ప్రపంచ దర్శనానికి అంతర్ దర్శనానికి తేడా ఏమిటి ?
మనం రూపనామాలతో ఉంటే జరిగేది ప్రపంచ దర్శనం. మనసులో రూపనామాలు లేని ప్రతిక్షణం జరిగేది ఆత్మదర్శనం. దర్శనం అంటే కేవలం కంటికి కనిపించేది మాత్రమే కాదు. మనసుకు తెలిసేదంతా దర్శనంతో సమానమే. ఏ అలజడిలేని మనసు శాంతిని దర్శిస్తుంది. అంటే శాంతిని అనుభవిస్తుంది. మనసు ప్రపంచంలో ఉన్నప్పుడు అనేక విషయాలు తెలుసుకున్నట్లే, అంతర్ముఖంగా ఉన్నప్పుడు ప్రపంచ విషయాలు ఏవీ తనలో లేవని తెలుసుకుంటుంది. అలా తెలుసుకోవటమే ఆత్మదర్శనం !
No comments:
Post a Comment