సాధన ముక్తి మార్గానికి సోపానం
➖➖➖
*మనకు ఉన్న అవరోధాలను, అడ్డంకులనూ తొలగించుకునే ప్రయత్నాలు చేస్తూ, ఉన్నస్థితి నుండీ ఉన్నత స్థితిని చేరాలి.*
*వాటికోసం చేసే ప్రతిపనీ సాధనే. సాధన ద్వారానే సాధ్యాన్ని పొందగలం.*
*అంతటా వ్యాపించి సర్వవేళలా ఉన్న అనంత తత్వాన్ని వివరించే జ్ఞానభాడాగారం ఉపనిషత్తులు.*
*అద్వైతం ప్రకారం సాధకుడు, సాధన, సాధ్యము అంతాఒక్కటే.*
*కనక "శ్రవణమేవ" సాధన. శ్రవణం చేసింది సంశయాలు లేకుండా స్థిరపడాలంటే బుద్ధి శుద్ధిపడాలి. జపం బుద్ధిని శుద్ధిచేస్తుంది.*
*ఊగిసలాడే మనస్సు వద్దంటుంది.*
*మనస్సుకి లొంగిపోతారో, మనస్సును లొంగదీసుకుంటారో, సాధకులే నిర్ణయించుకోవాలి.*
*ధర్మరూపంలో ఉన్న దైవం సదా మీకు తోడునీడై మిమ్ములను ఆశీర్వదించుగాక.*
.
No comments:
Post a Comment