Tuesday, June 16, 2026

God Is About To Change Your Life If This Is Happening | పచ్చి నిజాలు 🔥🤫

God Is About To Change Your Life If This Is Happening | పచ్చి నిజాలు 🔥🤫

Author Name:Truth Inside you

Youtube Channel Url:https://www.youtube.com/@TRUTHINSIDEYOU7

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ycfNmx0X7gw



Transcript:
(00:03) నువ్వు జీవితంలో ఒక పెద్ద స్థాయికి చేరుకోవాలని నిజంగా కోరుకుంటే దేవుడు నిన్ను తప్పకుండా పరీక్షిస్తాడు. ఆ పరీక్షలు ఎలా ఉంటాయంటే నువ్వు ఆ కోరికకు అర్హుడివని నిరూపించేంతవరకు మళ్ళీ మళ్ళీ నీ సహనాన్ని నీ నమ్మకాన్ని నీ పట్టుదలను పరీక్షిస్తూనే ఉంటాడు. ఈ వీడియో నీ దగ్గరకు రావడం యాదృచ్చికం కాదు. బహుశా నీ జీవితంలో ఒక కొత్త మార్పు ప్రారంభం అవుతున్న సంకేతం కావచ్చు.
(00:32) నువ్వు జీవితంలో ఎప్పుడైనా ఇలా అనిపించిందా అన్ని బాగానే జరుగుతున్నాయి అనుకున్న సమయంలో ఒక్కసారిగా మనుషులు దూరమయ్యారు. స్నేహితులు దూరమయ్యారు ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారు. డబ్బు తగ్గిపోయింది. అవకాశాలు మాయమయ్యాయి. నువ్వు నమ్మిన ప్రపంచమే నిన్ను ఒంటరిగా వదిలేసినట్టు అనిపించింది. కానీ ఒక ప్రశ్న అది నిజంగా శాపమా లేక దేవుడు నీ జీవితంలో ఏదో పెద్ద మార్పు తీసుకురావడానికి చేసిన ప్రిపరేషన్ ఈరోజు నేను చెప్పబోయే విషయం నీ జీవితాన్ని పూర్తిగా కొత్త కోణంలో చూడేలా చేస్తుంది.
(01:06) ఎందుకంటే చాలామందికి తెలియని ఒక స్పిరిచువల్ ట్రూత్ ఉంది. దేవుడు మనకి దగ్గరయ్యే ముందు మనకి అవసరం లేని వాటిని మన జీవితంలో నుండి దూరం చేస్తాడు. ఎందుకు ఎలా దాని వెనక ఉన్న యూనివర్స్ సీక్రెట్ ఏంటి? మనసు వెనుక ఉన్న సైకాలజీ ఏంటి? చివరి వరకు విను ఎందుకంటే ఈ వీడియో చివరికి నువ్వు నీ జీవితంలో జరిగిన ప్రతి బాధ వెనుక ఉన్న అసలు కారణాన్ని అర్థం చేసుకుంటావు. ఒక్కసారి ఊహించు.
(01:36) నీ చేతిలో ఒక గ్లాస్ ఉంది. అది మురికి నీటితో నిండిపోయింది. అందులో స్వచ్ఛమైన నీరు పోయాలంటే ముందుగా ఏం చేయాలి? ఆ మురికి నీటికి బయటకు తీసేయాలి కదా అలాగే దేవుడు కూడా నీ జీవితంలో కొత్త ఆశీర్వాదాలు పంపే ముందు పాత భారాలను బయటకు తీస్తాడు. కానీ సమస్య ఏంటంటే మనకి ఆ సమయంలో అది అర్థం కాదు. మనం కోల్పోయిన వాటినే చూస్తాం. రాబోయే వరాలను చూడలేం.
(02:05) అక్కడే బాధ మొదలవుతుంది. ఇక్కడ ఒక పవర్ఫుల్ ట్రూత్ ఉంది. దేవుడు ఎప్పుడూ నీ జీవితంలో మంచి వాటిని తీసుకోడు. నీ ఎదుగుదలకు అడ్డుగా ఉన్న వాటినే తీసేస్తాడు. కానీ అవి మనకి చాలా విలువైనవిగా కనిపిస్తాయి. అందుకే మనం ఏడుస్తాం విరిగిపోతాం. అసలు విషయం అర్థం కాక దేవుడినే ప్రశ్నిస్తాం. ఎందుకు నాకే ఇలా జరుగుతోందని.
