*సన్నివేశం ...ఇంద్రియాలు ..సామర్థ్యం..*
*సున్నితత్వం*
మన చుట్టూ రోజూ అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులో కొన్ని సన్నివేశాలు మనలను కదిలించి వేస్తాయి.
ఈ సంఘటనలు మన అన్ని ఇంద్రియాలకు పని కల్పిస్తాయి.
అనగా ఆ సంఘటనలో కన్ను చూడటానికి దృశ్యం వుంటుంది. ఆ కదిలే దృశ్యం శబ్దాన్ని కూడా చెవులకి అందిస్తుంది. జరిగిన సంఘటన అనుసరించి కొంత వాసన కూడా కలిగి వుంటుంది. అక్కడి వాతావరణం చర్మానికి స్పర్శించడానికి అవకాశం ఇస్తుంది.
ఇలా మనకు ఎదురైన సంఘటన మనలో ఎదో ఒక రకమైన ఉద్రేకాన్ని కలిగిస్తుంది.
అలా కలిగిన మన ఉద్రేకం ఏ ఇంద్రియం ద్వారా కలిగింది అన్నది మన ఇంద్రియ సున్నితత్వాన్ని చెపుతుంది.
ఉదా. కొందరు ఈ సంఘటన లోని దృశ్యానికి చలించిపోతే కొందరు శబ్దానికి చలిస్తారు.
ఉదా.ఒక బక్క చిక్కిన రోగి (దృశ్యం) రాసి కారుతూ వున్న కురుపుతో (వాసన)చలితో వణుకుతూ (స్పర్శ),బాధతో మూలుగుతూ వున్న (శబ్ధం) రోగిని చూసి చలించినాము.
మీరు దేనికి చలించారు? అతడి మూలుగు వినా,? రసి కారు తున్న కురుపుని చూసా,? ఆ రాసి నుండి వస్తున్న వాసనకా, ? అతడి చల్ల దనానికా?
ధ్యానం మన అన్ని ఇంద్రియాల సామర్ధ్యాన్ని, సున్నితత్వాన్ని పెంచుతుంది.
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment