*🙏🏻🌹ఉషోదయ శుభ ఆసిస్సులు*🌹🙏🏻
శరీరమే వాహనము
మనము మానవ సమాజంలో ఒక భాగము. మన శరీరము సమాజానికి చెందిన సంపద. మనమీ సమాజానికి ఋణపడిఉన్నాము. మన శరీరాన్ని అపవిత్రం చేసే హక్కు మనకు లేదు. మన జీవితకాలంలో మనమపయోగించేవన్నీ సమాజము సమకూర్చినవే. సకాలములో ఆ ఋణాలను తీర్చుకోవడం మన కనీస బాధ్యత.
దేశ కాల పరిస్థితులకనుగుణంగా మన శారీరక మానసిక ప్రయత్నాలన్నీ సమాజ సంక్షేమానికి వినియోగించాలి. ఇది మన బాధ్యత. స్థూల శరీర సహాయము లేకుండా ఈ బాధ్యతను నెరవేర్చలేము. ఈ శరీరము వ్యాధులతో అనారోగ్యానికి గురైతే దానిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత సమాజానిదే. అప్పుడు సమాజానికి రెండువిధాలా నష్టమే- మన సేవలను కోల్పోవడమే కాకుండా మనలను చూడాల్సిన బాధ్యత సమాజానిదవుతుంది. సమాజానికి, ప్రపంచానికి మనం నిర్వర్తించాల్సిన బాధ్యతల గురించి మాట్లాడేటప్పుడు, వ్యక్తికే ప్రాధాన్యమివ్వడానికి ఇదే కారణమవుతుంది.
ఆధ్యాత్మిక అభివృద్ధికి కూడా మంచి ఆరోగ్యం చాలా ముఖ్యం. ఎన్నోతరాలుగా జమచేసిన పాపపు ముద్రలను పూర్తిగా తొలగించుకోనంత వరకు ఆత్మకు ముక్తి లేదా మోక్షం సాధ్యం కాదు. శారీరక బాధ, దు:ఖమును అనుభవించటము, ముద్రలను నిర్మూలించటాని కొక మార్గము. రెండవ మార్గము యోగసాధన మరియు సన్మార్గంలో జీవించటం-ఏ విధంగా నైనా స్థూల శరీరముండాలి. ఆత్మసాక్షాత్కారము కూడా స్థూలశరీర సహాయంతోనే సాధ్యమవుతుంది. స్థూలశరీరాన్ని నిర్లక్ష్యం చేయకుండా, జాగ్రత్తగా చూడాల్సిన అవసరాన్ని చెప్పటానికే ఇదంతా వివరించడము జరిగింది.
తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి
No comments:
Post a Comment