మీరు కూడా ఫ్రిజ్‌లో ఈ 13 వస్తువులు పెడుతున్నారా?వెంటనే బయటకు తీయండి!13 Foods You Should Never Refrig
Author Name:LadyDetective Tip's
Youtube Channel Url:https://www.youtube.com/@Ladydetective
Youtube Video URL:https://www.youtube.com/watch?v=X5tOADKWYcs
Transcript:
(00:00) నమస్తే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు కూడా పొరపాటున కూడా ఫ్రిడ్జ్ లో ఇలాంటి 13 వస్తువులను ఉంచుతున్నారా అయితే ఈ తప్పును మాత్రం ఎప్పుడూ చేయకండి లేదంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మహిళల్లో క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువవుతుంది. అలాగే గ్యాస్ ఎసిడిటీ మరియు కడుపు బరం అంటే బ్లోటింగ్ వంటి సమస్యలు కూడా వస్తాయి.
(00:28) ముఖ్యంగా ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం కూడా పెరుగుతుంది. మరి ఆ 13 వస్తువులు ఏమిటి ఈరోజు మనం ఆ పూర్తి వివరాల గురించి వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టకూడని వస్తువులలో మొదటి స్థానంలో ఉండేది బంగాళ దుంపలు. అవును పచ్చి బంగాళ దుంపలను మీరెప్పుడూ కూడా ఫ్రిడ్జ్ లో పెట్టకండి.
(00:56) మీరు బంగాళ దుంపలను ఫ్రిడ్జ్ లో ఉంచితే ఏం జరుగుతుందో తెలుసా ఫ్రిడ్జ్ లో ఉండే చల్లటి ఉష్ణోగత వాటిలోని స్టార్చ్ ను చెక్కెరగా మారుస్తుంది. ఇది డయాబెటిస్ రోగులకు చాలా ప్రమాదకరం. అలాగే ఫ్రిడ్జ్ నుండి తీసిన ఈ చల్లటి బంగాళ దుంపలను ఫ్రై చేసినప్పుడు లేదా వేయించినప్పుడు వాటిలో ఆక్రిలమైడ్ అనే ఒక రసాయనం ఏర్పడుతుంది. దీని ప్రభావం కనుక మన శరీరంలో పెరిగితే క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
(01:30) అందువల్ల బంగాళ దుంపలను ఎప్పుడు రూమ్ టెంపరేచర్ లో మాత్రమే అది కూడా ఏదైనా కాటన్ క్లాత్ తో కప్పి ఉంచుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఇలా చేయటం వలన అవి చాలా కాలం పాటు తాజాగా ఉంటాయి అలాగే మొలకలు కూడా రాకుండా పాడవ్వకుండా ఉంటాయి. ఇక నెంబర్ టూ అంటే ఉల్లిపాయలు అవును ఫ్రెండ్స్ రెండవ స్థానంలో ఫ్రిడ్జ్ లో పెట్టకూడని వాటిలో ఉండేవి ఉల్లిపాయలు మీరు ఉల్లిపాయలను ఫ్రిడ్జ్ లో ఉంచితే అవి మెత్తగా మారిపోతాయి.
(02:03) అయితే చాలామంది ఫ్రిడ్జ్లో ఉల్లిపాయలను కోసి నిల్వ ఉంచటాన్ని మీరు చూసే ఉండవచ్చు. ముఖ్యంగా బిర్యానీ కోసం ఉల్లిపాయలు కట్ చేసి మిగిలిన వాటిలని చాలామంది బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెడుతూ ఉంటారు కదా కానీ ఈ విధంగా చేస్తే వాటిలో హానికరమైన బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అలాగే ఫ్రిడ్జ్ లో ఉంచిన ఇతర వస్తువులలో కూడా ఈ దుర్వాసన చేరి ఫ్రిడ్జ్ అంతటా వ్యాపిస్తుంది.
