మీ ఆధ్యాత్మిక సాధన కి గురువు కావాలా? తెలుసుకోండి ఇలా!
Author Name:Vastavam Channel
Youtube Channel Url:https://www.youtube.com/@vastavam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=znufFxuzzYQ
Transcript:
(00:01) నమస్తే ప్రసాద్ గారు శ్రీమాత్రే నమః అండి. శ్రీమాత్రే నమః శాంతిని మిమ్మల్ని ఫాలో అయ్యే చాలామంది ఈ మధ్య మీ వీడియోస్ కింద ఒక కామెంట్ ని తరచుగా పెడుతున్నారు ప్రసాద్ గారు అదేంటి అంటే మీరు మంత్రోపదేశం చేస్తారా మీరు మాకు గురువుగా ఉంటారా మీరు మాకు మంత్రాలు ఇస్తారా అని అడుగుతున్నారు. ఈ విషయం గురించి నాకు గాని మిమ్మల్ని ఫాలో అయ్యే కొంతమందికి గాని ఆల్రెడీ కొంత అవగాహన ఉంది.
(00:28) కానీ ఇంకా చాలా మంది ఫాలోవర్స్ కి ఈ విషయం మీద ఒక స్పష్టత కావాల్సి ఉందని నాకు అనిపించింది. అందుకే ఈరోజు ఈ ప్రశ్న మీ ముందుకు తీసుకొచ్చానండి. ఈ మంత్రోపదేశాలు గురుశిష్య పరంపర వీటి మీద మీ ఉద్దేశం ఏంటి అలాగే మీరేం చేస్తారు అనే ఒక విషయం మీద ఒక క్లారిటీ ఇవ్వండి ప్రసాద్ గారు. ఈ ప్రశ్న మనకు కొన్ని సంవత్సరాలుగా అంటే రెండు మూడు సంవత్సరాలుగా మనకు వస్తున్న ప్రశ్న ఇది.
(00:54) దీనికి సమాధానం చెప్పి తీరాలి ఇదివరకు చాలా మందికి నేను కామెంట్స్ లోనే ఆన్సర్ కూడా చేశాను. అట్లా ఈమెయిల్స్ లో కూడా ఆన్సర్ చేశాను కానీ ఒకసారి దీనికి ఈ సందర్భంగా మనము అసలు గురువు గురువు యొక్క లక్షణాలు ఏమిటి శిష్యుడు శిష్యుడి యొక్క లక్షణాలు ఏమిటి ఏ లక్షణాలు ఉంటే సద్గురువు అనిపించుకోబడతాడు. ఏ లక్షణాలు ఉంటే ఒక వ్యక్తిని ఆ సద్గురువు శిష్యుడిగా స్వీకరించగలుగుతాడు.
(01:23) వీటిని గురించి క్లుప్తంగా చెప్పిన తర్వాత ఆ ప్రశ్నకు సమాధానం చెప్దాం. గురువు నుండి దీక్ష దీక్ష నుండి మంత్రం మంత్రం నుంచి దేవతానుగ్రహం దేవతా అనుగ్రహం నుంచి సిద్ధి లభిస్తుంది అనేది తంత్ర గ్రంథాల్లో ఒక ప్రసిద్ధమైన భావన ఒక గురువు ఒక శిష్యునికి దీక్ష ఇచ్చిన క్షణం నుంచి కూడా అతని ఆధ్యాత్మిక అభివృద్దికి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
(01:55) అతను ఎదుర్కొనే అడ్డంకులను తొలగించాలి. అతని పురోగతిని గమనిస్తూ ఉండాలి. అవసరమైన మార్గదర్శకత్వాన్ని ఇస్తూ ఉండాలి. అతనికి ఏమైనా అడ్డంకులు వస్తే వాటిని ఎలా తొలగించుకోవాలి పొరపాట్లు చేస్తే వాటిని ఎలా సరిదిద్దుకోవాలి ఇవన్నీ చెప్పాలి అంటే ఆ గురువుకి మొట్టమొదట ఉండవలసిన అర్హత ఏమిటంటే ఏ మంత్రాన్ని అయితే ఉపదేశించి ఆ దీక్ష కి మార్గదర్శకత్వం వహిస్తున్నారో ఆ మంత్రాన్ని సాధన చేసి సిద్ధి పొంది ఉండాలి.
