Thursday, October 20, 2022

వాసనలు ఉన్నంత కాలం శాంతి లభించనట్లేనా ?

 💖💖💖
       💖💖 *"363"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼

*"వాసనలు ఉన్నంత కాలం శాంతి లభించనట్లేనా ?"*
***************************

*"వాసనలు నశిస్తేనే శాంతి కలుగుతుంది. అందుకు తానెవరో విచారించి తెలుసుకోవాలి. విచారించకుండా అదెట్లా వస్తుందని ప్రశ్నించటం తగదు. ఉన్నదే శాంతి. ఉన్నదాన్ని విచారించి తెలుసుకునే ప్రయత్నం చేయమని భగవాన్ శ్రీరమణమహర్షి చెప్పారు. బొట్టు పెట్టుకుంటే అబద్ధం కూడా ఆడనంత పవిత్రంగా ఉండాలి. నీ పూజ, జపం వల్ల ఎవరికీ లాభంలేదు. కానీ నీ చెడు ప్రవర్తన వల్ల అనేకమందికి నష్టం ఉంది. రోజూ మార్చుకునే దుస్తుల విషయంలో ఎంత శుభ్రత పాటిస్తామో అలాగే ఎప్పటికీ ఉండే మనసు విషయంలో కూడా శుభ్రతను పాటించాలి. మన జీవితం అంతా జనన మరణాల మధ్య ఉంది. నిజానికి ఒక్కసారే జన్మించాం. నిరంతరం మరణిస్తూనే ఉన్నాం. టాడుకు ఒక చివర నిప్పు అంటిస్తే క్షణ క్షణం కాలుతూ వెళ్తుంది. వయస్సు పెరగటం అంటే ఆయుష్షు తగ్గటమే. మనది నూరేండ్ల జీవితం కాదు, నూరేండ్ల మరణం. మన జీవితం అంతా నిర్యాణంతోనే ముడిపడివుంది. నిర్యాణం పూర్ణంగా ఉంది. పూర్ణం అంటే మరో గుణానికి తావులేని స్థితి. సంచి ఖాళీగా ఉందంటే, అందులో సంచి గుణం పూర్తిగా ఉందని అర్ధం. సంచిలో ఏదైనా వస్తువు ఉంటే ఆ సంచి పరిపూర్ణకు భంగం ఏర్పడినట్లే. అలాగే మన స్వరూపమైన నిరాకార పరమశాంతిని భంగపర్చే ఏ రూపనామాలైనా మన పూర్ణతకు ఆటంకమే. కానీ ఆ పూర్ణస్థితికి చేరేవరకు మనం అనుసరిస్తున్న సాధనామార్గాన్ని వదలకుండా ముందుకు సాగాలి. వాసనలను నశింపజేసుకోవాలి !"*

*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*
          🌼💖🌼💖🌼
                🌼🕉️🌼
              

No comments:

Post a Comment