నువ్వే వచ్చి నిన్ను కొడితే? || SEETAKANTH TALKIE #motivation #health #selfimprovement #lifestyle
Author Name:SEETAKANTH TALKIE
Youtube Channel Url:https://www.youtube.com/@SEETAKANTHTALKIE
Youtube Video URL:https://www.youtube.com/watch?v=1uBPGvbwt2I
Transcript:
(00:00) ఒక ప్రశ్న అడగనా ఈ ప్రశ్నకు జవాబు చెప్పడానికి తొందర పడకండి ఎందుకంటే ఈ ప్రశ్నకి మీరు చెప్పబోయే జవాబుకి మీ భవిష్యత్తును మార్చగలిగే శక్తి ఉంది. 10 సంవత్సరాల తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావ్ ఒకసారి కళ్ళు మూసుకొని ఊహించు నీ శరీరం ఎలా ఉంటుంది నీ కుటుంబం ఎలా ఉంటుంది నీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది నీ కలలు నిజమై ఉంటాయా లేక ఇంకా ఈరోజు మొదలు పెడతాను రేపు చేస్తాను అనే మాటలోనే మిగిలిపోతాయా జీవితాన్ని మార్చేది ఒక్కరోజు చేసే గొప్ప పని కాదు ప్రతిరోజు చేసే చిన్న పని అదే 10 సంవత్సరాల తర్వాత నీ జీవితాన్ని మార్చేస్తుంది.
(00:36) ఈ సత్యాన్ని ఒక రాత్రి సముద్రం వడ్డున భయంతో బిక్కు బిక్కుమంటూ కూర్చున్న ముగ్గురు అపరిచిత వ్యక్తులు తెలుసుకున్నారు. వీళ్ళఎవరు అక్కడికి ఎందుకు వచ్చారు చూద్దాం విశాఖపట్నం అర్ధరాత్రి రెండు గంటలు రాహుల్ గాఢ నిద్రలో ఉన్నాడు వయసు 40 ఇంతలో గది తలుపు తెరుచుకుంది ఎవరో లోపలికి వచ్చారు ఆ చప్పుడుకి రాహుల్ కి మెలుకు వచ్చింది. ఎవరది అని అరుస్తూ లైట్ వేశడు.
(01:02) ఎదురుగా ఉన్న మనిషిని చూసి రాహుల్ గుండె ఆగిపోయినంత పని అయింది. ఎందుకంటే ఆ మనిషి అచ్చం అతనిలాగే ఉన్నాడు అదే మొహం అవే కళ్ళు కాకపోతే ఆ మనిషి రాహుల్ కంటే డబుల్ సైజులో ఉన్నాడు. పొట్ట విపరీతంగా పెరిగిపోయింది రెండు అడుగులు వేస్తేనే ఆయాసం మొహం ఉబ్బిపోయింది కళ్ళు లోపలికి పోయిఉన్నాయి రాహుల్ కంటే కనీసం 10 ఏళ్ళు పెద్దవాడిలా ఉన్నాడు.
(01:24) రాహుల్ వణకుతూ అడిగాడు ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావ్ ఎలా వచ్చావ్ ఆ మనిషి ఏమీ మాట్లాడకుండా నేరుగా రాహుల్ దగ్గరికి వచ్చి లాగి పెట్టి చంప మీద ఒక దెబ్బ కొట్టాడు. ఆ ఫోర్స్ కి రాహుల్ పక్కన ఉన్న టేబుల్ మీద పడిపోయాడు టేబుల్ మీద ఉన్న గాజు బాటిల్ కింద పడి పగిలిపోయింది అప్పుడు ఆ మనిషి అన్నాడు కళ్ళఎదురుగా నిన్నే పెట్టుకొని ఎవరు నువ్వు అడుగుతావ ఏంటిరా నిన్నే నువ్వు గుర్తుపట్టలేని స్థితికి వచ్చావా రాహుల్ కి ఒక్కసారిగా నిద్ర మొత్తు దిగిపోయింది అవును నువ్వు నాలానే ఉన్నావు నిజమే కానీ నువ్వు నేనేంటి అది ఎలా సాధ్యం అప్పుడు ఆ మనిషి విరక్తిగా
