🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
నేటి…
*ఆచార్య సద్బోధన*
➖➖➖✍️
```
మనిషి మనిషిలా బతికేది తల్లి గర్భంలో ఉన్నంత కాలమే!!
ఎందుకంటే అక్కడ ఎవ్వరూ తప్పు చేయలేరు. చుట్టూ చీకటి ఉన్నా భయం ఉండదు. దేనిపైనా ఆశ పుట్టదు. నాదీ అనే స్వార్థం ఉండదు. ఎల్లప్పుడూ ప్రశాంతమైన జీవనం సాగుతుంది.
అందుకే అంటారు...
మనిషి చూసిన తొలి దేవాలయం తల్లి గర్భం అని.
కానీ తల్లీ గర్భం నుండి బయట పడిన తరువాత ఆసలు కధ మొదలవుతుంది.
అదే నేను, నాదీ అనే ఆలోచన.! స్వార్థంతో పరుగులు తీస్తుంది మనిషి జీవితం.
ఏదీ శాశ్వతం కాదు ఈ లోకంలో, గడుపుతున్న ఈ క్షణం మాత్రేమే మనది.
నిన్న అనేది తీరిపోయిన ఋణం.. రేపు అనేది దేవుడిచ్చిన వరం..
అందుకే రేపనే రోజున మంచి ఆలోచనలతో మంచి హృదయంతో ముందుకు సాగాలి.
కోరికలు అనేవి ప్రయాణంలో తీసుకెళ్లే వస్తువుల వంటివి.. అవి ఎంత ఎక్కువ అయితే జీవితాప్రయాణ అంత కష్టంగా ఉంటుంది.
మనిషి ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. ఉంటే పనికిమాలిన ఆలోచనలు వచ్చి అజ్ఞానిగా మారి చెడు వ్యసనాలకు బానిస అయి వక్రమార్గములో పయనిస్తాడు. అందుకే మంచి ఆలోచనతో భవిష్యత్తుపై మంచి ప్రణాళికతో ముందుకు సాగాలి.✍️```
🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment