*ఏమైందీ నగరానికి ఓ వైపు ఆత్మహత్యలు... మరో వైపు వింత పోకడలు...అవును ఇదేదో సినిమాలో వచ్చిన యాడ్ కాదు...*. ప్రస్తుత కాలంలో ఎదుగుతున్న యువతరంపై పడుతున్న ఇబ్బందులు. చిన్న చిన్న విషయాలను కూడా సహించలేని యువతరం జీవితాన్నే కోల్పోవడం విడ్డూరంగా మారింది. అమ్మ ఫోన్ చూడొద్దని చెప్పిందని ఓ పిల్లాడి ఆత్మహత్య, సెల్ ఫోన్ లో గేమ్ ఆడొద్దని మందలించినందుకు యువకుడు ఆత్మహత్య. విద్యార్థులను కళాశాలలో మందలించారని యువతి ఆత్మహత్య..స్నేహితులతో గొడవలై యువతి ఆత్మహత్య..పరీక్షల్లో ఫేయిల్ అయ్యామని, మార్కులు తక్కువగా వచ్చాయని యువతి, యువకులు ఆత్మహత్య..ఇలా ఎన్నో ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుత యుగంలో పిల్లలను మందలించడానికే తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. ఎవరిని ఏం అంటే అది ఏ వైపు దారి తీస్తుందో తెలియక ఇబ్బందులు పడుతున్నారు...
*సున్నిత మనస్థత్వమే దీనికి కారణమా*
*ఒక్కసారి ఆలోచించండి...!*
*ఈ సృష్టిలో గల సకల కోటి జీవరాశిలో జ్ఞానం తెలిసిన, భాష తెలిసిన, భావం తెలిసిన, మాట్లాడగలిగిన మరియు ఆలోచించగలిగే జీవి ఒక్క మనిషి మాత్రమే. కానీ దురదృష్టం ఏమిటంటే ఈ సృష్టి అంతటిలో ఒక్క మనిషి తప్ప మిగిలిన ఏ జీవి కూడా ఆత్మ హత్యకు సిద్ధ పడదు. ఒక బలహీన క్షణంలో మనిషి తీసుకునే అవివేకమైన చర్యే ఆత్మహత్యగా అర్థం చేసుకోవచ్చు.* అయితే మానవులలో కూడా బలవంతాన ప్రాణం తీసుకోవడం అనేది చిన్న విషయం కాదు ఎంతో మొండి ధైర్యం ఉంటే తప్ప పనికి పూనుకోలేరు. మొండి ధైర్యంతో తీసుకునే నిర్ణయం కూడా క్షణిక ఎంతో సేపు ఉండదు. *అటువంటి కీలక సమయంలో ఆవేశంలో ఉన్న వారితో మాట్లాడగలిగితే చాలు ఆత్మ హత్య నిర్ణయం నిలచి పోతుంది.* ఒక నిండైన జీవితం నిలబడుతుంది. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాల వలన ఏర్పడే బలవన్మరణాలు ఎన్నో బతుకులను బుగ్గిపాలు చేస్తున్నాయి. *ఆ ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే.. నెగెటివ్ అంశాలెన్నో పాజిటివ్ గా మారిపోయి మరో మలుపు తిరిగి జీవితంలో అద్భుతాలు సాధించిన వారు ఎందరో ఉన్నారు....*
🙏🙏🙏🙏
No comments:
Post a Comment