(02:29) ఇప్పుడు హ్యూమన్ సైకాలజీ గురించి మాట్లాడుకుందాం. మనిషి మెదడు కంఫర్ట్ జోన్ ని ప్రేమిస్తుంది. ఎంత టాక్సిక్ రిలేషన్షిప్ అయినా ఎంత ఫేక్ ఫ్రెండ్షిప్ అయినా ఎంత బాధ ఇచ్చే సిచువేషన్ అయినా అది అలవాటైపోతే దానిని వదలడానికి భయపడుతుంది. ఎందుకంటే అన్న నోన్ ఫ్యూచర్ కంటే నోన్ పెయిన్ మనిషికి సేఫ్ గా అనిపిస్తుంది. ఇది సైకలాజికల్ ఫ్యాక్ట్ అందుకే దేవుడు మనల్ని కొత్త స్థాయికి తీసుకెళ్లాలంటే ముందుగా ఆ కంఫర్ట్ జోన్ ని బ్రేక్ చేస్తాడు.
(03:00) అది మనకి పనిష్మెంట్ లా అనిపిస్తుంది. కానీ నిజానికి అది ప్రమోషన్ ఇక్కడ ఒక చిన్న కథ ఉంది. ఒక గ్రామంలో ఒక యువకుడు ఉండేవాడు. అతనికి తన జీవితం మీద చాలా కంప్లైంట్స్ ఉండేవి. ఎప్పుడూ సమస్యలే ఎప్పుడూ ఫెయిల్యూర్స్ ఒకరోజు అతను ఒక మహర్షిని కలిశాడు. అతను అడిగాడు దేవుడు నన్ను ఎందుకు ఇంత కష్టపెడుతున్నాడు? ఎందుకు నా దగ్గర ఉన్న వాళ్ళందరినీ దూరం చేస్తున్నాడు? మహర్షి నవ్వి అతన్ని ఒక శిల్పి దగ్గరకు తీసుకెళ్ళాడు.
(03:29) అక్కడ ఒక పెద్ద రాయిని శిల్పి చెక్కుతున్నాడు. సుత్తితో బలంగా కొడుతున్నాడు. రాయి ముక్కలు ముక్కలుగా పడుతున్నాయి. యువకుడు అడిగాడు ఈ రాయిని ఎందుకు ఇంత బాధ పెడుతున్నాడు మహర్షి అన్నాడు కొంచెం ఆగి చూడు కొన్ని రోజుల తర్వాత అదే రాయి ఒక అద్భుతమైన దేవుని విగ్రహంగా మారింది. అప్పుడు మహర్షి చెప్పిన మాట అతని జీవితాన్ని మార్చేసింది.
(03:53) దేవుడు నిన్ను శిక్షించడం లేదు నిన్ను చెక్కుతున్నాడు. నువ్వు ఇప్పుడు ఉన్న స్థితి కాదు నువ్వు అవ్వబోయే రూపాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆ మాట వినగానే యువకుడి కళ్ళల్లో నీళ్ళ వచ్చాయి. ఎందుకంటే అతను మొదటిసారి తన బాధకు అర్థం తెలుసుకున్నాడు. ఇప్పుడు నీ గురించి ఆలోచించు నీ జీవితంలో ఎవరో నిన్ను వదిలి వెళ్ళిపోయారా? ఒక రిలేషన్షిప్ ముగిసిందా? ఒక ఫ్రెండ్షిప్ బ్రేక్ అయిందా? ఒక జాబ్ పోయిందా? ఒక అపర్చునిటీ మిస్ అయిందా? ఒక్కసారి ఇలా ఆలోచించు.
(04:23) అది నిజంగా నష్టమా లేక దేవుడు నిన్ను తప్పుదారిలోనుండి కాపాడాడా చాలాసార్లు మనం కోల్పోయింది బ్లెస్సింగ్ కాదని తర్వాత అర్థంవుతుంది. అప్పుడు మనం వెనక్కి తిరిగి చూసి అంటాం అది జరగకపోతే ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు అని ఇదే యూనివర్స్ ప్రిన్సిపుల్ ప్రకృతి ఎప్పుడూ ఖాళీని వదిలి పెట్టదు. ఏదైనా బయటకు వెళితే దాని స్థానంలో ఇంకేదో వస్తుంది.
