🙏🍇జీవిత సత్యం 🍇🙏
హోలీ రంగోలి
హోలీ పండుగ అంటే నిత్యంగా కంటే కాస్త భిన్నంగా వినూత్నంగా రంగురంగులతో ఆనందంగా ఉండాలి,గడపాలి అని అర్దం
మరి మనమెలా ఉంటున్నామో
కాస్త గమనిద్దాం.
రంగుల పేరుతో రకరకాల రసాయనాలు కలిసిన,కలిపిన ప్రమాదకరమైన హానికరమైన వ్యర్థమైన రంగులు కొని ఇంటికి తెచ్చుకుని మీద పోసుకుని
కోరి కోరి అనారోగ్యాలు తెచ్చుకుంటున్నాం పర్యావరణాన్ని కాలుష్యం చేస్తున్నాం .
కొందరు ఆ రంగులు వదిలించుకోవాలని కాలువలు చెరువులు ఏర్లు నదులు సముద్రానికి వెళ్లి ప్రమాదాల భారిన పడి మరణిస్తున్నారు ఎంతో విలువైన జీవితాలను కోల్పోతున్నారు
ఇదంతా వారికి తెలియకుండానే
జరిగిపోతుంది
రసాయనాలు,పొడులు చల్లుకునే సందర్భంలో కళ్ళలోకి చెవులలోకి ముక్కు ద్వారా లోపలికి వెళ్లి శ్వాస ప్రక్రియ ద్వారా కొంత అనారోగ్యం తెచ్చుకుంటున్నారు.
అందుకే అర్థవంతంగా ఆరోగ్యకరంగా ఉండే విధంగా కుంకుమ,తిలకం బొట్టు పసుపు లాంటి చక్కటి రంగులు దిద్దుకుని ఆనందంగా ఈ రోజు హోలీ పండుగ రంగోలి పండగ
చేద్దాం, చేసుకుందాం మిత్రులారా!
🙏🍇🇾🇪🙏🍓🥝🙏🍅🥒🍉🙏
No comments:
Post a Comment