(02:33) అందువల్ల మీరు బంగాళ దుంప లేదా ఉల్లిపాయలను నిల్వ ఉంచినప్పుడల్లా వాటిని రూమ్ టెంపరేచర్ లోనే ఉంచండి అంటే సూర్యరశ్మి పడని గాలి ఆడే ప్రదేశంలో వాటిని ఉంచాలి మీరు వాటి మీద ఏదైనా కాటన్ క్లాత్ ని కూడా కప్పుకోవచ్చు దీంతో అవి గ్యారెంటీగా తాజాగా ఉంటాయి. ఎక్కువ కాలం కూడా మన్నుతాయి. అయితే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి.
(02:59) ఉల్లిపాయల నుండి విడుదలయ్యే ఇథిలిన్ గ్యాస్ బంగాళ దుంపలను త్వరగా పాడు చేస్తుంది. ఎందుకంటే బంగాళ దుంపలకు త్వరగా మొలకలు వచ్చేలాగా చేస్తుంది. అలాగే ఉల్లిపాయల నుండి వచ్చే తేమ బంగాళ దుంపలను కుల్లింప చేయటం ప్రారంభిస్తుంది. అందువల్ల బంగాళ దుంపలు మరియు ఉల్లిపాయలు రెండిటిని విడివిడిగా ఉంచండి. అంటే వాటిని వేరు వేరు బుట్టల్లో ఉంచండి.
(03:25) లేదా వాటి మీద కాటన్ క్లాత్ ను కప్పి రూమ్ టెంపరేచర్ లో ఉంచిన అవి ఫ్రెష్ గానే ఉంటాయి. ఇక ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టకూడని మూడవ ముఖ్యమైన ఐటం టమోటాస్ అవును టమోటాలను కనుక మీరు ఫ్రిడ్జ్ లో ఉంచితే వాటి సువాసన మరియు రుచి కూడా మారిపోతాయి. అలాగే వాటి పైన ఉండే కణాలు దెబ్బ తిని అవి మరింత మెత్తగా మరియు రుచి లేకుండా తయారవుతాయి. అందువల్ల ఎక్కువ కాలం వీటిని ఉపయోగించుకోవడానికి వాటిని ఎల్లప్పుడూ రూమ్ టెంపరేచర్ లో అది కూడా గాలి ఆడే ప్రదేశంలో ఉంచాలి.
(04:02) ఫ్రెండ్స్ ఇక ఫ్రిడ్జ్ లో పెట్టకూడని నాలుగవ ఐటం అంటే కీరా దోసకాయ వాటిని కూడా ఫ్రిడ్జ్ లో పెట్టడం మానేయండి. ఎందుకంటే ఫ్రిడ్జ్ లో ఉష్ణోగత వాటిని మరింత మెత్తగా మరియు కుల్లిపోయేలాగా చేస్తాయి. అంటే మీరు అరటి పండ్లు టమోటాలు లేదా కర్బూజాలను వాటి దగ్గర ఉంచితే వాటి నుండి వెలువడే ఇథిలిన్ గ్యాస్ కీర దోసకాయలను త్వరగా పాడు చేస్తుంది.
(04:28) అందువల్ల వీటిని విడిగా మరొక బుట్టలో ఉంచుకోండి. ఇక ఫ్రిడ్జ్ లో పెట్టకూడని ముఖ్యమైన ఐదవ ఐటం అంటే వెల్లుల్లి. ఈ మధ్య మార్కెట్లో వలిచిన వెల్లుల్లి అంటే వాడకానికి సిద్ధంగా ఉన్న వెల్లుల్లి లభిస్తూ ఉండటాన్ని మీరు కూడా చూసి ఉంటారు. చాలామంది వాటిని కొనుగోలు చేసి తెచ్చుకొని ఫ్రిడ్జ్ లో నిల్వ కూడా చేస్తున్నారు. కానీ ఇది చాలా తప్పుడు పద్ధతి కొన్ని అధ్యయనాల ప్రకారం మీరు వలిచిన వెల్లుల్లిని ఫ్రిడ్జ్ లో నిల్వ చేసి ఉపయోగిస్తే మీకు అందవలసిన పోషక విలువలు మనకు పూర్తిగా అందవు.
