Friday, March 24, 2023

పరిస్థితులు మనకు జరిగితేనే మారాలి నేర్చుకోవాలి అని కాదు ఒక్కోసారి ఎదుటి వారి జీవితాలలో జరిగిన సంఘటనలను చూసి మనం మారాలి.

 పరిస్థితులు మనకు జరిగితేనే మారాలి నేర్చుకోవాలి అని కాదు ఒక్కోసారి ఎదుటి వారి జీవితాలలో జరిగిన సంఘటనలను చూసి మనం మారాలి.

అందరికీ అలాగే జరుగుతాయని కాదు
కానీ కొన్నింటిని మళ్ళీ రిపీట్ కానివ్వకూడదని అంతే.

నేను అప్పుడు పదవతరగతి చదువుతున్నా అనుకుంటా.
తెలిసిన ఒక ఆమె కాన్సర్ తో చనిపోయారు.
ఆమెకు ఇద్దరు పిల్లలు.
ఒక పాప ఒక బాబు.
అబ్బాయిలకు అమ్మతో అనుబంధం ఎక్కువ మామూలుగానే ఈ అబ్బాయికి ఇంకాస్త ఎక్కువ. 

ఉన్నట్టుండి అమ్మ దూరం అవడంతో తట్టుకోలేని ఆ పిల్లాడు. నాకు తెలిసి ఆ బాబు ఎనిమిదో ఏమో చదవుతున్నాడు అంతే.
తల్లి లేదు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు.
తల్లి చనిపోయిన ఒక వారం అయ్యుంటుంది ఒక పేపర్ లో అమ్మలేకుండా నేను ఉండలేను.
అక్క నాన్న మీరు జాగ్రత్త అని చెప్పి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.

తల్లి లేదంటే జీవితమే లేదు అతనికి అనే అంత భావన అతనిలో.

ఆరోజే అనుకున్నాను పిల్లల్ని అలా మాత్రం పెంచకూడదు అని.

పిల్లలకు మన తోడు ఎంత వరకు ఉండాలో అంతే ఉంచండి.
నీడలా గా వాళ్ళ వెంటే ఉండండి కానీ వారికి కనిపించకుండా ఉండండి.

చెయ్యి పట్టుకుని జీవితాంతం తోడుంటానని చెప్పకండి.
మధ్యలోనే ఈ చెయ్యి అలసిపోవచ్చని నేర్పండి.

మన అడుగుల్లో వారిని నిత్యం నడిపించకండి
వారి దారిని మనకు చూపించమనండి.

ఏ మనిషి ఇక్కడ శాశ్వతం కాదు.
ఎవరిపైన ఆధారపడి ఉండకూడదు.

పిల్లలపైన ప్రేమ చూపండి.
వాళ్ళను ఆ ప్రేమ వల్ల బలహీనులుగా మార్చకండి.

లోకాన్ని మెల్లగా పరిచయం చేస్తూ వెళ్ళండి.
సమాజంలో బతకడం నేర్పించండి.
🙏🏽🙏🏼🙏🏽

No comments:

Post a Comment