Friday, March 10, 2023

భక్తుడు శ్రవణం లో ఎలా వుండాలి???

 *భక్తుడు శ్రవణం లో ఎలా వుండాలి???*
_ఈరోజు మనము ఎన్నో విధాలుగా, భగవంతుణ్ణి కథలు వింటున్నాము, అసలు ఆ సమయం లో ఎలా వుండాలి??_
పుట్టుట, చచ్చుట గల దేహమే జీవితము అనుకొన్నచో అది ఎప్పుడు ఉండునో ఎప్పుడు పోవునో తెలియదు!!...
కనుక తెలివిగలవాడు మోక్ష స్థితికై యత్నించును!!... 

మనము దేహమును నమ్ముకొన్న అల్పాయులము, ఈ చెవులలో ఇతరులను గూర్చిన చెడ్డ మాటలు పడుటకు అవకాశము కలుగనేల? 
బంగారము కన్న విలువైన ఈ జీవిత కాలమును పాపకథలతో పోగొట్టుకొనుట ఏల? 
ఓ దేవ దేవ... నారాయణుని పాదపద్మముల యందు భక్తి కలిగించు కథలు అనెడి త్రేనె తాగించుము!!...
ఆ విష్ణు కథల్లో వున్నప్పుడు, నిన్ను తీసుకొని వెడలే యముడు కూడా మైమరచి పోయి నీ ప్రక్కన కూర్చునే అంత గా మనం లీనమై వుండాలి!!!
దేహము జీవితము అనుకొన్నవారిని దేహముతో పాటు మృత్యువు చంపును, వారికి ఏ జన్మకు ఆ జన్మయే మొదలు. 
అట్లుగాక సర్యాంతర్యామియైన నారాయణుడే తమ ప్రజ్ఞగా ఉన్నవారికి ప్రకృతికి అతీతమైన స్థితి సిద్ధించును.
వారితో కూడ యముడు యమము అనబడు సద్గుణముగా ఇమిడి ఉండును. 
అట్టివారికి దేహములు వచ్చుచు, పోవుచుండును, అయినను వారు చిరంజీవులై తమ స్మృతిని కోల్పోక నారాయణుని యందు ఉందురు. 
ఈ‌ సిద్ధి కలిగినవారే తప్ప మిగిలినవారు వేయి సంవత్సరాల బ్రతికినా వృదాయే కదా!!!...

No comments:

Post a Comment