(04:49) కానీ కొత్తది రావాలంటే పాతది వెళ్ళాలి. ఇది యూనివర్సల్ లా అందుకే కొన్ని డోర్స్ క్లోజ్ అవుతాయి కొత్త డోర్స్ ఓపెన్ అవ్వడానికి కొన్ని మనుషులు దూరం అవుతారు సరైన మనుషులు రావడానికి కొన్ని కలలు విరిగిపోతాయి నీ అసలు పర్పస్ బయట పడడానికి ఇక్కడే చాలా మంది తప్పు చేస్తారు. దేవుడు ఏదైనా తీసేసినప్పుడు వాళ్ళు హోప్ కూడా వదిలేస్తారు.
(05:14) ఫెయిత్ కోల్పోతారు తమ విలువ మరిచిపోతారు. కానీ గుర్తుంచుకో నువ్వు ఒంటరిగా ఉన్నావంటే దేవుడు నిన్ను వదిలేసాడని కాదు అతను నిన్ను క్రౌడ్ నుండి సెపరేట్ చేసి నీ అసలు ఐడెంటిటీని చూపిస్తున్నాడు. ఎందుకంటే చాలాసార్లు నాయిస్ ఎక్కువగా ఉన్నప్పుడు మన ఆత్మస్వరం వినిపించదు. అందుకే దేవుడు సైలెన్స్ ఇస్తాడు. ఒంటరితనం ఇస్తాడు. రిఫ్లెక్షన్ కి టైం ఇస్తాడు.
(05:40) ఆ సమయంలోనే నిజమైన ట్రాన్స్ఫర్మేషన్ మొదలవుతుంది. బటర్ఫ్లై కథ తెలుసు కదా క్యాటర్పిల్లర్ గా ఉన్నప్పుడు అది నేల మీద పాకుతుంది. కానీ బటర్ఫ్లై కావడానికి ముందు అది పూర్తిగా ఒంటరిగా ఒక కుకూన్ లో ఉండాలి చీకటిలో నిశశబ్దంలో బయటకు చూస్తే అది బంధన్లా కనిపిస్తుంది. కానీ లోపల ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతోంది. అలాగే నీ జీవితంలో కూడా ప్రస్తుతం నువ్వు చీకటిలో ఉన్నట్టు అనిపించవచ్చు.
(06:07) ఎవరూ అర్థం చేసుకోవడం లేదు అనిపించవచ్చు. అన్ని పోయినట్టు అనిపించవచ్చు కానీ బహుశా ఇదే నీ ట్రాన్స్ఫర్మేషన్ ఫేస్ కావచ్చు ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం దేవుడు నీకన్నీ ఇవ్వడానికి ముందు నువ్వు వాటిని హ్యాండిల్ చేయగలవా లేదా అని చూస్తాడు. అందుకే పరీక్షలు వస్తాయి ఫెయిల్యూర్స్ వస్తాయి రిజెక్షన్స్ వస్తాయి డిలేస్ వస్తాయి. అవి నీ జీవితాన్ని ఆపడానికి రావు నిన్ను బలంగా చేయడానికి వస్తాయి.
(06:34) ఎందుకంటే వీక్ మైండ్ కి పెద్ద బ్లెస్సింగ్స్ ప్రమాదకరం. స్ట్రాంగ్ మైండ్ కి అవి ఆపర్చునిటీస్ అవుతాయి. అందుకే ప్రతి కష్టం వెనక ఒక ట్రైనింగ్ ఉంది. ప్రతి బాధ వెనక ఒక లెసన్ ఉంది. ప్రతి డిలే వెనక ఒక డివైన్ టైమింగ్ ఉంది. ఇప్పుడు ఈ మాట జాగ్రత్తగా విను నీ జీవితంలో అన్ని దూరమవుతున్నప్పుడు భయపడకు ఎందుకంటే దేవుడు నీ జీవితాన్ని ఖాళీ చేయడం లేదు.
(06:59) కొత్త వరాల కోసం స్థలం తయారు చేస్తున్నాడు. నువ్వు కోల్పోయిన ప్రతి దాని కోసం ఏవడం ఆపు. నువ్వు అవ్వబోయే వ్యక్తి కోసం సిద్ధమవ్వు. ఎందుకంటే నీ ఫ్యూచర్ వర్షన్ ఇప్పటి నిన్ను చూసి ఒకరోజు థాంక్యూ చెబుతుంది. నువ్వు లొంగిపోలేదు కాబట్టి నువ్వు ఫెయిత్ కోల్పోలేదు కాబట్టి నువ్వు ముందుకు నడిచావు కాబట్టి చివరిగా ఒక విషయం ఈరోజు నీ జీవితంలో ఏదైనా దూరమై ఉంటే దాన్ని వెంటనే శాపంగా నిర్ణయించకు కొన్ని తలుపులు దేవుడు మూసేస్తాడు ఎందుకంటే అవి నిన్ను తప్పుదారికి తీసుకెళ్తున్నాయి.
