Friday, March 10, 2023

దైవం అంటే ఏమిటో తెలియదు, తెలియని దాన్ని ఎక్కడని వెదకాలి ? ఎలా కనుగొనాలి ??

 🙏🕉🙏                       ..... *"శ్రీ"*

 🌼🌼 *"అరుణాచల శివ"* 🌼🌼
        🌼🍇🌼🍇🌼🍇🌼
             🌼🍇🕉🍇🌼
                   🌼🍇🌼
                         🌼
*"దైవం అంటే ఏమిటో తెలియదు, తెలియని దాన్ని ఎక్కడని వెదకాలి ? ఎలా కనుగొనాలి ??"*

*"తెలియని విషయాల్లో దైవాన్ని వెదకటం సాధ్యం కాదు."*

 *"తెలిసిన విషయాల నుండే కనుక్కోవాలి."*

*"అదెలా అంటే.. నిద్రలేచిన తర్వాత కలను అబద్ధం అంటున్నాం."* 

*"ఇలలో వాస్తవమని అనుకుంటున్నది కూడా అలాంటిదే అని అనుభవంలో తెలియడమే జ్ఞానం."* 

*"మన 'కలకు', వాస్తవం అనుకుంటున్న 'ఇలకు' {జాగృతికి } సంబంధమే ఉండటంలేదు."*

 *"కలలో వచ్చే విషయాలు వాస్తవానికి పూర్తి విరుద్ధంగా ఉంటాయి."*

*"ఇలలో సాగే మన జీవనం కలకు పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది."* 

*"కానీ ఈ రెండింటినీ చూసే 'మనం' మాత్రం ఒక్కటిగానే ఉంటున్నాం."*

*"రోజులోని గం.24ల సమయంలోనే రెండు రకాల పరస్పర విరుద్ధ భావాలతో మనం ఉంటున్నాం."* 

*"కలైనా, ఇలైనా అందులో ఉండేవి సంఘటనలే."*

 *"సంఘటన ఏదైనా ఏర్పడినదే."*

 *"ఆ సంఘటనలు ఏర్పడక ముందు ఉన్నదేదో అదే ఆత్మ (దైవం). కలకు-ఇలకు ఆధారం ఆత్మ !"*
            

No comments:

Post a Comment