Thursday, March 30, 2023

ప్రతి మనిషికి నలుగురు భార్యలు ఉంటారు వారిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు అని శాస్త్రవాక్యం.

 🙏🙏🙏🌹🌹🌹
ప్రతి మనిషికి నలుగురు భార్యలు ఉంటారు వారిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు అని శాస్త్రవాక్యం.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ఆ నలుగురు ఎవరో మనిషి తెలుసుకుంటూ ఉండాలి

నాలుగవ భార్య అంటే చాలా ప్రేమ అతనికి ఆమె కోరిన కోరికలన్నీ తీర్చేవాడు, అపురూపంగా చూసుకునే వాడు....
మూడవ భార్య కూడా ఇష్టమే కానీ తన గురించి మంచిగా స్నేహితుల దగ్గర చెప్పేవాడు కాదు, తను వారితో వెళ్లి పోతుందేమో అన్న భయంతో...

రెండవ భార్య దగ్గరికి తనకు ఏదైనా సమస్య వస్తేనే వెళ్ళేవాడు. ఆమె కూడా అతని సమస్యలను తీర్చేది

మొదటి భార్య అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు, ఆమెను అస్సలు పట్టించుకునే వాడే కాదు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిపోయాయి.

అతని అనారోగ్య క్షీణించిపోయింది. ఇక అతనికి బ్రతకను అని తెలిసిపోయి తన మీద ఎవరికీ నిజమైన ప్రేమ ఉందో తెలుసుకోవడానికి.....

తన నాలుగవ భార్యను పిలిచాడు.
నేను మరణానికి దగ్గరలో ఉన్నాను, నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నాను కదా. నాతో పాటు నువ్వు కూడా వచ్చేసెయ్ అన్నాడు. మరణంలో కూడా నాకు నీ తోడే కావాలి అన్నాడు. నాల్గవ భార్య అది విని దూరంగా వెళ్ళిపోయింది.

ఇకపోతే మూడవ భార్యను పిలిచి ఆదే కోరిక కోరాడు... అతనితో మూడవ భార్య ఇలా అన్నది.
ఇన్ని రోజులు నీతో ఉన్నాను నీ అవసరాలన్నీ తీర్చాను. ఇక నాకు నీతో పనేమీ లేదు, నేను వేరే వారి దగ్గరికి వెళ్ళి పోతున్నాను అన్నది.

అలాగే బాధతో ఏడుస్తూ తన రెండో భార్యను పిలిచి అడిగాడు. నేను నీతోపాటు నీ శవయాత్ర వరకు నీతోనే ఉంటాను. తరువాత నేను వెళ్ళిపోతాను, కాకపోతే నిన్ను అప్పుడ ప్పుడు తలచుకోగలను అని అన్నది...
అంత ప్రేమగా చూసుకున్న ఆ ముగ్గురు అలా అనేసరికి ఇక మొదటి భార్యను నిర్లక్ష్యం చేశాను కదా తనని అడగటం వృదా అని ఆలోచిస్తూ ఉండగా.....

మొదటి భార్య తలపుచాటు నుండి చూస్తూ, మీరు నన్ను ఎంత నిర్లక్ష్యం చేసినా  నేను మాత్రం మీ వెంట మీ చివరి ప్రయాణం దాక వస్తాను
మీరు బాధపడకండి అని అన్నది.

అప్పుడు అతని కళ్ళల్లో కన్నీరు ఆగకుండా ప్రవహిస్తుండగా చేతులెత్తి ఆమెకు నమస్కరించాడు....
కాబట్టి మనిషి దేన్నీ కూడా నిర్లక్ష్యం చేయకూడదు. మన దగ్గర ఉన్నప్పుడు వాటి విలువ తెలియదు. పోయేముందు తెలుసుకున్నా ప్రయోజనం ఏమీ ఉండదు. కనుక ప్రతి మనిషికి జీవిత సత్యాన్ని తెలుసుకోవాలి....

పైన చెప్పిన నలుగురు భార్యలు ఎవరో కాదు వీళ్లే.

1. నాల్గవ భార్య :     మనశరీరం...
2. మూడవ భార్య :   సంపద ఆస్తులు...
3. రెండవ భార్య : స్నేహితులు బంధువులు...
4. మొదటి భార్య : మనఆత్మ...

నిజమే కదా ! మన ఆత్మ చెప్పిన దాన్ని ఆచరించండి
ఆ నలుగురిని నిర్లక్షము చేయకండి ఎందుకంటే ఆ
నాలుగూ ఈశ్వరుడు మనకు ప్రేమతో ప్రసాదించినవి, ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు...

No comments:

Post a Comment