(07:31) కొంతమందిని దూరం చేస్తాడు. ఎందుకంటే వాళ్ళు నీ శాంతిని దోచుకుంటున్నారు. కొన్ని అవకాశాలను ఆపేస్తాడు. ఎందుకంటే నీకోసం ఇంకా గొప్ప అవకాశం సిద్ధంగా ఉంది. కాబట్టి ఇక నుండి ఏదైనా కోల్పోతే ఒక ప్రశ్న అడుగు దేవుడు నన్ను శిక్షిస్తున్నాడా లేక నన్ను సిద్ధం చేస్తున్నాడా? ఈ ఒక్క ప్రశ్న నీ జీవితాన్ని మార్చేస్తుంది. గుర్తుంచుకో దేవుడు నీ జీవితంలోనుండి ఏదైనా తీసేసినప్పుడు అది ముగింపు కాదు అదిఒక కొత్త అధ్యాయం ప్రారంభం నీ కన్నీళ్లు వృధా కావు నీ బాధ వృధా కాదు నీ ఎదురుచూపులు వృధా కావు ఎందుకంటే దేవుడు ఆలస్యం చేయవచ్చు కానీ ఎప్పుడూ తప్పు చేయడు. ఈరోజు
(08:12) నువ్వు అర్థం చేసుకోలేని దాన్ని రేపు నువ్వే ఆశ్చర్యపడి అర్థం చేసుకుంటావు. అప్పుడు నువ్వు ఆకాశం వైపు చూసి ఒక్క మాట చెబుతావు ధన్యవాదాలు దేవుడా అప్పుడు నన్ను బాధ పెట్టిన ప్రతి విషయం నన్ను నా గమ్యానికి దగ్గర చేసింది అని నేను నా కోపాన్ని అదుపులో పెట్టుకుంటాను నా కామాన్ని నియంత్రిస్తాను నా రుచులను కోరికలను కంట్రోల్ చేస్తాను ప్రతిరోజు నన్ను నేను మెరుగుపరుచుకుంటాను ఇలా చేయడం ప్రారంభించిన తర్వాత సమస్యలు రావచ్చు కొంతమంది నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు పరిస్థితులు నీకు వ్యతిరేకంగా మారినట్టు అనిపించవచ్చు కానీ అప్పుడు భయపడకు కేవలం
(08:50) నిశశబ్దంగా ఉండు ఎందుకంటే అవి నీ జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చిన సమస్యలు కావు దేవుడు నీకు పెట్టే పరీక్షలు నువ్వు ఎంత బలంగా ఉన్నావో ఎంత స్థిరంగా ఉన్నావో చూడటానికి వచ్చిన పరీక్షలు గుర్తుపెట్టుకో ప్రతి పరీక్ష వెనుక ఒక ప్రమోషన్ ఉంటుంది. ప్రతి కష్టం వెనుక ఒక ఆశీర్వాదం దాగి ఉంటుంది. నువ్వు ఓపికగా నిలబడగలిగితే ఒకరోజు నువ్వు కోరుకున్న ఆ పెద్ద స్థానం నీదే అవుతుంది.
(09:18) ఈ వీడియో నీ దగ్గరకు రావడం ఆదృశ్చికం కాదు. బహుశా నీ జీవితంలో మార్పు మొదలైన సంకేతం కావచ్చు. కాబట్టి ఇకపై సమస్యలు వచ్చినప్పుడు ఎందుకు నాకే అని అడగకు ఈ పరీక్ష నాకు ఏమి నేర్పించబోతోంది అని అడుగు. నమ్మకం ఉంచు దేవుడు ఆలస్యం చేయవచ్చు. కానీ అన్యాయం మాత్రం ఎప్పుడూ చేయడు. నీ సమయం వస్తుంది. ఆ రోజు నువ్వు వెనక్కి తిరిగి చూసి ఈ కష్టాలన్నింటికీ కృతజ్ఞతలు చెబుతావు.

No comments:

Post a Comment