Thursday, March 23, 2023

దైవం ఉన్నట్లు నిక్కచ్చిగా చెప్పే కొన్ని విషయాలు ఏమైనా తెలుసుకోవచ్చా ?

 💖💖💖
       💖💖 *"502"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼
*"దైవం ఉన్నట్లు నిక్కచ్చిగా చెప్పే కొన్ని విషయాలు ఏమైనా తెలుసుకోవచ్చా ?"*

*"సృష్టిలో దైవాన్ని ధరించని వారు లేరు ! ప్రతి ఒక్కరూ ప్రాణరూపంలో దైవాన్ని ధరించే ఉన్నారు. ఆ దైవాన్ని ఒక గుర్తుగా శరీరంపై ధరించడం మనం ఇప్పుడు చేస్తున్న పని. లింగధారణ అంటే అదే. లింగం అంటే గుర్తు అనే అర్థం కూడా ఉంది. ఈ ప్రపంచం ఉండటం, ఆ ప్రపంచానికి ఒక ప్రకాశం ఉండటం, మనకు చూపు ఉండటం ఇవన్నీ దైవం ఉన్నట్లు చెప్పే గుర్తులే కదా ! లింగం అంటే దైవానికి గుర్తే. అయితే ఈ సృష్టిలో లింగంకాని వస్తువులేవి లేవని తెలియటమే శివైక్యం. శివస్మరణం {శివుడు గుర్తుకురావడం } అనేకజన్మల పుణ్యఫలమైతే, ఆ శివుడ్ని నిరంతరం మన భావనలో ధరించగలగడం మరెంత అదృష్టం !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
             

No comments:

Post a Comment