Thursday, October 20, 2022

బాహ్య సమాధి, అంతర్ సమాధి అంటారు, ఏమిటి వీటి మధ్య ఉన్న వ్యత్యాసం ?

 💖💖💖
       💖💖 *"362"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼

*"బాహ్య సమాధి, అంతర్ సమాధి అంటారు, ఏమిటి వీటి మధ్య ఉన్న వ్యత్యాసం ?"*
**************************

*"ఈ లోకంలో ఉంటూ కూడా ఏదీ కావలనుకోకపోవటం బాహ్య సమాధి. అంటే మంచి ప్రవర్తన బహిర్ సమాధి. దేహస్మృతి కూడా కోల్పోవటం అంతర్ సమాధి. అంతర్ సమాధి అంటే నిశ్శబ్ధం. మనం ఆలోచన అనుకుంటున్నదంతా మనలో మనం మాట్లాడుకునే మాటలు. అంటే శబ్ధాలు. వాటిని ఆపితే మిగిలేది నిశ్శబ్ధం. అప్పటివరకూ మ్రోగిన గంటను తిరిగి మ్రోగించకుండా ఉంచితే ఏర్పడేది నిశ్శబ్ధం. నిశ్శబ్ధంగా ఉన్న తన ఉనికిని తెలుసుకోవటం అంతర్ సమాధి. మెలకువతో ఉండి కూడా మనకి ఈ ప్రపంచంలో ఏది స్మృతిలోకి రావాలన్నా ముందు దేహ స్మృతిలోకి రావాలి. అటువంటి దేహస్మృతి కూడా పోవటమే అంతర్ సమాధి. అంటే కేవలం స్మృతిగా మాత్రమే ఉండటం. నేను ఆత్మననుకొని నిశ్చింతగా శాంతితో ఉండటం ఒక పద్ధతి. బాహ్య విషయాలను ఆశించకుండా సత్ప్రవర్తనతో శాంతిగా ఉండటం మరొక పద్ధతి !"*

*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*
           🌼💖🌼💖🌼
                 🌼🕉️🌼
         

No comments:

Post a Comment