సంసారంలో వైరాగ్యం మంచిదేనా ? Is detachment good in worldly life?#prasadthota #vastavam
Author Name:Vastavam Channel
Youtube Channel Url:https://www.youtube.com/@vastavam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=qRLm4fqCx_g
Transcript:
(00:00) దేవతా ఉపాసనలో బాగా లోతుగా వెళ్ళిన వారికి కుటుంబ సంబంధాల మీద ఆసక్తి తగ్గి బంధాలకు దూరం అవుతుంటారని నేను చెప్పినప్పుడు ఆ స్థితిలో ఉన్నవారు కొంతమంది ఆ పరిస్థితి మంచిదా కాదా అని అడుగుతున్నారు ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నవారికి అది ఒక ఉన్నత స్థాయి లాంటిది మోక్షానికి చేరుకోవడానికి మార్గం సుగమం అవుతుంది అని చెప్పాలి ప్రతి క్షణం తృప్తిని ఆనందాన్ని ఇచ్చే ఆధ్యాత్మిక ప్రయాణపు అనుభూతులు ప్రతి రోజు కూడా మానసిక ఒత్తిడిని పెంచే సాంసారిక జీవితం జీవితం మీద విరక్తిని కలిగించడం చాలా సహజం కానీ కుటుంబ బాధ్యతలో ఉన్నవారు ఆ బాధ్యతలు తీరకుండానే ఈ వైరాగ్య స్థితిలోకి
(00:38) జారిపోవడం ధర్మం కాదు అగ్ని సాక్షిగా చేసిన పెళ్లి నాటి ప్రమాణాలని తీసుకున్న బాధ్యతల్ని కాలదనడం ఏ దేవత శక్తి అంగీకరించదు పెళ్లి తోటి అంగీకరించిన బాధ్యతలు పూర్తి అయిన తర్వాత ఆ స్థితిలోకి పూర్తిగా వెళ్ళిపోవచ్చు అంతవరకు సంసార బాధ్యతల్ని ఆధ్యాత్మిక సాధనని సమతుల్యం చేసుకోవాలి
No comments:
Post a Comment