Wednesday, March 8, 2023

మనిషిలో పాజిటివ్ థాట్స్ పెంచే ... గాయత్రీ_మంత్రం

 *మనిషిలో పాజిటివ్ థాట్స్ పెంచే ... గాయత్రీ_మంత్రం"*

గాయత్రీ మంత్రం లోని ప్రతి అక్షరం బీజాక్షరమని, మహిమాన్వితమైనదని పండితులు చెబుతారు. 

ఈ మంత్రం జపిస్తే సకల దేవతలను స్తుంతించి నట్లే నని ఋగ్వేదం లో చెప్పబడింది. 

ఒకప్పుడు వేద పాఠశాల లో మాత్రమే ఈ మంత్రాన్ని జపించే వారు. 

కానీ ఇప్పుడు గాయత్రీ మంత్రాన్ని అందరూ పఠిస్తున్నారు. 

ఈ పవిత్రమైన గాయత్రీ మంత్రాన్ని ఒక నిర్థిష్టమైన పద్దతి లో జపించినా లేదా విన్నా ఆ మంత్రం నుండి వెలువడే ధ్వని తరంగాలు మన మనసు ని తేజోవంతం చేస్తాయి.

ఈ విషయాన్ని ప్రయోగాత్మకం గా నిరూపించ డానికి పలువురు ప్రయత్నాలు కూడా చేశారు. 

ఎలాగైతే ఒక బ్రిడ్జ్ మీద సైనికులంతా నిల్చుని క్రమ పద్థతి లో మార్చ్ ఫాస్ట్ చేస్తే వెలువడే ధ్వని తరంగాల ద్వారా ఆ బ్రిడ్జి ని కూల్చేయ వచ్చో అదే పద్దతి లో 

ఈ గాయత్రీ మంత్రాన్ని ఒక నిర్దిష్టమైన పద్దతి లో జపిస్తే మన శరీరం మనకు తెలియ కుండానే ఎన్నో వైబ్రేషన్స్‌కి గురవుతుంది.

అంతే కాకుండా మనకు పాజిటివ్ థాట్స్ వస్తాయి.

కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి.

ఈ అంశం పై పలు విదేశీ విశ్వ విద్యాలయాలు రకరకాల పరిశోధనలు నిర్వహిస్తున్నారు.

       *గాయత్రీ_మంత్రం*

ఓం భూర్భువః సువః తతం సవితుర్వ రేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ !!🙏

No comments:

Post a Comment