి!

👉ఇదియే మనస్సు యెుక్క విశ్వరూపం. 🙏

No comments:

Post a Comment