💖💖💖
💖💖 *"489"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
🌼💖🌼💖🌼💖🌼
🌼💖🕉💖🌼
🌼💖🌼
🌼
*"మనసుకు దేహాన్ని ఉపాధిగా భావించవచ్చా లేదా !?"*
*"మనసుకు దేహం ఉపాధి కానేకాదు. అదే నిజమైతే నిద్రలో ఎందుకు మనకు ఆ భావన ఉండటంలేదు ? మనసుకు ఉపాధి దేహం కాదు, దేహభావన. కేవలం దేహభావన ఒకటే కాదు, మనసు ఇప్పుడు దేన్ని ఆలోచిస్తే అదే దానికి ఉపాధి అవుతుంది. మనం, నేను శరీరాన్ని అని ఎప్పుడూ అనుకోము. మన పేరు, ఊరు, ఉద్యోగం ఇలా ఏవైతే మన భావనలో ఉన్నాయో అవన్నీ మన మనసుకు ఉపాధి అవుతున్నాయి. అందరి మనసు ఒక్కటిగానే ఉంది. ఈ ఉపాధి బేధం చేతనే ఎవరికివారు వేరు అవుతున్నారు. మనసును మౌనం నుండి వేరుచేసే ఆలోచనలన్నీ మనసుకు ఉపాధి అవుతున్నాయి. ఎందుకంటే ఉపాధి లేనప్పుడు అసలు మనసుకు ఒక స్వరూపమేలేదు. ఆ స్ధితి మనం రోజూ అనుభవించే నిద్రాస్ధితి. అందుకే నిద్రలో అద్వైత భావనే ఉంది !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
No comments:
Post a Comment