Tuesday, March 3, 2020

సనాతన ధర్మం

#సనాతన_ధర్మం #ఋషివర్య
"సనాతన ధర్మం".... ఈ పదం వింటేనే ఏదో తెలియని ఊహలోకి వెళ్ళిపోతా౦. ఎందుకంటే "సనాతన ధర్మం" అనేది మతం అని ఎప్పుడూ అనుకోవద్దు.. అది జీవితం! "భరతఖండం"లో పుట్టిన ప్రతీ మనిషి వేదాన్ని ప్రమాణంగా స్వీకరిస్తూ ఊపిరి తీసుకుంటాడు.
ఒక తండ్రి కుటుంబానికి సవాలక్ష నియమాలు పెడతారు. ఎందుకు? తన కుటుంబాన్ని ఎల్లప్పుడు మంచి దారిలో పెట్టి వృద్దిలోకి రానివ్వాలి అని.
"సనాతన ధర్మం" మనకి "తండ్రి" లాంటిది. ఎందుకంటే శివుడు ఎప్పుడు నుంచి ఉన్నారో, అప్పటినుంచే ఈ సనాతన ధర్మం ఉంది. సనాతన ధర్మం ఒక తండ్రిలా "వేదం" అనే నియమం పెట్టింది. వాటిని మనం అనుసరిస్తేనే మన జీవితాలు కూడా మంచి దారిలో వెళ్లి వృద్ధిలోకి వస్తాం. వినకుండా స్వధర్మాలకి పోతే, సమాజానికి ప్రమాదకరంగా మన జీవితాలు మారిపోతాయి.
ఆ వేదం నుండి వచ్చినవే మన హిందూ "శాస్త్రాలు". ఆ శాస్త్రాలలో అనేక నియమాలు ఉంటాయి.
ఆరోగ్యం, వాస్తు, జ్యోస్తిష్య౦ ఇలా అనేకం. ప్రతీ చెట్టు, పుట్ట, నీరు, గాలి అన్నింటిలో ఆ పమాత్మని చూస్తూ ఉంటాం. ఎదుకంటే అవి లేకుంటే మన ప్రాణం కూడా ఉండదు కాబట్టి. అందుకే "హిందువులు" అన్నింటినీ పూజిస్తారు. అది పిచ్చితనం కాదు... మనం ప్రకృతికి ఇచ్చే గౌరవం, మర్యాద!
ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, హిందూ శాస్త్రం అనేది చాలా సూక్ష్మంగా ఉంటుంది.
బయట నుంచి ఇంటికి రాగానే "కాళ్ళు" కడిగి లోనికి రావడం, బ్రహ్మ మూహూర్తంలో లేచి స్నానం
చేసి పూజ చేయడం. ఆంటే సూర్యోదయానికి ముందే లేవడం. ఆడవారు నిత్యం బొట్టు, గాజులని ధరించడం లాంటి చిన్న చిన్నవి ఉంటాయి. పాటించడం పెద్ద కష్టం ఏమీ కావు. కాని "కలియుగ" లక్షణం ఒకటి ఉంది కదూ... మనుష్యులు ఏది సుఖమో దానికే అ౦టిపెట్టుకుపోతారు.. ఇక "ఆచరణ" ఎక్కడిది!!? గాలికే.. కష్టే ఫలీ అంటారు... కాని ఆ కష్టపడే తత్త్వం నశించిపోతుంది!
"అకాల మరణం" అనే లక్షణం ఈ కలియుగ ధర్మ౦లో ఉన్న౦దున.. ఆడా, మగ అని తేడా లేకుండా అందరూ "వేదానికి" అంటి పెట్టుకుని ఉండాలి. అదే మనకి రక్షణగా ఉంటుంది. స్త్రీలు వారికోసం "వేదం" యేమని చెప్పిందో ఆ నియమాలు పాటిస్తే భర్త యొక్క జీవితం సుఖంగా గడుస్తుంది, అకాల మరణానికి దూరముగా ఉంటాడు. భర్త బాగుంటే కుటుంబం మొత్తం
బాగుంటుంది. అలానే మగవారికి "వేదం"లో ఉన్న నియమాలను పాటిస్తే, స్త్రీ యొక్క జీవితం మంచిగా ఉంది, ఆ కుటుంబానికి, చుట్టూ ఉన్నవారికి సంతోషం లభిస్తుంది.
కాని ప్రస్తుత రోజుల్లో "వేదాన్ని" తిరస్కరించి సుఖ జీవినాన్ని గడపడానికి అలవాటుపడిపోయాం.
అందుకే మన జీవితాలు తారుమరైపోయి, ఎలా జీవిస్తున్నామో తెలియదు, కష్టాలు కోరి కొని
తెచ్చుకుంటున్నాం అన్న సంగతి కూడా మరచిపోయాం. పెద్దలు చెప్పిన మాట వినము, కాని
ఎప్పుడు మంచే జరగాలి, కష్టాలు రాకుండా సుఖంగా జీవితం గడిచిపోవాలి అనేదే నిత్య ఆలోచన.
శ్రీ మహా విష్ణువు ఈ కలియుగములో "కల్కి" అవతారం పొందడానికి పెద్ద కారణం ఆ వేద తిరస్కరనే..!
ఈ సుఖ జీవానికి అలవాటు పడిపోయినవారే ముఖ్యంగా మత మార్పిడి చేసుకుంటారు. ఎందుకంటే వాటిలో మనకున్నన్ని నియమాలు, శాస్త్రాలు ఉండవు కనుక. ఉదయానే లేవాలి, వ్రతాలు చేయాలి, అవీ ఇవీ అని. కాని ఆ కష్టం లోనే తెలియని సుఖం దాగి ఉన్నదని మనం తెలుసుకోవాలి!
కాబట్టి ప్రజలారా.. ప్రేమతో జీవించండి, తగాదాలకి దూరంగా ఉందండి, భార్య భర్తలు ప్రేమతో జీవించండి, ఎల్లప్పుడూ దైవాన్ని స్మరిస్తూ ఉందండీ. అలానే ఈ విషయం అందరికీ తెలియజేయండి..


"సనాతన ధర్మంలో" ఉన్నవారికి ఉండవలసిన లక్షణాలు
సత్యం దమః తపః శౌచం సంతోషోహ్రీః క్షమార్జవమ్l
జ్ఞానం శమో దయా ధ్యానం ఏష ధర్మ స్సనాతనః ll
అంటే...
సత్యాన్ని పలకడం, ఇంద్రియ నిగ్రహం, తపస్సు, శుచిగా ఉండడం, సంతోషం, సిగ్గు, సహనం, మంచి స్వభావం, జ్ఞానం, కరుణ, ధ్యానం.. ఇవన్నీ సనాతన ధర్మ లక్షణాలు!

No comments:

Post a Comment