Sunday, August 24, 2025

 ప్రతి ఒక్క విజేత జీవిత కథలో
కఠోర ..శ్రమ ..కష్టం ఉంటాయి..

కానీ
ఓడిపోయిన ప్రతి ఒక్కరూ సోమరిపోతులు కాదు....

జీవిత ఆసాంతపు కష్టాన్ని..
అందలం ఎక్కే ఆఖరి మెట్టులో
 జార్చుకునే వారు ఉంటారు....

అదృష్టం...అవకాశం
అడ్డదారి కూడా ఒక్కోసారి 
మనిషిని అత్యుత్తమ స్థితిలో
నిలపవచ్చు..

అంత మాత్రాన వారు కఠోర దీక్షపరులు
అనుకోవడం అవివేకం....

నోట్....  సినిమాని డ్రామాని 
డైరెక్ట్ చేసినంత 
తేలికగా
మన జీవితాన్ని డైరెక్ట్ చేసుకోలేము.
నీకు ఇష్టం ఉన్నా లేకున్నా.....

మార్చలేని స్క్రిప్ట్ లో..
తొలగించలేని దృశ్యాలలో
నీవు జీవిత ఆసాంతం
జీవించవలసిందే...!!

No comments:

Post a Comment