(01:58) ఒక నవ్వు నవ్వి కష్టపడి ఊపిరి తీసుకుంటూ అన్నాడు సాధ్యమేరా నువ్వు ఇలాగే బతికితే 10 ఏళ్ల తర్వాత సరిగ్గా ఇలాగే తయారవుతావ్ ఎందుకంటే ఆ 10ఏళ్ల తర్వాత నువ్వే ఈ నేను ఒక్కసారి ఆలోచించు నువ్వు చివరిసారి ఎప్పుడునాలుగు కిలోమీటర్లు వాకింగ్ చేశవు ఎప్పుడు ఒక పూట సరైన తిండి తిన్నావ్ రాత్రిరెండు గంటల వరకు ఫోను ఆ పై పొద్దున్నే 11 వరకు నిద్ర ఇంట్లో ఉండింది తినవు ఎప్పుడు బయట ఫుడ్ే ఇదే నా జీవితం నీకు ఇప్పుడు హాయిగా ఉంటుంది సుఖంగా ఉంటుంది కానీ 10 ఏళ్ల తర్వాత నీకు అంటే నాకు ఏమైందో చెప్పనా ఆరు నెలల క్రితం హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఐసలో ఐదు రోజులు
(02:32) డాక్టర్ మొహం మీదే చెప్పాడు ఇంకో ఇంకోసారి వస్తే మిమ్మల్ని కాపాడలేమని ఇప్పుడు మెట్లెక్కలేను నా కొడుకుతో పరిగెత్తలేను రాత్రి పడుకుంటే పొద్దున్న లేస్తానో లేదో అన్న భయంతో పడుకుంటాను నా కర్మ నా జబ్బు అనుకుంటూ నిన్ను తిట్టుకుంటూ బతుకుతున్నానురా ఇదంతా కేవలం నువ్వు డిసిప్లిన్ గా లేకపోవడం వల్లే వచ్చింది అని మళ్ళీ మీదకు రాబోయాడు రాహుల్కి చెమటలు పట్టి మంచం మీద కూలబడ్డాడు గుండె వేగంగా కొట్టుకుంటుంది ఆ మనిషి తలుపుకు నడుస్తూ వెనక్కి తిరిగి చూశడుపఏళ్ల తర్వాత నువ్వు ఇలా అవ్వకూడదు అంటే ఏం చేయాలో నీకు చెప్తాను రేపు సాయంత్రం బీచ్లో లైట్ హౌస్
(03:05) దగ్గరికి రా తలుపు మూసుకొని వెళ్ళిపోయాడు. రాహుల్ ఉలికిపడి బెడ్ మీద నుంచి లేచాడు ఒళ్ళంతా చెమటలు గదిలో చూస్తే ఎవరూ లేరు తలుపు వేసే ఉంది అమ్మయ్యా ఇదంతా కల అని ఊపిరి పీల్చుకున్నాడు కానీ పక్కకు చూశడు కింద పగిలిన గాజు ముక్కలు ఇప్పుడు మీరే చెప్పండి ఇది కల అనుకోవాలా అలా అయితే ఆ గాజు ముక్కలు ఎక్కడి నుంచి వచ్చాయి ఆ రాత్రంతా రాహుల్ కి నిద్రపట్టలేదు కళ్ళు మూసుకుంటే ఆ ఉబ్బిన మొహం ఆ ఆయాసం ఇంకోసారి వస్తే కాపాడలేం అని డాక్టర్ చెప్పాడు అని చెప్పిన ఆ మాట అది కల అయితే పర్వాలేదు కానీ నిజమైతే 10 సంవత్సరాల తర్వాత నేను అలా అయిపోతానా అన్న భయం పట్టుకుంది. ఇక్కడ
(03:41) ఒక ఇంగ్లీష్ లైన్ ఉంది యువర్ ఫ్యూచర్ ఇస్ క్రియేటెడ్ వాట్ యు డ టుడే నాట్ టుమారో అంటే మీ భవిష్యత్తు తయారయ్యేది రేపు కాదు ఈరోజు మీరు చేసే దానితో మరసటి రోజు సాయంత్రం రాహుల్ లైట్ హౌస్ దగ్గర నిలబడ్డాడు ఒక గంట రెండు గంటలు మూడు గంటలు ఎవ్వరూ రాలేదు ఛ నేను ఒక పిచ్చోడిని అదంతా ఒక కల అని విసుక్కుంటూ వెళ్ళబోతూ ఉండగా సరిగ్గా అప్పుడు ఒక 30 ఏళ్ల కుర్రాడు కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు.