(05:02) దానికి బదులుగా ఇది మన ఆరోగ్యంపై చాలా నెగటివ్ ప్రభావాన్ని చూపుతుంది. మీరు ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచి ఉపయోగించి వలిచిన వెల్లుల్లి తింటే మీ ఆరోగ్యానికి తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది. ఇంకా నిజంగా చెప్పాలి అంటే ఆయుర్వేదంలో వెల్లుల్లికి నెంబర్ వన్ స్థానాన్నే ఇచ్చారు. ఎందుకంటే వెల్లుల్లి రక్తపోటును తగ్గిస్తుంది.
(05:29) గుండె ఆరోగ్యానికి మంచిది కొలెస్ట్రాల్ ని కూడా నియంత్రిస్తుంది. కానీ మీరు కనుక దీన్ని తప్పుడు పద్ధతిలో ఉపయోగిస్తే మీకు ప్రయోజనాలు లభించటం పక్కన పెడితే నష్టాలే ఎదురవుతాయి. కాబట్టి ఎప్పుడైనా వెల్లుల్లిని వండే ముందు మాత్రమే వలుచుకొని తాజాగా ఉన్నప్పుడే ఉపయోగించండి తరువాత ఉపయోగించడం కోసం దాన్ని వచచుకొని నిల్వ చేయవద్దు. [సంగీతం] అలాగే వెల్లుల్లిని ఎప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టకండి.
(05:56) ఎప్పుడు రూమ్ టెంపరేచర్ లో కాటన్ క్లాత్ తో కప్పి ఉంచుకోండి. తద్వారా అవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి ఇక ఫ్రిడ్జ్ లో పెట్టకూడని నెక్స్ట్ ఐటం అంటే బెల్ పెప్పర్స్ అంటే క్యాప్సికం ఉంటాయి కదా అవి మీరు కనుక క్యాప్సికం ను ఫ్రిడ్జ్ లో పెడితే అవి త్వరగా మెత్తగా మారిపోతాయి అంటే వాటిలో కరకరలాడే గుణం అంటే క్రంచినెస్ అనేది కోల్పోతాయి ముఖ్యంగా బెల్ పెప్పర్స్ ను ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల వాటిలోని పోషకాలు కూడా నశిస్తాయి కాబట్టి బెల్ పేపర్స్ ను కూడా రూమ్ టెంపరేచర్ లోనే స్టోర్ చేసుకోవాలి దీంతో అవి ఎక్కువ కాలం పాటు తాజాగా ఉంటాయి. వాటిని మీరు ఎక్కువ రోజుల పాటు
(06:36) ఉపయోగించుకోవచ్చు. అలాగే వాటిలోని ఔషధ గుణాలు కూడా పూర్తిగా లభిస్తాయి. ఇక ఫ్రిడ్జ్ లో పెట్టకూడని నెక్స్ట్ ఐటం అంటే అవకాడోస్ వీటిని చాలామంది ఫ్రిడ్జ్ లో పెట్టడాన్ని చూసే ఉంటారు. ముఖ్యంగా సగానికి కోసి సగం వాడేసి మిగిలిన సగాన్ని ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచుకోవటం చాలామంది చేస్తారు కదా కానీ ఇది పూర్తిగా తప్పు. మనం ఏదైనా ఖరీదైన వస్తువును తెచ్చుకున్నప్పుడు [సంగీతం] దాన్ని ఎలా నిల్వ చేయాలో కూడా తెలుసుకోవాలి.
(07:07) ఎందుకంటే అవకాడోస్ కూడా చాలా కాస్ట్లీ కదా కాబట్టి వాటిని కొనుగోలు చేసినప్పుడు తాజాగానే తినేసేయండి. మిగిలిపోయిన సగాన్ని నిల్వ చేసే తప్పు మాత్రం చేయకండి. వీలైతే సరైన విధానాన్ని మాత్రమే నేర్చుకోండి. ఇక నెక్స్ట్ ఐటం తులసి ఆకులు తులసిని కూడా ఎప్పుడూ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోకూడదు. అంటే మన ఇంట్లో ఉండే తులసి ఆకులను కొన్నిసార్లు మనం వాటిని ఫ్రిడ్జ్ లో కూడా ఉంచుకుంటూ ఉంటాం.
