Sunday, August 24, 2025

 నేడు అంటే నిన్న...
*రేపుల వారధి*

నువ్వు అంటే...
గెలుపు -ఓటమిల సారథి

లక్ష్యమంటే...
 కలలకు కంటిపాపకు మధ్య
నలిగేది

ఆశయమంటే....
నీలో ఓర్పుల నిప్పుల కుంపటే....!

సాహసిస్తావో...సాధిస్తావో

ఊహిస్తావో...ఊరుకుంటావో

మిన్న కుంటావో
మిన్ను అంటుతావో...

నిన్ను నడిపే...
స్వప్నాల నడుగు

నిన్ను స్పృశించిన 
ఆశల నడుగు

ముందుకు సాగే నీ పాదాన్ని
మరింత ముందుకు 
పద పద మంటాయి...!!

No comments:

Post a Comment