(04:06) చుట్టూ చూస్తూ ఆత్రంగా అడిగాడు ఏవండీ నా కోసం ఎవరైనా వచ్చారా ఇక్కడికి రాహుల్ అయోమయంగా చూశడు మీ కోసం ఎవరు వస్తారో నాకు ఎలా తెలుస్తుందండి అది కాదండి వచ్చే వ్యక్తి అచ్చం నాలాగే ఉంటాడండి కాకపోతే నాకంటే 10 ఏళ్ళు పెద్దగా ఉంటాడు. రాహుల్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అంటే 10 ఏళ్ల తర్వాతి నువ్వు నీ దగ్గరికి కూడా వచ్చాడా ఆ కుర్రాడి మొహం తెల్లబోయింది అంటే మీకు కూడా ఇలాగే జరిగిందా ఇద్దరు అక్కడే స్కూల్లో కూర్చున్నారు ఆ కుర్రాడి పేరు బాబి 30 ఏళ్ళు ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం కాలేజీలో బాగా చదివేవాడు అందరూ వీడు లైఫ్ లో గొప్పవాడు అవుతాడు
(04:38) అనుకున్నారు కానీ ఉద్యోగంలో చేరాక అతను అక్కడే ఆగిపోయాడు. అతని క్లాస్మేట్స్ ప్రతి ఏడాది ఒక కొత్త స్కిల్ నేర్చుకుంటున్నారు కొత్త టెక్నాలజీ వస్తే వెంటనే దాన్ని పట్టుకుంటున్నారు కోర్సులు చేస్తున్నారు సర్టిఫికెట్లు తెచ్చుకుంటున్నారు బాబీ మాత్రం ఏడేళ్లగా అదే పని అదే పాత పద్ధతిలో ఇప్పుడు ఏమైంది నా పని నాకు వచ్చు కదా కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది అనుకునేవాడు అందరూ కొత్త స్కిల్స్ నేర్చుకుంటుంటే బాబీ మాత్రం పనికి మాలిన సొల్లు కంటెంట్ అంతా చూస్తూ టైం స్పెండ్ చేసేవాడు సో ప్రమోషన్స్ లేవు జీతం పెరగలేదు అతని జూనియర్లు ప్రమోషన్స్ తో అతని పైన
(05:07) కూర్చున్నారు ఈ ఏడేళ్లల్లో బాబీకి పెళ్లిఅయింది ఇద్దరు పిల్లలు అలాంటి ఒక రాత్రి బాబీ గదిలో కూడా ఒక మనిషి వచ్చాడు అచ్చం బాబీ లాగే కానీ 10 ఏళ్ళు పెద్దవాడు నలిగిన బట్టలు పెరిగిన గడ్డం కళ్ళల్లో ఒక భయంకరమైన శూన్యం వాడు కూడా బాబీ చెంప మీద లాగి పెట్టి కొట్టాడు ఆ తర్వాత చెప్పిన మాటలకి బాబీ ఒళ్ళు గగురు బొడిచింది రేయ్ నువ్వు ఇలా ఏమి నేర్చుకోకుండా టైం పాస్ చేస్తూ వచ్చావు ఇప్పుడు చూడు 10 ఏళ్ల తర్వాత నా పరిస్థితి ప్రమోషన్స్ లేవు సరి కదా ఉన్న ఉద్యోగం కూడా పోయింది కంపెనీ కొత్త టెక్నాలజీకి మారింది నీకు ఆ టెక్నాలజీ తెలియదు సారీ అని ఒక మాట మాట
(05:41) చెప్పి బయటికి పంపేశారు వన్ ఇయర్ నుంచి కొత్త జాబ్ రాలేదు పిల్లలకి స్కూల్లో టర్మ్ ఫీస్ కట్టలేదని స్కూల్ కి రావద్దు అన్నారు. ఎవరిని అప్పు అడగాలన్నా తల తీసేసినట్టు అనిపిస్తుంది. వేరే పని ఏమీ రాదు నెక్స్ట్ మంత్ రెంట్ కట్టలేనని పెళ్ళం పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయింది. నాకు నిన్ను చంపేయాలన్నంత కోపంగా ఉంది అని అరుస్తూ రేపు సాయంత్రం బీచ్లో లైట్ హౌస్ దగ్గరికి రా లేదంటే 10 ఏళ్ళ తర్వాత అదే బీచ్ దగ్గర చావడానికి వెళ్తావ్ డిసైడ్ చేసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు.
