Friday, July 4, 2025

 *ఒక_చిన్న_మంచి_భర్త_కథ. మీ_అందరికోసం తప్పనిసరి_ప్రతి_మాగాడు_ఈ_కథ_చదవండి.*

*పండు మధు ఇద్దరు భార్యాభర్తలు*
*పండు ఏదో తన చదువుకు తగ్గ చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు..మధు ఇంట్లోనే పిల్లల ఆలనా పాలనా చూస్తూ అత్తమామలను సేవిస్తూ సాఫీగా జీవితం గడుపుతూ ఉండేవారు....*
*మధుకి భర్త అంటే ఎనలేని ప్రేమ పండుకి భార్య అంటే ఎంతో అనురాగం....మధు అత్తమామలకి కోడలంటే...చెప్పలేనంత ప్రీతి.*
*ఈ కారణంగా నే మధు పుట్టిటింటికి పెద్దగా వెళ్ళేది కాదు వెళ్లినా ఒక్కపూట అర పూట లో తిరిగి వచ్చేది....*
*ఒకసమయాన మధు అన్న గారికి పెళ్లి కుదరడంతో మధు 15 రోజులు ముందే పుట్టిటింటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది*
*మధుని పంపడం పండుకి...అతని తల్లిదండ్రులు కు ఇష్టం లేదు కానీ తప్పని పరిస్థితి...*
*మధు పుట్టింటికీ వెళ్లింది...పండు స్నేహితులతో కాలం గడుపుతూ..తన ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ కాలం వెల్లదీస్తున్నారు...*
*ఇంతలో స్నేహితులలో ఒకరిది పుట్టినరోజు వచ్చింది.. తన స్నేహితులతో కలిసి అందరూ సరదాగా గడపాలి అనుకున్నారు పండుని కూడా పిలిచారు భార్య కూడా ఇంట్లో లేదు ఒంటరిగా ఎందుకు అని పండు కూడా పార్టీకి వెళ్లారు*
*స్నేహితులు బలవంతం చేయడం వలన మద్యం తీసుకున్నారు...【పండుకు పెళ్లికి ముందు అలవాటు ఉంది మధుకి ఇష్టం లేదని మానేశారు】చాలా రోజుల తర్వాత అలవాటు గుర్తు చేసుకున్న పండు రోజూ స్నేహితులతో కలిసి మందు తాగడం* *అలవాటయ్యింది...ఇంతలో మధు అన్నగారి పెళ్లి తంతు దగ్గర పడింది పండు కుటుంబం అందరూ పెళ్లికి హాజరయ్యి తిరిగి వచ్చేశారు...మరుసటి రోజు కూడా పండు స్నేహితులతో కలిసి పార్టీలు గట్రా పూర్తి చేసుకుని వెళ్తూ వెళ్తూ స్నేహితులకు ఒక్క మాటచెప్ప సాగాడు*
*ఫ్రెండ్స్ నేను రేపటి నుండి రాలేను అని.......*
*వాళ్ళందరూ ఆశ్చర్యం గా పండు వైపు చూసారు...*
*ఏంటి బావ ఏమయ్యింది ఇంత అర్ధాంతరంగా ఈమాట చెప్పావు అన్నారు*
*అప్పుడు పండు నవ్వుతూ రేపు మీ చెల్లెలు(మధు) వస్తుంది బావ అందుకే ఇక రాలేను అన్నాడు*
*అంతలోనే స్నేహితులలో ఒకరు పెళ్ళానికి బయపడుతున్నావా అని ఎగతాళి చేశారు*
*మరొకరు పిరికోడా అన్నారు*
*ఇంకొకరు చేతకానివాడు అన్నారు*
*ఇవన్నీ వింటున్న పండు ఏమి మాట్లాడకుండా అక్కడ నుండి సైలెంట్ గా వెళ్ళిపోయాడు*
*మరునాడు సాయంత్రం రోజూలానే స్నేహితులని కలిసాడు*
*ఏంటి బావ రాను అన్నావుగా ఎందుకొచ్చావు...అన్నారు*
*మరొకరు వెంటనే మందుకు బానిసైతే అంతే బావ ఏదీ గుర్తు రాదు అన్నారు*
*పండు వాళ్ళ అందరికి ఇలా చెప్పాడు*
*రాత్రి మీరన్న మాటలకి సమాధానం అప్పుడే చెప్పేవాడిని కానీ తాగి వాగాను అంటారు అందుకే ఇప్పుడు చెప్తున్నా*
*నా భార్య అంటే భయమే నాకు...ఎందుకంటే నేను తాగితే నా ఆరోగ్యం పాడవుతుంది అని ఆలోచించి తనెక్కడ ఆరోగ్యం పాడుచేసుకుంటుందేమో అని...*
*పిరికోడినే...ఎందుకంటే నేను చేసే పోరాపాటులన్ని సమర్ధించుకునే నా భార్య ధైర్యం ముందు నేను పిరికోడినే...*
*చేతకాని వాడినే ....ఎందుకంటే నేను ఎంతటి వెర్రి చేష్టలు చేసినా భరించే ఆమె సహనం ముందు నేను చేతకాని వాడినే....*
*పండు సమాధానం విన్నాక* *అక్కడ మౌనం రాజ్యమేలింది* 
*అందరూ కొంత సేపటికి తేరుకున్నారు*
*పండు కళ్ళలో చెమర్చిన కన్నీరు...స్నేహితుల మౌనం ఇవన్నీ పండుకు గర్వముగా* *అనిపించాయి...అందరూ పండుని క్షమాపణలు కోరారు పండు ఆనందంగా మధు దగ్గరకు వెళ్లిిపోయాడు*

*ఫ్రెండ్స్ మనలో కూడా చాలా మంది చెప్తుంటారు అయ్యో ఇంట్లో మా ఆవిడ ఉంది....అన్నాడు అంటే అతను భార్యకి బయపడినట్టు కాదు* *గౌరవిస్తున్నట్టు అని అర్ధం...భార్యను బాధపెట్టకూడదు అని అతని ఆతరంగికం...*
*మనం భార్యకు గౌరవం ఇవ్వకపోగా ఇచ్చేవాళ్ళని చూసి ఎగతాళి చేస్తున్నాము.*

No comments:

Post a Comment