ఒడలంతయు దుమ్ము గొట్టుకొని కుక్కల గుంపు మధ్యలో గల దత్తుడు లీలావినోదియైన ఆత్మస్వరూపి, సర్వోత్తమమైన ఆత్మానందము ననుభవించువాడు.
కుక్కల నుండి చచ్చిన గాడిద ఎముకను
లాగికొనుచున్న వాడు శ్రీదత్త ప్రభువు. ఎముకలు ధరించి ఎర్రని కన్నులు గల శ్రీదత్తుని సుముఖమునకు వెళ్ళిన వారు ఎముకతో కొట్టబడి ప్రాణభయముతో పరుగెత్తెవారు.
రక్షస్సులు దేవయోనులు ఐనను వారు సైతము శ్రీదత్తుని గుర్తింపలేరు. స్వామిభక్తులు స్వామిని గుర్తింపగలరు. శ్మశానమునకు బదులు యోగభూమిని, కుక్కకు బదులు వేదమును, కాకులకు బదులు శాస్త్రములను, అవధూత స్థానమున సాక్షాత్ త్రిమూర్తిస్వరూపుడైన శ్రీదత్తుని దర్శించవచ్చును.
విశ్వవ్యాపి, ఆత్మరూపి, దేవతలకైనను చేరరానివాడు, భక్తిచేత మాత్రమే తెలియదగినవాడు, అట్టివానిని ఆత్మజ్ఞానము చేత మాత్రమే దర్శింపగలవు. *ఆధ్యాత్మిక కుటుంబం*
No comments:
Post a Comment