Sunday, March 5, 2023

స్వరశాస్త్రం అర్థనారీశ్వర తత్వం - వైజ్ఞానిక విశ్లేషణ

 *🔴స్వరశాస్త్రం అర్థనారీశ్వర తత్వం - వైజ్ఞానిక విశ్లేషణ🟡*

  👉మన భారతీయ శాస్త్రాలలో స్వర శాస్త్రం అనే శాస్త్రం ఉంది. చాలా మందికి స్వరశాస్త్రం అంటే సంగీత శాస్త్రం అనే అపోహ కూడా ఉంది. స్వర శాస్త్రం అంటే మనం పీల్చే గాలి మన శరీరంలో ఏఏ నాడుల మీద ఎలా పని చేస్తుందో తెలిపే శాస్త్రం. ఈ శాస్త్రం అంతా సాంకేతిక పదాలతో నిగూఢంగా ఉంటుంది. స్వర సాధన అనుభవాల పుట్ట. తంత్ర సాధనలో స్వరసాధన చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. తంత్ర  సాధకులు నిగూఢమైన పేర్లతో అవయవాలను పోల్చారు. మనం పీల్చేగాలిని బట్టి పేర్లు పెట్టారు. కుడి వైపు నాడి యందు శ్వాస ప్రవహిస్తుంటే శివ, సూర్య, పగలు, యమున, పింగళ అని, ఎడమవైపు నాడి యందు శ్వాస ప్రవహిస్తుంటే శక్తి, చంద్ర, రాత్రి, గంగ అనే పేర్లు పెట్టారు. వీటిలో గాక ముక్కు రెండు రంద్రాలనుండి సమానంగా శ్వాస నడుస్తుంటే అగ్ని, సంధ్య, సరస్వతి, సుషుమ్న అని పెర్లు పెట్టారు. ఇది అతి ప్రాచీన రహస్య విజ్ఞానం. గురువు ద్వారా శిష్యులు నేర్చుకునే విజ్ఞానం. ఈ సాధనద్వారా సాధకులు అనేక అతీత శక్తులను పొందుతారని శాస్త్ర వచనం మరియూ ఆప్త వాక్యం. ఈ శాస్త్రాన్ని అభ్యసించిన వారు మన తెలుగు నేలలో ముఖ్యంగా వేమన, పోతులూరి వీరబ్రహ్మం గారు, ఇంకా అనేక మంది పేరు సిద్ధులు. ఇంకా చాలామంది ఈ స్వరశాస్త్రాన్ని అభ్యసించిన మహానుభావులు తెలుగునాట ఉన్నారు. అనేక గ్రంథాలు తెలుగులో ఈ శాస్త్రం మీద వెలువడ్డాయి. కానీ మన దురదృష్టం కొద్ది అవి నేడు అలభ్యాలు. కొన్ని దుర్మార్గుల దండయాత్రలలో కాలి బూడిదయ్యాయి. కొన్ని ప్రజల నిర్లక్ష్యం వలన పోయాయి.

   ఈ శాస్త్రానికి మూల పురుషుడు అర్థనారీశ్వరుడు. నేటి సైన్సు పరిభాషలో చెప్పాలంటే బ్రెయిన్ లో కుడి ఎడమ మెదడులు (Hemispheres) ఉన్నాయి. మస్తిష్కం మెదడులోని అన్నిభాగాలకన్నా పెద్దది. పుర్రెలో పైభాగమంతటినీ ఆక్రమించి ఉంటుంది. దీన్ని దైర్ఘ్య విదరము (Superior Longitudinal fissure) అనే రెండు అర్థచంద్రాకార భాగాలుగా విభాజితమై ఉంటుంది. ఈ భాగాలను మెదడు గోళార్థాలు (Cerebral hemispheres) అంటారు. యోగులు ఈ భాగాలను సూర్య చంద్రులని అంటారు. న్యూరాలజిస్టులు ఆడ, మగ చర్యలకు ఎడమ, కుడి బ్రెయిన్ కు గల సమ సంబంధాన్ని తెలుసుకున్నారు. ఆడవారు ఎక్కువ ఎడమ గోళార్థం పై ప్రభావం కలిగి ఉంటారు. మగవారు ఎక్కువ కుడివైపు గోళార్థం పై ప్రభావం కలిగి ఉంటారు. బ్రెయిన్లో గల సెక్స్ హార్మోన్లు తమ తమ తేడాకు కారణంగా సైన్స్ నిర్థారణ చేస్తుంది. దేహ ధర్మాలలో ఏ తేడా ఉన్నప్పటికీ, ఇడా తత్వం స్త్రీ ప్రధానంగాను, పింగళా తత్వం పురుష ప్రధానంగాను ఉన్నవి. ఈ తత్వమే అర్థనారీశ్వర తత్వం. ఒక మనిషిలో ఉండే ధనాత్మక ఋణాత్మక తత్వాల కలయికే అర్థనారీశ్వర తత్వం. ఈ ప్రాతిపదికనే అర్థనారీశ్వర తత్వం ప్రతిపాదింప బడింది. పరమేశ్వరుడు కుడివైపు పురుషతత్వానికి (పింగళ), ఎడమవైపు పార్వతి, స్త్రీతత్త్వానికి (ఇడా)ప్రతిబింబాలు.


No comments:

Post a Comment