(02:32) ఇది మొట్టమొదటి అర్హత గురువు శిష్యున్ని పరీక్షించాలి. ఒక వ్యక్తి వచ్చి నాకు మంత్రోపదేశం చేయండి దీక్షణ ఇవ్వండి మీరు నా గురువుగా ఉండండి అని అడిగినప్పుడు ముందు గురువు ఆ శిష్యుని యొక్క అర్హతల్ని పరీక్షించాలి. ఆ వ్యక్తిని శిష్యునిగా అంగీకరించే ముందు గురువు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఈ వ్యక్తి నిజంగా సాధన చేయాలనుకుంటున్నాడా లేదా తాత్కాలికమైన ప్రయోజనాల కోసం ఓ చిన్న ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాడా క్రమశిక్షణ ఉందా ఆధ్యాత్మికత భక్తి భావం ఇవి ఉన్న వ్యక్తి కాదా చివరివరకు కూడా ఎన్ని అడ్డంకులు ఎదురైనా పట్టుదలగా తన సాధనను కొనసాగించగలడా లేదా ఆధ్యాత్మిక ఆసక్తి మానసిక స్థిరత్వం
(03:20) ఉన్నాయా లేదా ఈ లక్షణాలు లేకుండా ఒక వ్యక్తిని శిష్యుడిగా తీసుకొని మనం ఎంత ఎంత ప్రయత్నించినా అతనికి ఎంత సహాయం చేసినా కానీ అతని దీక్ష ఫలించదు. ఫలితం లేకుండా అతని సమయం వృధ గురువు యొక్క సమయం కూడా వృధా అవుతుంది. కాబట్టి శిష్యునిగా ఒక వ్యక్తిని స్వీకరించే ముందు సద్గురువు అనేటువంటి వాడు ఈ శిష్యున్ని అన్ని విధాలా పరీక్ష చేసి అతను అర్హత ఉంటేనే శిష్యుడిగా స్వీకరిస్తాడు.
(03:51) ఇది తంత్ర శాస్త్రం చెప్తున్న విషయం. అయితే ఈ విషయాన్ని చెప్పిన తంత్ర శాస్త్రం మరొక ముఖ్యమైన విషయాన్ని కూడా చెప్పింది అదేంటంటే శిష్యుడు కూడా గురువుని ఎన్నుకునే ముందు గురువుని పరిశీలించాలి పరీక్షించడం కాదండి పరిశీలించాలి ఆ గురువుకి ఆ మంత్ర సాధనలో అనుభవం ఉందా ఆయన నిజంగానే ఆ మంత్రం ఆ ఏ మంత్రం కోసం అయితే శిష్యుడు ఆ గురువు దగ్గరికి వెళ్తున్నాడో ఆ మంత్రాన్ని సాధన చేసి సిద్ధి పొంది ఉన్నారా లేదా ఆ గురువు సన్నిధిలో ఉంటే ఆధ్యాత్మిక ప్రేరణ లభిస్తుందా లేదా ఒక పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొంది ఉన్న వ్యక్తా కాదా
(04:38) వాటితో పాటుగా ఆయన వ్యక్తిగత లక్షణాలు కేవలం ధనాపేక్షతోటే దీన్ని ఒక వ్యాపారంగా చేస్తున్న వ్యక్తా ఇలా ఎన్నో విషయాలను పరిశీలించి భావోద్వేగంతో కాక వివేక కంతో గురువుని ఎన్నుకోవాలి. లేకపోతే ఇక్కడ శిష్యు శిష్యుడు ఎంతో పట్టుదలగా ఒక దీక్ష తీసుకొని సాధన చేద్దామని ఒక గొప్ప ప్రయత్నంలో ఉన్నప్పుడు ఒక అర్హత లేని గురువుని గనుక ఎంచుకుంటే అతని సమయం వృధ డబ్బు వృధ వీటికన్నా ముఖ్యమైన నష్టం ఏంటంటే అతనికి ఉన్న ఆ ఉత్సాహం తగ్గిపోతుంది.
(05:16) మంత్రసాధనలో ఆధ్యాత్మిక ప్రయాణం చేద్దాం అనుకుంటున్న అతని పట్టుదల సడలిపోతుంది. కాబట్టి మంత్ర శాస్త్రం ప్రకారం గురువుని పరిశీలించాలి అలాగే శిష్యుడిని పరీక్షించాలి ఈ రెండు జరిగి ఈ రెండు సజావుగా జరిగినప్పుడే గురు శిష్యుల బంధం అనేది ఏర్పడుతుంది ఏర్పడాలి కూడా తంత్ర శాస్త్రం ప్రకారం ఒక శిష్యునిలో ఉండవలసిన ముఖ్యమైన గుణాలు ఏమిటంటే భక్తి శ్రద్ధ క్రమశిక్షణ గురువు పట్ల గౌరవం గురువు పట్ల విశ్వాసం ఇంద్రియ నిగ్రహం క్రమశిక్షణ వినయం ఇవన్నీ శిష్యునికి ఉండవలసిన ప్రాథమిక
(06:01) లక్షణాలు తంత్ర సాంప్రదాయ ప్రకారం గురుత్వం అనేది ఎవరికి వారు ప్రకటించుకునేది కాదు ఇది వాళ్ళ అర్హతలను బట్టి అలాగే వారు సాధించిన సిద్ధిని బట్టి కూడా పొందగలిగేది మాత్రమే ఇక పోతే చాందిని మీరు అడిగిన ప్రశ్నకి నా వరకు వస్తే నాకు నాకున్న సమయంలో లో ఎక్కువ భాగం నా సాధనకి అట్లాగే అమ్మవారి ఉపాసనలో భాగంగా నేను చేసే ఈ ప్రకృతి సేవ ఈ వ్యవసాయం కొద్దిపాటి వ్యవసాయం ఈ అగ్రికల్చరల్ ప్రాజెక్టు అలాగే శక్తి క్షేత్రాలు శక్తి పీఠాలు ఆధ్యాత్మిక శక్తిని కలిగి కలిగి ఉండేటువంటి కొన్ని ప్రదేశాలు తిరగడం అక్కడ నేను కొంచెం ఆ సత్యాన్వేషణ రీసెర్చ్ అనండి
(06:48) లేకపోతే స్టడీ అనండి చేయడం ఇలాంటి వాటి మీద నాకు కు ఎక్కువ సమయం గడిచిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితిలో ఇన్ని కమిట్మెంట్స్ ఇన్ని యాక్టివిటీస్ ఉన్న నేను ఒక గురు బాధ్యతను స్వీకరించి ఆ మంత్రోపదేశం చేయడం ఆ దీక్షణ ఇవ్వడం ఇలాంటి పనులు మాత్రం చేయడం అనేది సాధ్యపడదు. కానీ ఎవరైనా సరే సిన్సియర్ గా సాధన చేసేవాళ్ళు వాళ్ళకి ఏదైనా సందేహాలు ఉన్నా వాళ్ళకి ఏమన్నా సహాయం కావాలన్నా తప్పకుండా నేను మీకు హెల్ప్ చేస్తాను.
