*వృద్ధాప్యం.... ✍️.....*
*_విధి విసిరే చివరి అస్త్రం "ముసలితనం" వృద్ధాప్యపు బందిలదొడ్డిలో నువ్వు ఒంటరివి._*
*_వృద్ధోపనిషత్ లోని ప్రతీ పేజీ 'మసకే', సాయం తక్కువ. సలహాలు ఎక్కువ. మనిషి ఏడో ఋతువే "వృద్ధాప్యం"._*
*_కాలధర్మంలో దేహధర్మమే "వృధ్ధాప్యం"._*
*_మంచం మీద వెల్లకిలా పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఉంటావు. గగనంలో నక్షత్రాలు ఒక్కొక్కటిగా మాయమైపోతూ ఉంటాయి._*
*_ఈ లోకంలో పుట్టిన ప్రతీవాడు"వృద్ధోపనిషత్"లో భాగస్వామి కాకతప్పదు. జీవితం భళ్లున తెల్లవారుతుంది. మెల్లగా చీకటి పడుతుంది._*
*_వృద్ధుడికి వెన్నుపై కళ్ళుంటాయన్న ఓ నానుడి వుంది. అంటే వృద్ధాప్యంలో వెనుక చూపే తప్ప ముందు చూపు వుండదు._*
*_జీవితంలో మనం ఎన్నో సాధించి ఉండవచ్చు గాక. మన కీర్తి నాలుగు దిక్కులా ప్రసరించి ఉండొచ్చు గాక అయితే వృద్ధాప్యంలో దాన్నెవరూ గుర్తించరు. అసలు పట్టించుకోరు._*
*_ఓ సారి సీనియర్ సిటిజన్ బడిలోకి అడుగుపెడితే సమాజం మన గురించి పట్టించుకోదు. పాత వస్తువులా ఓ పక్కన పడేస్తుంది._*
*_"ఆరోజుల్లో నేను" అంటూ గత వైభవ చర్విత చర్వణం తప్ప భవిష్యత్ ఆలోచన వుండదు._*
*_కాళ్ళు, కీళ్ళు, ఒళ్ళు సడలి, కదల్లేక, మెదల్లేక, దేహాన్ని వదల్లేక, ఏమీ చేయలేక, వృద్ధులు పడే మనోవ్యధ అంతా ఇంతా కాదు._*
*_వృద్ధాప్యం అనేసరికి అదేదో శాపంగా భావిస్తుంటారు జనం. నిజానికి వృద్ధాప్యం శాపమో పాపమో కాదు. అది ప్రకృతి పరమధర్మం._*
*_వృద్ధాప్యం రాగానే బయటివాళ్ళు సరే కుటుంబ సభ్యులు కూడా చులకనగాచూస్తారు._*
*_నిన్న మొన్నటిదాకా తలొంచిన వానపాములు సైతం తలెగరేసి, నిలదీస్తాయి. లెక్కలు అడగటం మొదలెడతాయి._*
*_"ఏమండీ / నాన్నగారూ." అంటూ విధేయంగా వుండే భార్యాపిల్లలు కూడా ధిక్కరించడం మొదలు పెడతారు._*
*_వాళ్ళేదో పుడింగులన్నట్లు లేనిపోని సలహాలు, సూచనలిస్తుంటారు._*
*_ఏంమాట్లాడినా, యేం చేసినా వాళ్ళకు నచ్చదు సరికదా 'చాదస్తం' అంటూ కరివేపాకులా తీసిపారేస్తారు. లోకువగా చూస్తారు._*
*_మధ్యతరగతి కుటుంబం అయితే, మనం సంపాదించిన డబ్బు ఆసుపత్రి ఖర్చుల కోసం ఖర్చు పెట్టాలా..?_*
