Tuesday, June 16, 2026

విపరీత మానసిక ఒత్తిడిని నేను ఎలా ఎదుర్కుంటాను | Cardiologist Reveals Stress Management Secrets

విపరీత మానసిక ఒత్తిడిని నేను ఎలా ఎదుర్కుంటాను | Cardiologist Reveals Stress Management Secrets

Author Name:Dr M S S Mukharjee | Pulse Heart

Youtube Channel Url:https://www.youtube.com/@DrMukharjeeOfficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=OTJCO7La_S8



Transcript:
(00:00) కార్డియాలజిస్ట్ కూడా స్ట్రెస్ వస్తుంది ఇన్ఫాక్ట్ కార్డియాలజిస్ట్లకి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది కానీ దాన్ని నేను ఎలా హ్యాండిల్ చేస్తాను నమస్తే నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ మీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ని ఈరోజు నేను స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడక అనుకుంటున్నాను కానీ పుస్తకాల్లో ఉండే సిద్ధాంతాలు చెప్పడానికి కాదు నా జీవితంలో జరిగిన ఒక నిజమైన రోజు గురించి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను.
(00:22) నాకన్నా బాగా స్ట్రెస్ హ్యాండిల్ చేసేవాళ్ళు అనేకమంది ఉండొచ్చు నాకన్నా తక్కువగా స్ట్రెస్ హ్యాండిల్ చేసేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ఆ కొంతమందికి ఇది ఉపయోగపడతదని ఈ వీడియో చేస్తున్నాను. నిన్న నా రోజు ఎలా గడిచిందో చెప్తాను. ఉదయం ఓపిలో దాదాపు 100 మంది రోగులను చూడాల్సి వచ్చింది. అదే సమయంలో క్యాట్ లాబ్ లో ఆరు యంజియోప్లాస్టీస్ ఉన్నాయి నిన్న వాటిల్లో రెండు చాలా క్లిష్టమైన రోటాబులేషన్ ప్రొసీజర్స్ రోటాబులేషన్ ప్రొసీజర్స్ అంటే రక్తనాళాల్లో కాల్షియం ఎక్కువగా పేరుకొని రక్తనాళాలు బాగా టార్చువస్ గా ఉన్నాయ అన్నమాట వాళ్ళకి అంటే నార్మల్ గా స్ట్రైట్
(00:53) గా ఉంటే పర్వాలే టార్చువస్ గా ఉండి దాంతో పాటు కాయల్షియం ఎక్కువ ఉంటే వాళ్ళకి రోటాబులేషన్ చేసి క్లియర్ చేయడం అనేది కొంచెం కష్ట సాధ్యమైన విషయం. సో దాంతో పాటుగా ఇంకో రెండేమో బైఫర్కేషన్ యంజియోప్లాస్టీస్ అంటే రక్తనాళాలు రెండుగా విడిపోయే చోట బ్లాకేజ్ ఉండటం వల్ల ప్రొసీజర్ మరింత క్లిష్టం అవుతుంది. ఇంకొకటి ప్రైమరీ యంజియోప్లాస్టీ అంటే హార్ట్ అటాక్ లో వచ్చిన రోగికి అత్యవసరంగా చేసే ప్రొసీజర్ ఇంకొకవైపు ఓపిలో రోగులు ఎదురు చూస్తా ఉన్నారు మరోవైపు క్యాట్లాబ్ లో కాంప్లెక్స్ ప్రొసీజర్స్ ఎదురు చూస్తున్నాయి. ఫోన్ కాల్స్ సిబ్బంది అడిగే
(01:24) ప్రశ్నలు ఆసుపత్రి నిర్వహణకు సంబంధించిన నిర్ణయాలు ఇంటి బాధ్యతలు అన్నీ ఒకే రోజు ఒకేసారి నేను ఇప్పుడు మీతో నిజాయితీగా మాట్లాడతాను నాకు స్ట్రెస్ రాదు అని చెప్తే అది అబద్ధం అవుతుంది. స్ట్రెస్ వల్ల బీపి పెరుగుతుందని నాకు తెలుసు, స్ట్రెస్ వల్ల షుగర్ నియంత్రణ తప్పుతుందని నాకు తెలుసు, స్ట్రెస్ వల్ల ఎక్కువ కాలం స్ట్రెస్ ఉంటే షుగర్ వచ్చే అవకాశం పెరుగుతుందని నాకు తెలుసు, స్ట్రెస్ వల్ల నిద్ర దెబ్బ తింటుందని తెలుసు, స్ట్రెస్ వల్ల గుండెపై ఎఫెక్ట్ ఉంటదని కూడా నాకు తెలుసు.