(07:35) ఈ తప్పు ఎప్పుడూ చేయకండి. ఎందుకంటే అవి నల్లగా మారిపోతాయి. వాటిలో ఉండే సారం అంటే ఎసెన్స్ కూడా తగ్గిపోతుంది. మీరు తులసిని ఇంటికి తెచ్చి ఉపయోగించాల్సి వచ్చినప్పుడు వాటిని ఒక కప్పు నీటిలో వేసి రెండు నుండి మూడు రోజుల పాటు ఉంచుకోవచ్చు. తద్వారా అవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. వాటిలోని ఔషధ గుణాలు కూడా మీరు సరిగ్గా ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే తులసిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని తెలుసు కదా అవి మీ శరీరానికి దక్కాలి అంటే మీరు వాటిని సరైన పద్ధతిలో మాత్రమే ఉపయోగించాలి.
(08:09) ఇక ఫ్రిడ్జ్ లో పెట్టకూడని నెక్స్ట్ పదార్థం అంటే హనీ అవును ఫ్రెండ్స్ తేనెను ఎప్పుడూ ఫ్రిడ్జ్ లో నిల్వ చేయవద్దు. దీనిని ఎల్లప్పుడూ రూమ్ టెంపరేచర్ లోనే ఉంచుకోవాలి. తేనెను ఫ్రిడ్జ్ లో కాకుండా మరెక్కడైనా నిల్వ చేసుకోవచ్చు. ముఖ్యంగా నీడగా మరియు చీకటిగా ఉండే ప్రదేశంలో లేదా చల్లగా ఉండే చోట కూడా ఉంచుకోవచ్చు. ఎందుకంటే తేనె పై సూర్యరశ్మి డైరెక్ట్ గా పడితే అది పాడైపోయే అవకాశాలు పెరుగుతాయి.
(08:36) కాబట్టి దానిని గాలి ఆడే చోట నీడ ఉన్న ప్రదేశంలో ఉంచుకోండి. మీరు తేనెను ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచితే అది గడ్డకట్టుకుపోతుంది. అలాగే దానిలోని సహజ గుణాలు తగ్గిపోతాయి. ఇక ఫ్రిడ్జ్ లో పెట్టకూడని మరొక ముఖ్యమైన పదార్థం కలుపుకున్న పిండులు అంటే చాలామంది రాత్రిపూట గోధుమ పిండి వంటి వాటిని కలిపి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటూ ఉంచుతారు కదా అంటే ఉదయాన్నే పిల్లలు స్కూల్ కి వెళ్ళాలనో లేదా భర్త ఆఫీస్ కు టిఫిన్ చేయాలని హడావిడిలో ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచిన పిండిని బయటకు తీసి చపాతీలు చేస్తారు.
(09:12) కానీ ఇది పూర్తిగా తప్పు అని మీకు తెలుసా? ఈ విధంగా కలిపిన పిండిని ఫ్రిడ్జ్ లో నిల్వ చేయటం మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఎందుకంటే ఇందులో ఉండే గ్యాస్ మరియు గసి గడ్డకట్టడం పెరుగుతుంది. మరి దీనికి ఉత్తమమైన మార్గం ఏమిటి అంటే ఉదయాన్నే ఐదు నుండి 10 నిమిషాలు ముందుగానే లేచి అప్పటికప్పుడు తాజా పిండిని కలుపుకొని తాజాగా చపాతీ తయారు చేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి కూడా.
