🔥నరకాన్ని తప్పించుకుని, జీవితాన్ని ఇహంలో, పరంలోను సార్ధకం చేసుకోవాలి అంటే?🔥
🌻🌻🌻🌻🌻🌻🌻🌻
మొట్టమొదటిగా, వేదం ఎవ్వర్ని పరబ్రహ్మంగా స్తుతిస్తుందో? ఆ పరబ్రహ్మాన్నే దైవంగా పూజించాలి!
వేదం ఆమోదించనివారిని పూజించేవారికి "సర్వనాశనంతో పాటు, దీర్ఘకాలం నరకప్రాప్తి అవుతుంది" అని సాక్షాత్తూ శివుడే త్రిపురాసుర సంహారంలో చెప్పినట్టు శివ పురాణంలో ఉంది.
ఈశ్వరుడు, శ్రీ కృష్ణుడు చెప్పేమాటలు పరమసత్యం, పరమప్రమాణం!
వాటికి తిరుగులేదు అని అర్ధం చేస్కోండి.
(నేను సొంతంగా చెప్తున్న విషయం అయితే కాదు)
వ్యాసభగవానుడు మనకందించిన 18 పురాణాల్లో విఘ్నేశ్వరుడు మొదలు శివయ్య, పార్వతీమాత, శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మి, శారదాంబ, కార్తికేయుడు, అయ్యప్ప, దత్తాత్రేయుడు, శ్రీ సూర్య నారాయణస్వామి, ఆంజనేయస్వామి, కాలభైరవుడు, వీరభద్రుడు, శ్రీమన్నారాయణుడు అవతారాలని, అమ్మవారి అంశలని శాస్త్రాలు పరబ్రహ్మంగా స్తుతించాయి.
ఒకే పరమాత్మ ఇన్ని అవతారమూర్తుల రూపాల్లో లోకాల్ని అనుగ్రహిస్తుంటాడు అని అర్ధం చేసుకోవాలి.
వీరిలో కనీసం ఏ ఒక్కర్ని ఇష్టదైవంగా కొలుచుకున్నా అదృష్టమే!
మిగిలిన దేవతామూర్తులని నిత్యం పూజించకపోయినా కూడా వారి అనుగ్రహం కూడా వస్తుంది! కారణం ఒకే పరబ్రహ్మం ఇన్ని అవతారమూర్తుల రూపాల్లో మనల్ని అనుగ్రహిస్తుంటుంది.
అయితే, మన పురాణాల్లో దైవంగా ప్రతిపాదించబడని! వేదం ఆమోదించనివారిని మాత్రం ఇష్టానుసారంగా పూజించకూడదు!
ఆదిశంకరాచార్యుల వారు, వెయ్యేళ్ళ క్రితం దేశంలో పెరిగిపోయిన 72 అవైదిక మతాలతో డిబేట్లు చేసి ఆ అవైదిక మతాలని మన దేశంలో లేకుండా చేసి, ధర్మసంస్థాపన చేశారు.
వేదం ఆమోదించనివారిని ఎవరు పూజించినా, వారు అధోగతి పాలవుతారు! (ఇది నేను సొంతంగా చెప్తున్న విషయం కాదు)
శ్రీ కృష్ణుభగవానుడు కూడా గీతలో ఈ విషయం ప్రస్తావించాడు!
"ఉత్తములు సాక్షాత్తూ పరబ్రహ్మాన్ని,
మధ్యములు దేవగణాలని, గ్రామదేవతల్ని
నీచులు అసురగణాలని, లేదా మానవమాత్రులని, లేదా దుష్టశక్తుల్ని, అంతకంటే తక్కువ స్థాయిని ఆశ్రయిస్తారు" అని!
ఇంకో రహస్యం, కర్మ బలంగా ఉన్నప్పుడే,
ఉత్తమమార్గంలో రాములవారి పాదాల దగ్గరికి కాకుండా,
నీచమార్గంలో అధోగతులు పాలయ్యేలా కర్మ బుద్ధిని ప్రేరేపిస్తుంది.
దుష్కర్మ ఇతరత్రా మార్గాల్లో జీవితం వ్యర్థం అయ్యేలా బుద్ధిని ప్రేరేపిస్తుంది.
నరకాన్ని తప్పించుకుని, జీవితాన్ని సార్ధకం చేసుకోవాలి అంటే?
మొట్టమొదటిగా చేయాల్సిందల్లా భాగవతం పూర్తి శ్రద్ధా, భక్తులతో వినాలి.
ఎక్కడ భాగవత పురాణం ప్రవచనం అని తెలిసినా, పిలిచినా పిలవకపోయినా వెళ్లి మళ్ళీమళ్ళీ భాగవతం భక్తితో వినాలి.
ఎంతో అదృష్టం ఉంటే గానీ, పరమ శ్రద్ధా భక్తులతో భాగవతం వినే అదృష్టం కలగదు.
భాగవతం తరువాత రెండో పెద్ద దివ్యాస్త్రం భగవద్గిత.
భగవద్గిత అంటేనే సంపూర్ణ జ్ఞానం, ఎంతో శ్రద్ధ పెడితే కానీ పూర్తిగా అర్ధమవ్వదు. శక్తివంచన లేకుండా భగవద్గితని అర్ధం చేసుకొనే ప్రయత్నం చెయ్యాలి.
అర్ధం చేసుకున్న జ్ఞానాన్ని గుర్తుపెట్టుకుని, ఆచరిస్తే కానీ, జీవుడికి ప్రమోషన్ రాదు! ఇక ఇందులో షార్ట్ కట్ అంటూ ఏమీ ఉండదు.
భాగవతం, భగవద్గిత మనసుకి వంటబడితే జీవుడికి ప్రమోషన్ వచ్చినట్టే! అంటే గోలోకప్రాప్తి!
గోలోకం అంటే ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడు కట్టిన ద్వారక కంటే,
ఓ లక్షరెట్లు అతి మహాసుందరంగా ఉండే ఊర్ధ్వలోకం!
భాగవతం, భగవద్గిత మనసుకి వంటబడితే, అప్పుడు శివపురాణం పూర్తిగా శ్రద్ధా, భక్తులతో వినాలి.
జీవితంలో ఈ మూడు భక్తితో చేయగలిగితే, ఆ పై అమ్మవారే అన్ని జన్మల్లోనూ సదా మిమ్మల్ని రక్షిస్తూ నడిపిస్తుంది.
-శ్రీ కృష్ణ పరబ్రహ్మర్పణమస్తు
🌹సర్వేజనాసుఖినోభవంతు 🌹
No comments:
Post a Comment