(01:52) అయినా స్ట్రెస్ ని పూర్తిగా తప్పించుకోవడం సాధ్యం కాదు కాబట్టి అసలు ప్రశ్న ఏంటంటే స్ట్రెస్ లేకుండా ఎలా జీవించాలి అని కాదు స్ట్రెస్ ఉన్న ఎలా బాగా జీవించాలి స్ట్రెస్ ని ఎలా హ్యాండిల్ చేయాలి అని ఇన్ని సంవత్సరాలు నా అనుభవంలో నేను నేర్చుకున్న కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. మొదటి విషయం ఏ రకంగా నేను స్ట్రెస్ హ్యాండిల్ చేస్తున్నాను అంటే ఈ క్షణంలో ఉండటం అనేది మనలో చాలామందికి ఒకే సమస్య ఉంటుంది మన శరీరం ఒకచోట ఉంటుంది కానీ మనసు ఇంకొక చోటు ఉంటుంది.
(02:17) నేను నిన్న ఓపిడిలో పేషెంట్ ని చూస్తున్నప్పుడు క్యాత్ లాబ్ లో ఉన్న కేసు గురించి ఆలోచించడం మొదలు పెడితే నా ముందు కూర్చున్న పేషెంట్ కి న్యాయం చేయలేను. అలాగే క్యాత్ లాబ్ లో ప్రొసీజర్ చేస్తున్నప్పుడు ఓపిడి గురించి ఆలోచించి పేషెంట్స్ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అంటే ప్రొసీజర్ కి న్యాయం చేయలేను కానీ నిజం ఏంటంటే మనసుని పూర్తిగా కంట్రోల్ చేయడం అంతగా సులభం కాదు అందుకే నేను ప్రయత్నించేది ఒక్కటే ప్రస్తుతం నా ముందు ఉన్న దాని పనితీరు పైనే నాకు పూర్తి దృష్టి పెట్టడం పేషెంట్ తో మాట్లాడుతున్నానా అయితే పేషెంట్ మాత్రమే ప్రొసీజర్ చేస్తున్నానా అయితే ప్రొసీజర్
(02:47) మాత్రమే స్ట్రెస్ బాక్ గ్రౌండ్ లో ఉండొచ్చు కానీ ఫోర్ గ్రౌండ్ లో ఉండకూడదు ఇది స్ట్రెస్ మేనేజ్మెంట్ లో నేను నేర్చుకున్న మొదటి పాఠం నా ముందు కూర్చున్న పేషెంట్ తో నేను నవ్వుతూ మాట్లాడగలగాలి వాళ్ళ బాధను నేను అర్థం చేసుకోగలగాలి వాళ్ళ బాధని కొంతనైనా నేను స్వాంతనం కలిగించగలగాలి అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక రెండో విషయం ఏంటంటే ప్లానింగ్ స్ట్రెస్ లో చాలా భాగం పని వల్ల కాదు ఆ అనిశ్చితి వల్ల వస్తుంది.
(03:12) ఏం చేయాలి ఏది ముందు ఏది తర్వాత ఏది అత్యవసరం ఏది వెయిట్ చేయొచ్చు ఇలేది స్పష్టంగా లేకపోతే మెదడు అలసిపోతుంది అందుకే రోజు ప్రారంభంలోనే నేను ప్రయారిటీస్ నిర్ణయించడానికి ప్రయత్నం చేస్తాను ఆ రోజు తప్పనిసరిగా చేయాల్సినవి ఏంటి ఎవరికి దేనికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఏ పనిని తర్వాతకి వదిలేయచ్చు అనేది ఒకసారి ఆలోచిస్తాను ప్రతిరోజు ప్లాన్ ప్రకారం జరగదు మెడిసిన్ లో అయితే అసలే జరగదు ఎప్పుడైనా ఎమర్జెన్సీ రావచ్చు కానీ ప్లాన్ ఉంటే కనీసం దారి తెలుస్తుంది ప్లాన్ ని కొయాస్ ని తొలగించదు ఆ కెయాస్ ని హ్యాండిల్ చేయడానికి కొంతవరకు మనకి