*_లేక చూసీ చూడనట్టు మరణం కోసం వేచి ఉండాలా అన్న ఆలోచనతో మన పక్క గదిలో మనవాళ్ళే చర్చిస్తూ ఉంటారు._*
*_అర్ధరాత్రి ఏ నొప్పితోనో నీకు మెలకువ వస్తుంది. పక్క గదిలోని వారికి నిద్రాభంగం చేయాలా వద్దా అన్న ఆలోచనతోనే తెల్లవారుతుంది. ఆరాత్రి నిద్ర కరువవుతుంది._*
*_చివరి మజిలీ !!_*
*_మనిషి జీవన ప్రయాణంలో చివరి మజిలీ వృద్ధాప్యం. మనం కాదనుకున్నా కూడా కోరి వస్తుంది వృధ్ధాప్యం._*
*_మనిషి జీవితం ఋతువులతో ముడిపడి వుంటుంది. వసంత ఋతువుతో మొదలయ్యే కాలం శిశిరంతో ముగుస్తుంది._*
*_వసంతకాలం మన పుట్టుక అనుకుంటే, శిశిరం వృద్ధాప్యం._*
*_వసంతంలో ప్రకృతి ఆకుపచ్చగా, రంగురంగుల పూలతో మురిపిస్తుంది.మనసు ఉల్లాసభరితమవుతుంది._*
*_ఇక శిశిరానికొచ్చేసరికి ఆకులు పండి, ఎండి, రాలి, చెట్లు మోడులవుతాయి. అలాగే వృద్ధాప్యంలో మనిషి దేహం కూడా ఒడలి, ఎండిన మోడవుతుంది._*
*_అయితే వృద్ధాప్య దశకు చేరుకున్నారంటే జీవితంలో వాళ్ళు ఎన్నెన్ని చూసివుంటారు. ఎంత అనుభవంగడించి వుంటారో! ఒక్క సారి ఆలోచిస్తే తెలుస్తుంది._*
*_అందుకే వృద్ధుల్ని భారంగా కాకుండా గౌరవంగా చూడాలి. వారి అనుభవాన్ని యువతరం చూపుడువేలుగా తీసుకొని ముందుకు నడవాలి._*
*_అప్పుడు వాళ్ళ భవిష్యత్తు మహత్తరంగా వుంటుంది. కానీ దురదృష్టంయేమంటే, వృద్ధుల్ని గౌరవించడం అటుంచి అసలు లెక్కేచేయరు._*
*_కొందరైతే ముసలాళ్ళను భరించలేక వృద్ధాశ్రమాల పాలు చేస్తారు. ఇవాళ మనం చేసిందే రేపు మన పిల్లలు కూడా చేస్తారన్న సోయి ఏమాత్రం వుండదు._*
*_ఏతావాతా వృద్ధాప్యం శాపంగా మారుతుంది. యవ్వనంలో హెల్త్ ఇన్సూరెన్స్ మానేసి ఆ డబ్బు పిల్లల కాలేజీ ఫీజు కట్టేస్తాం._*
*_మధ్య వయసులో సంపాదించింది ఖర్చుపెట్టి పిల్లల్ని విదేశాలకు పంపుతాం. నా కొడుకు అమెరికాలోనో, ఇంకేదో దేశంలో వున్నాడనో, కూతురు ఆస్ట్రేలియా లోనో ఇంకేదో దేశంలో ఉన్నదనో గర్వంగా చెప్తూ ఫాల్స్ ప్రిస్టేజి ఫీలవుతాం._*
*_అంతా బాగానే వుంటుంది. పిల్లలూ విదేశాల్లో సెటిలైపోయి బాగుంటారు. మన వృద్ధాప్యంలో మాత్రం వాళ్ళు కనీసం చూడటానికి కూడా రారు._*