(06:10) బాబీ చెప్పడం ఆపాడు అతని చేతులు వణకుతున్నాయి సార్ రాత్రి నుంచి నాకు నిద్ర లేదు కళ్ళు మూసుకుంటే ఆ మొహమే కనిపిస్తుంది 10 సంవత్సరాల తర్వాత నిజంగా ఆత్మహత్య చేసుకునే స్థాయికి నా పరిస్థితి దిగజారిపోతుందా అని భయంవేస్తుంది సార్ అని బాబీ చెప్తే రాహుల్ నాది అదే పరిస్థితి అండి ఇంజెక్షన్ చేసుకోవాలంటేనే భయం అలాంటిది హార్ట్ సర్జరీనా ఆలోచిస్తుంటే ఇప్పుడే గుండె పగిలిపోయేలా ఉంది అని చెప్పాడు ఇద్దరు ఒకరి కథ ఒకరు చెప్పుకుంటున్నారు మనఇద్దరికీ ఇలా ఎందుకు జరిగింది అని ఆలోచిస్తున్నారు ఇంతలో ఒక 25 ఏళ్ల అమ్మాయి కంగారుగా గా పరిగెత్తుకుంటూ వచ్చింది ఎక్స్క్యూస్ మీ ఇక్కడికి అచ్చం
(06:40) నాలాగే ఉండి నాకంటే 10 ఏళ్ళు పెద్దగా ఉండి తాగుతూ తూలుతూ ఉండే అమ్మాయి ఎవరైనా వచ్చారా రాహుల్ బాబీ ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు ఆ అమ్మాయి పేరు పింకీ మంచి కుటుంబం బాగానే చదువుకుంది జాబ్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ తో ఫ్లాట్ లో ఉంటుంది జాబ్ చేస్తుంది ఫ్లాట్ మేట్స్ ఇద్దరికీ బీరు తాగే అలవాటు ఉంది. ఒకరోజు బలవంతం చేశారు ఫ్రెండ్స్ తో కలిసి బీరు తాగటం తప్పేముంది అందరూ తాగుతారు ఇందులో పెద్ద విషయం ఏముంది అని కన్విన్స్ చేశారు పింకీ కన్విన్స్ అయింది.
(07:09) మొదట్లో నెలకోసారి ఆ తర్వాత వారానికి ఒకసారి ఇప్పుడు దాదాపు ప్రతిరోజు బీర్కి బీర్కి మధ్య సిగరెట్ కూడా అలవాటయింది. రాత్రి ఆమె మత్తులో నిద్రపోతుంటే గదిలోకి ఒక అమ్మాయి వచ్చింది. అచ్చం పింకీ లాగే కానీ 10ఏళ్ళు పెద్దది. కళ్ళు ఎర్రబడి చేతులు వణకుతూ నిలబడలేని స్థితిలో ఉంది. ఆమె కూడా పింకీ చెంప మీద లాగి పెట్టి కొట్టింది తర్వాత ఏడుస్తూ చెప్పిందిపఏళ్ల తర్వాత నువ్వేనే నేను జీవితం ఇళయరాజా పాటలాగా ఊహించుకున్నాను ఫస్ట్ లో ఒక బీరు తాగటానికి కన్విన్స్ అయ్యావు ఆ బీరు బారు దాకా పబ్బు దాకా తీసుకెళ్ళింది అక్కడ రకరకాల డ్రింక్స్ అవి రొటీన్ అయ్యి అప్పుడప్పుడు ఇంకాస్త ముందుకెళ్లి డ్రగ్స్
(07:42) వాడావ్ నేను ఊహించుకున్న కలల కన్నా జీవితం మత్తులో మర్చిపోయాను ఇప్పుడు చూడు పెళ్లి అయింది మంచి మనిషి దొరికాడు కానీ నా అలవాట్లు వదలలేకపోయాను మూడేళ్ళు ప్రయత్నించాం డాక్టర్లు చెప్పారు మీ శరీరం పాడైపోయింది మీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు అని ఆ రోజు నా భర్త ఒక్క మాట కూడా మాట్లాడలేదు కేవలం ఒక చూపు చూశడు ఆరు నెలల తర్వాత ఒక ఉత్తరం పెట్టి వెళ్ళిపోయాడు.