(03:47) హెల్ప్ చేస్తుంది. కాబట్టి కొంచెం ప్లాన్ చేసుకొని నా లంచ్ టైం లో వచ్చేటప్పటికీ అప్పుడు మనం కొంచెం ఈ కాంప్లెక్స్ రోటబులేషన్స్ పెట్టుకున్నాను అలా ప్లాన్ చేసుకున్నాను. మూడోది ఏంటంటే టీం వర్క్ డెలిగేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది నేను చాలా ఆలస్యంగా నేర్చుకున్న పాఠం చాలా మంది అనుకుంటారు అన్ని నేనే చేయాలి నేను లేకుండా పని జరగదు.
(04:09) నేను చూసుకుంటే ఇంకా బాగా జరుగుతుంది నేను కూడా ఒకప్పుడు అలాగే అనుకునేవాడిని పేషెంట్ కి బీపి తో సహా నేనే చూసుకునేవాడిని చాలా మంది నా పాత పేషెంట్లు అంటారు బీపి మీరే చూసేవాళ్ళు సార్ అప్పుడుఅని కానీ ఒక పెద్ద హాస్పిటల్ ఒక్కడి వల్ల నడవదు నర్సులు ఉంటారు టెక్నీషియన్స్ ఉంటారు జూనియర్ డాక్టర్స్ ఉంటారు అడ్మినిస్ట్రేటివ్ సాఫ్ ఉంటారు అందరూ కలిసి పని చేస్తేనే వ్యవస్థ నడుస్తుంది.
(04:31) మన జీవితంలో కూడా ఇదే నిజం మీరు చేయాల్సిన పని మీరు చేయండి కానీ మీరు చేయాల్సిన అవసరం లేని పనిని ఇంకొకళ్ళకి అప్పగించగలిగితే అప్పగించండి డెలిగేషన్ అనేది బలహీనత కాదు అది ఒక జాగ్రత్తగా తీసుకోవాల్సిన తెలివైన నిర్ణయం మనం ఏ రకంగా డెలిగేట్ చేయాలి అని అంటే మన జూనియర్స్ ని మనం ట్రైన్ చేసుకోవాలి వాళ్ళు తీసుకునే నిర్ణయాలకి సంబంధించిన బాధ్యత కూడా మనమే తీసుకోవాలి కానీ వాళ్ళని ప్రాపర్ గా ట్రైన్ చేసుకున్నప్పుడు మనం డెలిగేషన్ కొంత మేరకు కొంత అన్ ఇంపార్టెంట్ విషయాల్ని మనం డెలిగేట్ చేయగలిగితే స్ట్రెస్ తగ్గుతుంది అందుకని ఇప్పుడు నేను బీపీలు చూడట్లేదు పేషెంట్ ని
(05:03) చూడటానికి ఎక్కువ టైం కేటాయిస్తున్నాను. నాలుగో విషయం ప్రతి మంచి అవకాశాన్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు ఇది చాలా ముఖ్యమైన విషయం మనకు స్ట్రెస్ తెచ్చేవి ఎప్పుడూ చెడు విషయాలు కావు చాలాసార్లు అవి మంచి విషయాలే ఒక మీటింగ్ ఒక ఇన్విటేషన్ ఒక స్పీకర్ అసైన్మెంట్ ఒక సోషల్ గ్యాదరింగ్ అన్ని మంచి విషయాలే కానీ ప్రతి మంచి విషయము మన జీవితానికి అవసరం కాదు గత కొన్నేళ్లుగా నేను చాలా స్పీకర్ అసైన్మెంట్స్ కి నో చెప్పాను చాలా మీటింగ్స్ ని వదిలేసాను చాలా మంది నన్ను చైర్ పర్సన్ గా ఉండమని ఒక పానలిస్ట్ గా ఉండమన స్పీకర్ గా ఉండమనో పిలుస్తారు చాలా
(05:37) మంది అవార్డ్స్ వస్తున్నాయి మీకు అవార్డు వచ్చి తీసుకోమంటారు వెళ్ళలేను చాలా వాటికి వెళ్ళలేను చాలా సోషల్ ఈవెంట్స్ కి వెళ్ళలేను నాకు పొగరు ఎక్కువైపోయిందేమో అనుకుంటారు బంధువులు కానీ నేను అలా కాదు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మనం మానేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే నాకు ముఖ్యమైన బాధ్యతలు ఉన్నాయి. ఒక పక్క పేషెంట్లను చూసుకోవాలి ఇంకో పక్క క్యాథలాబ్ లో ప్రొసీజర్ చూసుకోవాలి, పేషెంట్స్ ని జాగ్రత్తగా చూసుకోవాలి, ఫ్యామిలీ జాగ్రత్తగా చూసుకోవాలి నా హెల్త్ ని నేను చూసుకోవాలి.