*_అప్పుడప్పుడు సీజనల్ గా వచ్చే సెల్ ఫోన్ కాల్స్ తోనే సరిపెట్టుకోవాలి. తృప్తి పడాలి. కొడుకో, కూతురో, మనవడో గుర్తొచ్చి, వాళ్ళతో మాట్లాడాలని ఫోన్ చేస్తే 'సారీ.! బిజీ.' అంటూ సమాధాన మొస్తుంది._*
*`పుట్టిన కొత్తలో పక్క మీద శిశువు నెలల తరబడి కదలకుండా ఎలా ఉంటుందో, వృద్ధాప్యంలో తిరిగి అదే పరిస్థితి సంభవిస్తుంది._*
*_అయితే ఒకటే చిన్నప్పుడు ఆలనాపాలనా చూసుకోవటానికి కన్నతల్లి ఉంటుంది. వృద్ధాప్యంలో ఎవరూ వుండరు._*
*_అదృష్టం బాగుంటే అప్పుడప్పుడూ వచ్చి పలకరించే కూతురు తప్పదన్నట్టు సేవలు చేసే కోడలూ వుండొచ్చు._*
*_అనాథాశ్రమంలో అయితే వాళ్ళు కూడా ఉండరు. అయితే ఇది అందరికీ జరుగుతుందని కాదు. కొందరుంటారు అదృష్టవంతులు తల్లిదండ్రుల్ని ప్రేమించే పిల్లలూ వుంటారు._*
*_అలాంటివాళ్ళు తల్లిదండ్రులు వృద్ధులైనా నెత్తిన పెట్టుకొని ఎంతో ప్రేమతో చూసుకుంటారు._*
*_బతుకంతా బుద్ధిబలం మీద ఆధారపడ్డ వారికి ముసలితనం కన్నా పెద్ద శిక్ష వుండదేమో..?_*
*_బాగా బతికిన మహామహులే ముసలితనం రాగానే దిగజారి హీనమై పోవడం చూస్తూనే ఉంటాం._*
*_ఇలాంటి అవస్థను తలుచుకుంటేనే భయమేస్తుంది. భగవాన్.!_*
*_ఇలాంటి దురవస్థ ఎవరికీ రాకూడదు. ఇందులో నుంచి అందర్నీ తప్పించు తండ్రీ._*
*_వృద్ధాప్యం శాపం కాదు. ఓ వరం. ఏకాంతంలో సంగీతాన్ని వింటూ కాలక్షేపం చెయ్యొచ్చు._*
*_ఓపిక, సదుపాయముంటే పెరటి మొక్కల్ని పరిరక్షిస్తూ కాలం గడపోచ్చు._*
*_చిన్న పిల్లలుంటే కొద్ది సేపు వారికి ఇంటరెస్టు ఉన్న టాపిక్స్ కబుర్లు చెప్పుకోవచ్చు, ఆడుకోవచ్చు._*
*_ఏం చేసినా అఫెక్షన్ బ్యాంక్ లో ఆప్యాయతని క్రెడిట్ చేసుకుంటూ వెళ్ళాలి._*
*_ఎప్పుడైతే మనం మానసికంగా ఇలా ప్రిపేర్ అవుతామో? మన వృద్ధాప్యాన్ని ఓ పది సంవత్సరాలపాటు వాయిదా వెయ్యొచ్చు._*
*_సో… ఇప్పటికే సీనియర్ సిటిజన్స్ అయిన వారు, భవిష్యత్తులో సీనియర్ సిటిజన్స్ కాబోయేవారు జీవితం మనల్ని ఎలా నడిపిస్తే అలా నడవాలి..అందరూ ఆ దరికి చేరే వారే..కొంత ముందు..కొంత వెనుక. అంతే.._*
*_ఒక్కొక్క వృద్ధుని అనుభవం ఒక్కో జీవిత కాలం.. వాళ్ల నుండి ఏంతో నేర్చు కోవచ్చు యువత... డబ్బులు పెట్టినా కొనలేని అనుభవాల సారాంశమే వృద్ధాప్యం .._*
No comments:
Post a Comment