*:: మనస్సు రెండు రకాలు గా పనిచేస్తుంది,::*
*1) నేనైన మనస్సు*:-
మనస్సు తనకు తాను ఒక యాజమాన్యాన్ని ఆపాదించు కొని, స్వాతంత్ర్యాన్ని ప్రకటించు కొని, గతం యెక్క బంధనం లో ఇరుక్కుపోయి, గతజ్ఞానం ఆధారంగా , వర్తమానంలో ఇమడలేనందున, భవిష్యత్తు మీద ఆశతో ఊహలతో, స్వేచ్ఛ లేక కట్టడి చేయబడి, నిబద్దతై, సంకుచిత పరిధి లో,మూసుకు పోయి,ఇరుకుగా వుంటుంది.
*2) స్వేచ్ఛ మనస్సు*:-
స్వేచ్ఛ గా, వర్తమానాన్ని ఆస్వాదిస్తూ, కాల స్పృహ లేకుండా, అంతా ఎరుకై, నూతన స్పందనలతో, నిర్మల మై, నిశ్చలమై, సున్నితంగా, వినమ్రమై, వివృతంగా, సావధానంగా, పరిశుద్ధ గా, నిర్భయంగా, ఎప్పుడూ క్రొత్తగా, అమాయకంగా, కుశలమై, కొనసాగే ప్రవాహంగా వుంటుంది.
ధ్యానించే మనస్సుకి, సొంత దారుడు, యజమాని లేడు.
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment