🙏🕉🙏 ...... *"శ్రీ"*
💖💖💖
💖💖 *"490"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
🌼💖🌼💖🌼💖🌼
🌼💖🕉💖🌼
🌼💖🌼
🌼
*"మనసుకు మౌనాన్ని అలవార్చే ప్రక్రియలు ఏమిటి ?"*
*"గురువును మోక్షం ఇవ్వమని కాదు, మనసుకు మౌనాన్ని అలరించాలని కోరాలి. అసలు కోరికలే లేకుండా చేయమని అని అడగడం అత్యుత్తమం. అది మనసును మోక్షానికి చేరుస్తుంది. గురువుని మనం దేహానికి పరిమితం చేస్తున్నాం. గురువు తాను దేహాన్ని అని భావించరు. ఈ దేహం, ఈ దేహానికి ఏర్పడిన బంధం, ఆ బంధానికి కారణమైన భగవంతుడు అంతా ఒక్కటేననేది ఏ దీక్షకైనా అంతిమ ఫలం. అది లభించే వరకు ఆ భావనతో ముందుకు సాగటం కోసమే ప్రతి దీక్షకు అనేక నియమాలు విధిస్తారు. అంతేగాని నియమాలే ప్రధానం కాదు. అంతిమంలో ఏర్పడే ఆ ఏకాత్మ భావనే ప్రధానం. ఈ శరీరం, మనసు, దైవం ఒక్కటేనని అర్థమయ్యే మౌనం మనకు అలవడాలని గురువును ప్రార్ధించటమే మనముందున్న కర్తవ్యం !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
No comments:
Post a Comment