Friday, July 4, 2025

 Madam! 

Madam! 🙏

Yes come-in please

నేను అయ్యవారి ఆఫీసులో గుమస్తానండి. 

నా పేరు పరమేశ్వర రావు

ఆయన ఆఫీసులో వున్నారు. 

నేను తమరి ధర్శనం చేసుకుందామని వచ్చానమ్మ. 
రేపు శ్రావణ శుక్రవారం. 
ఈ పట్టుచీరె కాంచీపురం నుండి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది, కాదనకండి మేడమ్. 

ఈ చీర అతి తేలిక. 
మీరు వేసుకుంటే పదిహేను సంవత్సరాలు చిన్నగా కనిపిస్తారు. 

ఎంతేమిటి ? 

దాందేముందమ్మ ! తీసుకోండి. 

సరే. ఏమిటి సంగతి ?

నాకు మూడు సంవత్సరాల నుండి ఇంక్రిమెంటు రాలేదు. మీరు దయతలిస్తే నెలకు అయిదు వేల ఇంక్రిమెంటు ఏరియర్స్ తో నాకు ఈ నెల జీతంతో వచ్చేస్తుంది. 

సరే! ఇంకా ? 

వచ్చే నెలలో సీనియర్ క్లర్క్ ప్రమోషనుంది. 
అది కాస్తా ఆఫీసు సూపరింటెండెంట్ పోస్ట్ అయితే ఆర్డర్స్ చేతిలో పడేసరికి మీ చేతులకు రెండు జతల పోళ్ళతో పొదిగిన బంగారు గాజులుంటాయ్ అమ్మగారూ

సైజు గాజు తీసుకో బాబు

నా దగ్గర మీ సైజు గాజు ఉంది మేడమ్

అశాధ్యుడివేనే !

సరే గానీ, నాకు వడ్డాణము కావాలంటే నీకే సహాయము చేయాలి ? 

అయితే అయ్యగారి సీటు నాకిప్పించండి అమ్మగారూ

🫢🤔

వీర రాఘవరావు

No comments:

Post a Comment