Monday, August 25, 2025

******హిమాలయ యోగులతో క్రియాయోగి అనుభవాలు - 01 గ్రంథ రచయిత : స్వామి జ్ఞానానందగిరి మహరాజ్. Pdf








Archive pdf download link - 

హిమాలయ యోగులతో క్రియాయోగి అనుభవాలు - 01

గ్రంథ రచయిత : స్వామి జ్ఞానానందగిరి మహరాజ్.

ఎంతో కష్టపడి కఠోర పరిశ్రమజేసి భారత దేశంలోని 28 రాష్ట్రాలలో తిరిగి యోగులను దర్శించి హిమాలయంలో ఎన్నో సంవత్సరములుండి అక్కడి యోగుల సాంప్రదాయంలో దీక్షపొంది యోగులకు సేవజేస్తు ఉండి యోగవిద్యను అభ్యసించి తపస్సు జేసి అనుభవంతో చెప్పుచున్న సాధనలు మరియు 

హిమాలయంలో 300 సంవత్సరాలు 200 సంవత్సరాలు, 180 సం||రాల వయస్సు గలిగిన యోగులతో నా అనుభవాలు 

అగోరి సాంప్రదాయయోగులు, నాథ సాంప్రదాయయోగులు, జూన, దత్త అఖాడ దిగంబర నాగబాబలు కల్లుమూసుకొనే ప్రపంచం గురించి అన్నీ విషయాలు చెప్పేయోగులు.

50 పీట్ల పొడవైన జడలు, తలవెంట్రుకలు, 2ఫీట్ల కాళ్లు చేతుల గోళ్ళు పెరిగిన యోగులు, శరీరంలో తపస్సు చేస్తుండగా ఎముకలే మిగిలిన యోగులు, నిరాహార యోగులు, ఏమి తినని త్రాగని యోగులు, గాలిని మాత్రమే తినే యోగులు, 

నిద్రపోని యోగులు, దివ్య దృష్టిగలిగిన యోగులు, ఆకాశంలో ప్రయాణించే యోగులు, సంపూర్ణ ఆరోగ్యానికి చిట్కాలు, రహస్యాలు చెప్పే యోగులు, వారి శరీరంను జంతువులుగా పక్షులుగా మార్చే యోగులు, మూలికలతో మొండి రోగాలు తొలగించే సాధువులు, 

ఎవరికి కనిపించకుండా మాయమయ్యే యోగులు, నీళ్లు మాత్రమే త్రాగే యోగులు, ఆకులు మాత్రమే తినే యోగులు, యోగంతో మూలికలతో ఆహార నియమంతో రోగం తొలగించుకొనుటకు సలహాలిచ్చే యోగులు, 

ఖాళీ సంచిలోంచి ఏదైన సృష్టించి తీసే యోగులు, శరీరంలో అగ్ని పుట్టించుట, ఐస్లా చల్లగా చేసే యోగులు, చనిపోయిన వాన్ని కూడా బ్రతికించే యోగి, చేతిలోంచి ఏదైన సృష్టించే యోగులు, 

అగ్నిలో కూర్చునే యోగులు, నీళ్ళలోపలే ధ్యానంలో కూర్చునే యోగులు, గాలిలో ధ్యానంచేసే యోగులు, ఆకాశంలో సంచరించే యోగులు, 

భూమిలోపల ధ్యానం చేసే యోగులు, గుహలలో ఎన్నో రోజులు సమాధిలో ఉండే యోగులు, పరకాయ ప్రవేశం చేసే యోగులు, ప్రకృతిని శాసించే యోగులు 

ఇలా ఎందరో యోగుల దర్శించి వారి సంభాషణలు సాధకుల సందేహాలకు వారిచ్చిన సూటి జవాబులు 

క్రియాయోగం, తపస్సు, ధ్యానం, జ్ఞానంపై వారిచ్చిన ప్రాక్టికల్స్ కుండలినీ శక్తిని త్వరగా మేల్కొలిపే ఉపాయములు

నిర్వికల్ప సమాధి త్వరగా కలిగించే రహస్యమైన సాధనలు 

ఆత్మసాక్షాత్కారం, బ్రహ్మజ్ఞానం, త్వరగా ఈ జన్మలోనే ముక్తి పొందుటకు యోగులు చెప్పిన యోగము, బ్రహ్మజ్ఞానం తీరి మరియు ప్రాక్టికల్స్ ఎన్నెన్నో యోగుల ఇంటర్వ్యూలు మరెన్నో హిమాలయ రహస్య విశేషాలు.

