Friday, March 10, 2023

మన దుఃఖానికి కారణమైన కర్తృత్వభావనను ఏ విధంగా పోగొట్టుకోవాలి?

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*

                 💖💖💖
       💖💖 *"478"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼
*"మన దుఃఖానికి కారణమైన కర్తృత్వభావనను ఏ విధంగా పోగొట్టుకోవాలి?"*

*"నేను ఫలానా అనే పరిధి భావన, 'నేను చేస్తున్నాను' అనే కర్తృత్వభావన చేత మనకు ఎదురయ్యే ప్రతి అనుభవంలోనూ మన ప్రమేయాన్ని ఆపాదించుకోవడం మనకు అలవాటైపోయింది. ప్రతి అనుభవానికి కారణమైన ప్రతి కార్యానికి మనమే పూర్తి కారకులమన్న భావన మనలో స్థిరపడిపోయింది. సూర్య కిరణాలు సోకగానే కలువలు వికశించటం, పశుపక్షాదులు, ప్రకృతి ఎలా మేల్కొంటున్నాయో అలాగే మనం కూడా మనలోని చైతన్యశక్తి ప్రేరణ కలుగగానే మేల్కొంటున్నాం. సూర్యకాంతి లేని ప్రకృతి కార్యం ఎలా లేదో అలాగే చైతన్యస్పర్శలేని మన జీవనమే లేదు. పిల్లల్లో వయసు పెరిగే కొద్దీ వాస్తవ పరిజ్ఞానం ఎలా కలిగిందో, మనందరిలో వివేకం, సత్యదృష్టి ఏర్పడితే గానీ దుఃఖానికి కారణమైన కర్తృత్వభావన పోతుంది. అప్పుడు మన నిజమైన పరిధి ఏమిటో మనకు అర్థమవుతుంది !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
            

No comments:

Post a Comment