*జయవిజయులు!!!*
*🍁శ్రీమహావిష్ణువు వైకుంఠంలో ఉంటాడని పురాణాలన్నీ చెబుతున్నాయి. గరుత్మంతుడితో సహా పరిజనమంతా ఆయన పిలుపునకు అందుబాటులో అక్కడే ఉంటారని బ్రహ్మాండ పురాణంలో ఉంది. వైకుంఠంలో పాల సముద్రం మధ్యన ఆదిశేషుడిపై విష్ణుమూర్తి లక్ష్మీసమేతంగా దర్శనమిస్తాడు. వైకుంఠం పరమపదం. అది సమస్త లోకాలకన్నా పైన ఉంటుందని నారద భక్తి సూత్రం చెబుతోంది. ఈ వైకుంఠానికి ద్వారపాలకులే జయవిజయులు.*
*🍁బ్రహ్మాండ పురాణం ప్రకారం, జయ విజయులు కాళీమాత కుమారులు. మహిషాసుర వద సందర్భంగా శివాని ఉగ్రరూపంలో ఉండి భర్త ఉనికిని నిర్లక్ష్యం చేస్తుంది. అనంతరం ఆ విషయాన్ని గుర్తించి ముక్కంటిని లాలించే ప్రయత్నం చేస్తుంది. ఆ ఆదిదంపతుల అనురాగానికి గుర్తుగా జన్మించిన కవలలే జయ విజయులు. పద్మపురాణం ఏమో జయ విజయులను కర్దమ-దేవహూతి కుమారులుగా చెబుతోంది. విష్ణువు మీది భక్తితో వారు తరవాత వైకుంఠానికి ద్వారపాలకులుగా* *మారారన్నది కథనం. వీరిద్దరూ నాలుగు చేతుల దేవతలుగా కనిపిస్తారు. నాలుగు చేతుల్లోనూ చక్రం, శంఖం, గద, కత్తి ఉంటాయి. విష్ణువు దగ్గర ఉండే ఆయుధాలన్నీ వీరి దగ్గర కూడా ఉన్నప్పటికీ కమలం ఒక్కటే ఉండదు.*
*🍁దేవాలయాల్లో మూలవిరాట్టు కొలువై ఉండే స్థానం గర్భాలయం. అక్కడి ప్రధాన దైవాన్ని బట్టి బయట రెండువైపులా ద్వార పాలకులు ఉంటారు. విష్ణుమూర్తి, ఆయన అవతారాలైన నరసింహస్వామి, రాముడు, కృష్ణుడు కొలువైన వైష్ణవ ఆలయాల ద్వార పాలకులు జయ విజయులు. జయుడు ద్వారానికి కుడివైపున ఉంటే, విజయుడు ఎడమవైపు ఉంటాడు. వీరి ఆహార్యమూ విష్ణువునే పోలి ఉంటుంది. అందుకని విష్ణువు నుంచి వీరిని వేరుగా గుర్తించడానికి కొన్ని ఆలయాల్లో జయవిజయుల మూర్తులకు కోర దంతాలను ఉంచుతారు.*
*🍁భగవంతుడి ముందు భక్తులు తమ పరిమితిని, మనుషులుగా తమ స్థానాన్ని గుర్తుంచుకోవడానికి ఇది హెచ్చరిక. అయినా తాము ఆది అంతం లేని శ్రీమహావిష్ణువు ద్వారపాలకులమనే గర్వం పొటమరించడంతో జయవిజయులు ఒకసారి బ్రహ్మ మానస పుత్రులైన సనక సనందనాదులకు వైకుంఠ ప్రవేశాన్ని నిరాకరిస్తారు. పర్యవసానంగా వారు తమ స్వామికి దూరమవ్వాల్సి వస్తుంది. పరమ భక్తులుగా అయితే ఏడు జన్మలు, పరమ శత్రువులుగా ఆయితే మూడు జన్మలు భూమి పైన గడపాల్సి ఉంటుందని శ్రీమహావిష్ణువు శిక్ష విధిస్తాడు. తమ దైవాన్ని త్వరగా చేరుకోవడానికి మూడు జన్మలు శత్రువులుగా పుట్టడానికే అంగీకరిస్తారు జయ విజయులు.*
*🍁అందుకే పోతన తన ప్రహ్లాద చరిత్ర ముగింపులో... నారసింహుడు ప్రహ్లాదుణ్ని నిగర్విగా రాజ్య పాలన చేయమని సూచిస్తాడని రాస్తాడు. దేవదేవుడిచ్చిన ఆ సలహాతోనే రాక్షస సంజాతుడైనా... సవ్యంగా రాజ్యాన్ని ఏలిన ప్రహ్లాదుడు వైష్ణవ భక్తుడిగా పేరొందాడు.*
*శ్రీ రామ జయ రామ జయజయ రామ.*
*┈━❀꧁జయవిజయులు꧂❀━┈*
*SPIRITUAL SEEKERS*
🍁🪷🍁 🙏🕉️🙏 🍁🪷🍁
No comments:
Post a Comment