Tuesday, June 2, 2020

Covid-19 పై పరిశోధన ఫలితాలు.

Covid-19 పై పరిశోధన ఫలితాలు.

1. కారులో ముగ్గురు ప్రయాణించవచ్చు. నాల్గవ వ్యక్తి కారెక్కితే అతనికి మాత్రమే కరోనా సంక్రమిస్తుంది.

2. టూవీలర్ పై వెనక కూర్చున్న వ్యక్తి మాత్రమే కరోనాకు ఆకర్శితుడౌతాడు. బైక్ తోలే వ్యక్తికి కరోనా సోకదు.

3. బస్సులో 30 మంది మాత్రమే ప్రయాణించాలి. 31 వ వ్యక్తి ఎక్కితే కరోనా వస్తుంది.

4. సాయంత్రం ఏడుగంటలకు కరోనా బయటికి వచ్చి, ఉదయం 7 గంటల వరకు అటుఇటు బాగా తిరుగుతుంది. కావున మీరు ఆ సమయంలో బయటకు రాకూడదు.

5. ఒకవేళ మీరు మద్యశాల నుండి మద్యం కొంటే కరోనా తప్పుగా భావించదు. కాని బార్ లో కూర్చుండి తాగితే కరోనా పట్టుకుంటుంది.

6. ఒకవేళ మీరు పాస్ తీసుకొని వివిధ జోన్లలో ప్రయాణించినా పరవాలేదు. కాని పాస్ లేకుండా ప్రయాణిస్తే కరోనా మిమ్మల్ని అమాంతం మింగేస్తుంది.

7. మీరు ఎక్కడి నుండైనా సామాన్లు కొంటే కరోనా ఏమిచేయదు. కాని కమర్షియల్ కాంప్లెక్స్ లలో, షాపింగ్ మాల్ లలో కరోనా మీకోసం కాచుకొని కూర్చుంది.

8. మాస్క్ లేకున్నా, రాజకీయనాయకులను వారి అనుచరులను కరోనా తాకే ధైర్యం కూడాచేయదు.కాని సామాన్య మానవులను మాస్క్ లేకుండా చూసి అమాంతం మింగేస్తుంది.

9. ఆదివారం నాడు బయటికి వెళ్ళకండి కరోనా చక్కర్లు కొడుతుంది. ఇతర రోజుల్లో అది సెలవుపై వెళ్తుంది.

10. అది దేవాలయాలు, మసీదులలో, స్కూళ్ళలో మీ కోసం ఎదురుచూస్తుంది. కాని ఫ్యాక్టరీలలో ఇతర పని ప్రదేశాలనుండి పారిపోతుంది.

11. ఒకవేళ మీరు హోటల్ లో భోజనం చేస్తే కరోనా తప్పకపట్టుకుంటుంది. కాని హోటల్ భోజనం ఇంటికి తీసుకెళ్ళితింటే అది మిమ్మల్ని ఏమిచేయదు.

12. అది ధనవంతుల పెళ్ళిల్లకు ఎంతమంది వచ్చినా ఏమి అనదు. కాని పేదల పెళ్ళికి 50కి మించి ఒక్కరు ఎక్కువొచ్చినా
కరోనా రెచ్చిపోతది.
13. మార్కెట్లలో కూరగాయలు అమ్మితే కరోనా వస్తుంది.
కానీ బస్టాండ్లలోలలో స్టేడియంలో అమ్మితే కరోనా
రాదు.
కావున జాగరూకతతో ఉండండి..
కరోనాతో జీవించటం నేర్చుకోండి... 🙏

No comments:

Post a Comment