(06:02) దీన్ని బట్టి ఒక విషయం నేర్చుకున్నాను ప్రతి ఎస్ వెనకాల ఒక నో దాగి ఉంటది మీరు ఒక కమిట్మెంట్ ఒప్పుక ఎస్ చెప్తే మీరు మీ విశ్రాంతికి నో చెప్తున్నట్టే మీ కుటుంబానికి నో చెప్తున్నట్టే మీ ఆరోగ్యానికి నో చెప్పడం నో చెప్పడం నేర్చుకోవాలి స్ట్రెస్ మేనేజ్మెంట్ లో అత్యంత శక్తివంతమైన పదం నో కానీ అది చెప్పడం చాలా కష్టం ఎందుకంటే మనం అందరినీ సంతోష పెట్టాలి అని అనుకుంటాం అది అసాధ్యం ఎవరు అన్నిటికీ ఎస్ చెప్పలేరు ఎవరు అన్ని బాధ్యతలు తీసుకోలేరు ఎవరు అన్ని అవకాశాలని ఉపయోగించు కోలేరు కొన్నిసార్లు జీవితంలో మనం ముఖ్యమైన వాటిని కాపాడుకోవాలంటే కొన్ని మంచి
(06:36) అవకాశాలకి నో చెప్పాలి. ఇక ఐదోది ఆఖరిగా ఒక విషయం చెప్పాలి. ఇక్కడ మనం ఎంత జాగ్రత్తగా ఆలోచించాలంటే నేను ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్న ఎంత జాగ్రత్తగా డెలిగేట్ చేసినా ఎంత అత్యవసరం కాని విషయాలకి నో చెప్పినా ఇన్నీ మనం నేను ముందు చెప్పిన నాలుగు చేసినా కూడా నా జాబ్ లో స్ట్రెస్ అనేది కంపల్సరీ అదేవిధంగా అందరికీ స్ట్రెస్ ఒకటి ఉండొచ్చు కానీ మనం సాధ్యమైనంత వరకు ఆ స్ట్రెస్ ని తామరాకు పైన నీటి బొట్టు లాగా మనం దాన్ని వదిలేసి వెళ్ళగలిగితే అది అత్యంత లాభదాయకం కానీ అందరం అది చేయలేము.
(07:15) కొంత మేరకు స్ట్రెస్ ఉండి తీరుతుంది కొంత మేరకు ఆ స్ట్రెస్ ని మనం యాక్సెప్ట్ చేయాలి అనే విషయాన్ని మనం గమనించాలి. స్ట్రెస్ ఉంది కదా అనేది ఇంకో స్ట్రెస్ కాకుండా చూసుకోండి స్ట్రెస్ ఉంటది దాన్ని మనం అది ఒక పార్ట్ ఆఫ్ మన జాబ్ అని తెలుసుకోవడమే ఒక సంయమనంతో మనం జీవించటమే ఒక స్థిత ప్రజ్ఞతను మనం సాధించడమే మనం చేయగలిగింది. నేను పూర్తిగా స్ట్రెస్ ని జయించాను అని చెప్పడం లేదు అది కరెక్ట్ కూడా కాదు నేను కూడా మీలాగా ఒక మనిషినే నాకు కూడా బాధ్యతలు ఉన్నాయి నాకు కూడా ఆందోళనలు ఉన్నాయి నాకు కూడా ఒత్తిడి ఉంటుంది.
(07:46) కానీ నేను నేర్చుకున్న విషయం ఒక్కటే స్ట్రెస్ ని పూర్తిగా తొలగించడం చాలా కష్టం కానీ స్ట్రెస్ ని మన జీవితాన్ని నియంత్రించకుండా చూడటం మాత్రం మన చేతిలో ఉంటుంది. ఈరోజు నేను మీకు ఐదు విషయాలు గుర్తుంచుకోమని చెప్తున్నాను. ఒకటి ఈ క్షణంలో ఉండండి రెండోది రోజుని ప్లాన్ చేయండి మూడోది టీం సహాయం తీసుకోండి నాలుగోది అవసరమైన పనుల్ని తగ్గించుకోండి ఐదోది మీరు ఎంత చేసినా కొంత స్ట్రెస్ ఉండిపోతుంది.
(08:11) స్ట్రెస్ ఉండటం అనేది బలహీనత కాదు స్ట్రెస్ ని అర్థం చేసుకొని దాన్ని నిర్వహించడం జీవిత నైపుణ్యం నేను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను మీరు కూడా నేర్చుకోవచ్చు. మనందరం కలిసి ఆరోగ్యంగా ప్రశాంతంగా జీవించవచ్చు. ధన్యవాదాలు నమస్తే.

No comments:

Post a Comment