(07:21) అది ఎలా అంటే ఫోన్ నెంబర్ అడుగుతూ ఉంటారు చాలా మంది కామెంట్స్ లో ఫోన్ నెంబర్ పబ్లిక్ గా నేను ఎవరికీ ఇవ్వలేను ఎందుకంటే దాని వల్ల నాకు చాలా డిస్టర్బెన్స్ అనవసరమైన కాల్స్ చాలా రావడం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి నాకు అంత సమయం ఉండదు కాబట్టి నేను దయచేసి మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఈమెయిల్ చేయండి మీకు సమస్య ఏదైనా ఉంటే ఈమెయిల్ చేయండి నేను తప్పకుండా అది సమంజసమైన సమస్య అయితే ఆ సాధనలో మీకు ఎదురయ్యే అడ్డంకలు ఆటంకాలు అయితే వెంటనే నేను మీకు సమాధానం చెప్తాను.
(07:48) అలాగే ఈ సమస్యల విషయానికి వస్తే మాత్రం అంటే వ్యాపారంలో సమస్యలు సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలాంటివన్నీ కూడా నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పినట్టు అవి మన యొక్క కర్మ ఫలితాలే కర్మ ఫలితంగా సంభవించిన ఒక సమస్యని మళ్ళీ కర్మతోనే మనం సాధన సాధించుకోవాలి పరిష్కరించుకోవాలి. సో నేను నా సాధన నాకు కలిగిన అనుభవాల్ని మీతో పంచుకోవడం దాని ద్వారా ఏంటంటే మరో 10 మందిని ఉత్సాహ పరచడం ఎంకరేజ్ చేయడం ఒక ధర్మ ప్రచారంగా దీన్ని భావించి నేను ఈ విధంగా వీడియోలు చేయడం అనేది జరుగుతా ఉంది. నా అనుభవాల నుంచి నేను మీకు పంచే
(08:28) విషయాల్లోనే మీకు మీ ప్రశ్నలకు ఎన్నో ప్రశ్నలకి సమస్యలకి సమాధానం దొరుకుతుంది. చూడండి నేను మళ్ళీ నన్ను మీరు అడగక్కర్లేదు. నా అనుభవాల్లో నుంచి మీరు చాలా నేర్చుకోవచ్చు చాలా తెలుసుకోవచ్చు ఇవేవి జస్ట్ శాస్త్రంలో చదివి చెప్పేటివి కాదు కాబట్టి నిజమైన అనుభవాల మీద ఆధారపడి తెలుసుకున్న విషయాలు లేదంటే శాస్త్రీయంగా పరిశోధించి ఎక్కువ స్టడీ చేసి తెలుసుకున్న విషయాలు మాత్రమే మీకు చెప్తాను.
(08:58) అందులోనే మీకు చాలా సమాధానాలు దొరుకుతాయి. ఈ ప్రశ్నకి ఇంత స్పష్టమైన సమాధానం చెప్పినందుకు ధన్యవాదాలు ప్రసాద్ గారు. ఈ వీడియో ద్వారా మిమ్మల్ని ఫాలో అయ్యే చాలామందికి ఉండే ఒక సందేహానికి ఒక మంచి క్లారిటీ వస్తుందని నేను భావిస్తున్నాను. ఇలాంటి చాలా రకాల ప్రశ్నలు, సందేహాలకి మనం మళ్లీ సమాధానం చెబుతూ మంచి వీడియో చేద్దాం త్వరలో.
(09:25) శ్రీ మాత్రే నమః ప్రసాద్ గారు ఓం శ్రీ మాతంే నమః ఓం శ్రీ మాత్రే నమః
No comments:
Post a Comment