🙏 *రమణోదయం* 🙏
*"నేనే బ్రహ్మం" (అహం బ్రహ్మాస్మి) అని నోటితో జపిస్తూ తిరుగక ఆత్మనిష్ఠతోనే బ్రహ్మమయంగా ఉండిపో. అట్లాగ కాకుండా విశ్రాంతి విరమం లేకుండా కోటి సంఖ్యతో జపం చేస్తే మాత్రం (జననమరణమనే) దుఃఖం పోతుందా? (పోదని భావం)*
సాధనా? దేనికి సాధన?
ఏమున్నది సాధన చేయడానికి
ఇట్లా కూర్చోటమే సాధన...ఎప్పుడూ ఇట్లాగే కూర్చుండేవాణ్ణి.
అప్పుడు కళ్ళు మూసుకునే వాణ్ణి..ఇప్పుడు తెరుస్తున్నాను.
ఇంతే భేదం...ఇప్పుడున్నదే అప్పుడూ ఉన్నది.
అప్పుడున్నదే ఇప్పుడున్నది.
"నేను" తప్ప వేరొకటి వుంటేగదా సాధన!
నీవు చూచే ప్రతి దృశ్యం కింద,
నీవు తలచే ప్రతి తలంపు కింద,
నీవు పొందే ప్రతి అనుభవం కింద
"భగవదిచ్చ" అనే పదం చేర్చు.
ఇక ఏ ఘర్షణకు తావుండదు!
మన ప్రతి కదలికను, ప్రతి తలంపును
భగవంతుడు గమనిస్తూనే ఉంటాడు
అనేది సదా జ్ఞప్తిలో ఉంచుకోండి.
అరుణాచల శివ..అరుణాచల శివ..అరుణాచల శివ..
అరుణాచలా!🌹🙏🏻
🌹🙏🏻ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🏻🌹
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.709)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
*ఏక మక్షరం హృది నిరంతరం*
*భాసతే స్వయం లిఖ్యతే కథం?*
🪷🌷🙏🌷🪷
No comments:
Post a Comment