స్వామి జ్ఞానానందగిరి మహరాజ్

మా ఏడవ ఏట నుండి ధ్యానం చేస్తుండగా మాకెన్నో సందేహాలుండెను. 

కాని పల్లెటూల్లో అవి తెలిపేవారు లేరు. నా చిన్నప్పుడు హైదరాబాద్లో కూడా కొంతకాలం ఉన్నాము. ఎందరో స్వాములను నేను కలిశాను. కాని మన తెలుగు జిల్లాలలో నా సందేహాలు తీర్చేవారు నాకు దొరకలేదు. 

28 రాష్ట్రాలు తిరిగి హిమాలయాలలో కుంభమేళలలో ఎందరో యోగులు, ఋషుల, నిరాహారుల, మౌనుల, మహానీయులను కలిసి ఎన్నో రకాల సాధనలు, బోధనలు విని కేవలం పుస్తకాలు చదివి తృప్తిపడక స్వానుభవజ్ఞానం గ్రహించాను. 

తుమ్మెద అన్ని పూల నుండి మకరందం తీసుకునే విధంగా సాధకుడు సత్యాన్వేషి, అందరు గురువులతో జ్ఞానం తీసుకోవలెను. 

తన అనారోగ్యం పోవుటకు వైద్యుడిచ్చిన ఒక మాత్రమే చాలు ఇతరుల రోగం పోగొట్టాలంటే మనం వైద్యుడవ్వాలి. శిశ్యుడు గురువు చెప్పింది చేస్తే చాలు కాని 

గురుస్థానం కఠినమైనది గురువు అన్నీ సాధనలు మార్గాలు అధ్యయనం చేసి సాధన అనుభవం, భోదనా సామర్థ్యం కలిగి ఉండాలి. 

సూర్యుడు తాను వెలుగుతూ లోకానికి వెలుగునిచ్చినట్టుగా జ్ఞానులు తాను బ్రహ్మానందంలో ఓలలాడుచు తనను ఆశ్రయించిన వారికి బ్రహ్మానందం అందించెదరు.

ఈ లోకంలో దేనికి కరువులేదు. తిండి, గూడు, బట్ట, కాని లోకం మొత్తం అశాంతిగా ఉంది. 

ఎందుకు ఈ శరీరం నేను దీనికి సంబంధించిన పరివారం, ఆస్తులు నావే అని అజ్ఞానం చేతమోహితులవడం వలన దుఃఖితులవుతున్నారు. 

అన్నం, పెట్టిన మళ్లీ ఆకలి అవును. వస్త్రమిచ్చిన మళ్లీ చిరుగును. రోగం నయం చేసిన మళ్లీ రోగమొచ్చును 

అన్నీ దు:ఖాలకు అజ్ఞానమే కారణం, జ్ఞానం యోగం ధ్యానమనే ఔషదంతో అజ్ఞానమనే రోగం పోతే అంతా ఆనందమే 

లోకంలో తాత్కాలిక పరిష్కారాలు ఇప్పటి వారు చూపిస్తున్నారు. పూజారులతో దు:ఖాలు పోవాలని లక్షల ఖర్చుతో పూజలు, శాంతులు చేయిస్తున్నారు. 

స్వాములతో కోట్ల రూపాయల యజ్ఞాలు చేయిస్తున్నారు. దాన ధర్మాలు, నోములు వ్రతాలు తీర్థయాత్రలు, ఎన్నో శాంతికై ఆచరిస్తున్నారు. ఇవేవి నిజమైన శాంతినివ్వవు. 

మన ఋషులు యోగులు, ఉపనిషత్తులు చూపే శాశ్వత పరిష్కారం ధ్యానమార్గం అనుభవగురువులు, యోగులతో నేర్చి ఆత్మజ్ఞానం పొందినచో అనంత శాంతిపొందగలరు.

పూర్వం గురుకులాలలో ఋషులు, భుక్తి మార్గం ముక్తి మార్గం రెండు నేర్పేవారు. 

కాని ఈ కాలం కేవలం భుక్తి మార్గం చూపిస్తున్నారు. కూటి కోసం కోటి విద్యలైనాయి. అది సరే కాని ముక్తి విద్యతో యోగం ధ్యానం విద్యతో దు:ఖ రాహిత్యం ఆనందం ప్రాప్తి కలుగును. 
ఆత్మశాంతి, జన్మరాహిత్యం లభించును. 

ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకోదగినది వేరొకటి లేదో అట్టి ఆత్మ జ్ఞానం తెలుసుకోవడంతో మానవ జన్మ సాఫల్యం జన్మరాహిత్యం జీవన్ముక్తి జీవులకు లభించును. 

దీనికై అనుభవ గురువులకై బాబాజి. ప్రేరణతో పూర్వజన్మ సుకృంతం చేత చిన్న నాటి నుండి ఎంతో సాధన చేసిగూడ తృప్తిలేక గురువులేని విద్య గుడ్డి విద్య కనుక అనుభవ గురువులకై అనుభవముకై నా అంతరంగ గురువు. 

బాబాజి ప్రేరణతో నా అన్వేషణ ప్రారంభమయ్యెను. బాబాజిపై భారం మోపి ఒంటిపై ఒకజత వస్త్రాలు భుజంపై ఒకవోలె ఇదే నా ఆస్తి సత్యాన్వేషనకై బయలుదేరి నేను చేసిన సాహసం.

ప్రతి యువసాధకులకు మరియు ఆధ్యాత్మిక మార్గంలో ఎలా సాధన ప్రారంభించాలి. వాటి విజ్ఞాలెలా ఉంటాయి. కఠోర నిష్ట ఎలా చేయాలి. మనసు నిలిపే మార్గమేమి. 

ఎంత సాధన చేసిన ఫలితం కనిపించకపోవుట, ధ్యానంలో సందేహాలు, సమస్యలు, ప్రతి సాధకుడికి ఉపయోగార్థం. 

క్రియా బాబాజి నన్ను పరికరంగా చేసుకొని సాధకులకు అందించినదే ఈ గ్రంథము. 

నాకు మేలొనర్చిన హిమాలయ యోగులకు, అవధూతలకు, ఋషులు, మునులకు పరమ గురువులకే ఈ గ్రంథం అంకితం. 

ఇది ప్రతి సాధకుడు చదువ దగిన గ్రంథం. ఇందులో ఎన్నో సమస్యలకు, సందేహాలకు, ఎన్నో రకాల సాధనలు, సాధనా నియమాలు ఇందులోని అనుభవం పరమ గురువులది. 

ఇవి మీకు మేలొనగూర్చితే ఆ గురువులకు ధన్యవాదం తెలుపండి. లోపాలుంటే అవి నావిగా భావిస్తాను, చెరకు వంకరైన గాని ఇందులో తీపినే గ్రహించండి.

ఇందులో ఎందరో యోగులు యోగి వైద్యులు, తెలిపినవి ఆరోగ్య రహస్యాలు ఆహార నియమాలు, మూలికావైద్యం, ఆరోగ్యంకై యోగం, ఆత్మజ్ఞాన సాధనలు, వేదాంత విచారణ, ధ్యాన యోగులకు, సందేహాలు తీర్చే ఎందరో యోగులు తెలిపిన ఆయా విషయాలే కాక మేము స్వయంగా వాటిని అనుభవంలోకి తెచ్చుకోని చెప్పిన విషయాలు శాస్త్రం చెప్పినది. 

గురువు చెప్పినది, సాధనతో దానిని అనుభవంలోకి తెచ్చుకొని, సాధకులకై ఎన్నో విషయాలు చర్చించి పొందుపరిచాము. 

క్రియా యోగంలో కలిగే సందేహాలు, ధ్యానంలో సందేహాలు సమస్యల గురించి ధ్యానయోగులెలా ఈ ప్రపంచంలో ఉంటూనే ప్రపంచాతీత స్థితి పొందవచ్చును. 

ఎలామెలిగితే ఏది సేవిస్తే, జీవితంలో ఏ మార్పులు చేసుకుంటే ఏ సాధనలు చేస్తే, ముక్తి త్వరగా లభించును అనే విషయాలు ఎన్నో అనుభవ పూర్వకంగా తెలిపాము. 

గురువులు చెప్పిన సాధనాలన్ని అనుభవంలోకి తెచ్చుకొని మీకు వివరిస్తున్నాము. ఈ గ్రంథంలో ఇచ్చిన సాధనలన్ని కేవలం గురుముఖంగా నేర్చి సాధన చేస్తేనే ఫలితమిచ్చును. 

ప్రతినిత్యం క్రియా, ధ్యానయోగం సాధన చేసి జీవన్ముక్తులవ్వండి, బాబాజి అనుగ్రహంతో ఈ గ్రంథం మీ ముందుంచుచున్నాను. 

(సశేషం) - సేకరణ 

🌹🙏

No comments:

Post a Comment