ఒక్కసారి మృత్యువనే గడపను దాటిన పిదప తల్లి, తండ్రి,సోదరి, సోదరుడు, భార్య, పుత్రుడు, పుత్రిక, మిత్రుడు మరియు బంధువులూ ఎవరు తోడు రారు. ఎటువంటి అంధకారమయమైన, ఏకాంతమైన మరియు విశాలనిర్జన ప్రదేశంగుండా జీవి ప్రయాణించవలసి ఉంటుందో, అక్కడ దారిని తెలిపే గుర్తులేవి ఉండవు. ఏ మలుపువద్దా ఎటువంటి దీపకాంతులు ఉండవు. అరిచి గోల పెట్టినందువల్ల ఎవరు సహాయానికి రారు. ఇక్కడ మన ఇంట్లో 36 రకాల భోజన పదార్థాలు పడి ఉన్నా ఒక్క మెతుకుకూడా వెంట తీసుకొని పోవటం కుదరదు. అక్కడ సహించరాని ఎండకు ప్రాణం కడగట్టిపోతుంది, తలపై నీడ కోసం ఒక వేపాకు సైతం లభించదు. ఆ సంకట సమయంలో కేవలం మనం చేసిన ధర్మ కార్యములు భగవాన్నామ స్మరణ సహాయపడుతుంది. అది మనకు దారి భత్యం గాను, దారిచూపే కాగడాగాను, నీడనిచ్చే పెద్దమర్రి చెట్టుగాను, సర్వ సమర్ధుడైన మార్గదర్శకుడు గాను, ఉంటూ, ప్రతి లోటును పూరిస్తూ, ప్రతి కష్టంనుంచి మనలను రక్షిస్తుంది. అందుకనే ధర్మం తప్పకుండా జీవిస్తూ, భగవాన్నామం విస్మరించకుండా జీవన యాత్ర సాగించమని సకల శాస్త్రములు చెబుతున్నాయి.
గతించిన బాటసారికి చేసిన భగవన్నామమే దారి భత్తెము.
గరుడ పురాణం ఆధారంగా
అన్నవరపు రాధాకృష్ణమూర్తి.
No comments:
Post a Comment