(09:43) ఇక ఫ్రిడ్జ్ లో పెట్టకూడని మరొక ముఖ్యమైన పదార్థం చేపలు లేదా మాంసం చాలా కుటుంబాలు మాంసాన్ని చాలా రోజుల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని అంటే ఫ్రీజర్ లో నిల్వ ఉంచుకొని తినటాన్ని మీరు చూసే ఉండవచ్చు మీరు కూడా ఇలా చేయవచ్చు కదా కానీ ఇది తప్పు ఇది కూడా మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని సైంటిఫిక్ గా రుజువయింది. ఎందుకంటే ఈ విధంగా మాంసం మరియు చేపలను ఫ్రీజర్ లో పెట్టి తింటే కాన్సర్ ప్రమాదం పెరుగుతుంది.
(10:14) ఎందుకంటే మీరు నాన్ వెజ్ ఫుడ్ ను ఒక్క రోజు లేదా రెండు రోజులు నిల్వ ఉంచినా కూడా అందులో బ్యాక్టీరియా పెరగటం ప్రారంభమవుతుంది. ఇక ఫ్రిడ్జ్ లో పెట్టకూడని మరొక ముఖ్యమైన ఆహారం ఇది. [సంగీతం] ఇదేమిటో తెలుసు కదా బ్రెడ్. చాలామంది ఇళ్లలో బ్రెడ్ ను కొనుగోలు చేస్తారు కానీ స్లైసెస్ తిన్న తర్వాత మిగిలిన భాగాన్ని వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తూ ఉంటారు.
(10:40) అయితే ఈ తప్పు మాత్రం మీరు ఎప్పుడూ చేయకండి ఎందుకంటే బ్రెడ్ ప్యాకెట్ ను ఓపెన్ చేసిన వెంటనే అది పాడవటం ప్రారంభం అవుతుంది. ఇక ఫ్రిడ్జ్ లో ఉంచినా కూడా ఇది పాడైపోతుంది. కాబట్టి మీరు ఏదైనా ఇంటికి తెచ్చుకున్నప్పుడు ముఖ్యంగా ఇటువంటి ఆహారాలను వెంటనే ముగించేయడానికి ట్రై చేయండి. వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టి నిల్వ చేసి తినే తప్పు ఎక్కువగా చేయకండి.
(11:03) కాబట్టి ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ లో ఏ ఏ వస్తువులను ఉంచకూడదో ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా అయితే నేను చివరిగా మీకు చెప్పేది ఒకటే మనం రోజు చేసే చిన్న చిన్న పొరపాట్లే మన ఆరోగ్యం పై పెద్ద పెద్ద నెగిటివ్ ప్రభావాలను చూపుతాయి. ఈ రోజుల్లో క్యాన్సర్ ప్రమాదం ఎంత ఎక్కువగా పెరిగిపోతుందో ఎందుకు పెరిగిపోతుందో ఈ వీడియో చూశాక మీకు కూడా అర్థమై ఉండవచ్చు.
(11:28) ఫ్రిడ్జ్ అనేది కేవలం మన సౌకర్యం కోసం మాత్రమే ఉందని గుర్తుపెట్టుకోండి. అంతేకానీ ప్రతి వస్తువును అందులో దాచడం సరైన పద్ధతి కాదు. ఇప్పుడు చెప్పిన పదార్థాలను గుర్తుపెట్టుకుని ఈ ఆహార పదార్థాలను సరైన పద్ధతిలో నిల్వ చేయటం అలవాటు చేసుకోండి. మరి వీటిని ఎలా నిల్వ చేయాలో మీకు కూడా కావాలి అనుకుంటే కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి.
(11:52) మరొక వీడియోలో తప్పకుండా తెలుసుకుందాం. [సంగీతం] ఎందుకంటే మనం ఫాలో అయ్యే ఆరోగ్యకరమైన అలవాట్లే మన దీర్ఘాయుష్కు మూలం అని గుర్తుపెట్టుకోండి. మరి ఈ సమాచారం మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి. మరి అప్పటివరకు తాజా ఆహారాన్ని తింటూ ఆరోగ్యంగా మరియు ఆనందంగా జీవించండి. థాంక్ యు ఫర్ వాచింగ్
No comments:
Post a Comment