(08:04) ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను 35 ఏళ్లకి ఈ శరీరం ఈ బతుకు ఇలా అయింది ఇదే నీ భవిష్యత్తు నీ భవిష్యత్తు ఇంత దారుణంగా అవ్వకూడదు అంటే రేపు సాయంత్రం లైట్ హౌస్ దగ్గరికి రా లేదంటే ఇలాగే ఏడుస్తూ వచ్చేస్తావ్ పింకీ చెప్పడం ఆపింది ఆమె కళ్ళల్లో నీళ్ళు రాత్రి నుంచి నాకు భయం పట్టుకుంది సార్ ఇప్పుడు బీర్ బాటిల్ చూస్తేనే గుండె ఆగిపోతుంది ఇక్కడికి వస్తే ఏదో సొల్యూషన్ చెప్తాను అంది వచ్చిందా సార్ అని అడుగుతుంది.
(08:31) ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోండి ఎవరీ ఎడిక్షన్ బిగిన్స్ యస్ ఏ స్మాల్ ప్లెజర్ అండ్ ఎండ్స్ విత్ ఏ బిగ ప్రిజన్ అంటే ప్రతి వ్యసనం ఒక చిన్న సరదాగా మొదలవుతుంది ఒక పెద్ద జైలుగా ముగుస్తుంది. ఇప్పుడు ముగ్గురు అక్కడ కూర్చున్నారు ముగ్గురికి ఒకటే ప్రశ్న మనం ముగ్గురు ఒకరికొకరు తెలియదు వేరు వేరు వయసులు వేరు వేరు సమస్యలు మరి మన ముగ్గురికి ఒకేలా ఎందుకు జరిగింది సరిగ్గా అప్పుడే పక్కన కెరటాల దగ్గర ఒక ముసలాయన తన మనవడితో ఆడుకుంటున్నాడు.
(08:57) ఆయన పేరు రాఘవయ్య ఆ పిల్లాడు నీళ్ళలో నుంచి ఒక రాయి తీసుకొచ్చాడు చాలా నున్నగా గుండ్రంగా ఉంది తాతయ్య ఈ రాయి ఎందుకు ఇంత స్మూత్ గా ఉంది అక్కడ వడ్డున ఉన్న రాయి చూడు ఎంత గరుగుగా ఉందో అని అడిగాడు ముగ్గురు ఆ మాటలు వింటున్నారు రాఘవయ్య నవ్వుతూ చెప్పాడు ఆ నీళ్ళు తాకి తాకి ఆ గరుకు రాయి నున్నగా మారిందిరా అని చెప్పాడు పిల్లాడికి డౌట్ తేరలేదు అయితే ఒడ్డున ఉన్న ఆ రాయి మీద కూడా నీళ్లు పోస్తే అది కూడా ఇలాగే మారిపోతుందా అని అడిగాడు రాఘవయ్య పెద్దగా నవ్వాడు అలా ఒక్కసారి పోస్తే మారదురా ఆ రాయిని ఆ కెరటాలు ప్రతిరోజు కొన్ని లక్షల సార్లు ఆగకుండా తాకుతూనే ఉన్నాయి అలా
(09:30) తాకగా తాకగా ఆ రాపిడికి గరుకురాయి నున్నగా మారిపోయింది. పిల్లాడికి అర్థం కాలేదు అయోమయంగా చూశడు నీకు అర్థమయ్యేలా ఒక కత్తి చెప్తాను విను అన్నాడు రాఘవయ్య పక్కన చీకట్లో కూర్చున్న ఆ ముగ్గురు చెవులు రిక్కించి వింటున్నారు. రాఘవయ్య చెప్పడం ప్రారంభించాడు. చాలా వేల ఏళ్ల క్రితం ఒక అడవిలో రత్నాకరుడు అనే ఒక భయంకరమైన దోపిడి దొంగ ఉండేవాడు దారి కాచి వచ్చిపోయే వాళ్ళని దోచుకునేవాడు హింసకి అలవాటు పడిపోయాడు ఒకరోజు ఆ దారిలో ఒక మహర్షి వెళ్తున్నాడు రత్నాకరుడు అతన్ని కూడా దోచుకోబోయాడు అప్పుడు ఆ మహర్షి ఒక ప్రశ్న వేశడు సరే దోచుకో కానీ ఒకడు చెప్పు ఈ
(10:05) దోపిడీలు ఎవరి కోసం చేస్తున్నావ్ అని అడిగాడు నా భార్యా పిల్లల కోసం అన్నాడు మంచిది ఇప్పుడు చెప్పు నువ్వు చేస్తున్న ఈ పాపంలో వాళ్ళకి కూడా భాగం ఉంటుందా రత్నాకరుడు గర్వంగా అన్నాడు ఎందుకు ఉండదు వాళ్ళ కోసమే కథ చేస్తున్నాను అయితే ఒకసారి వాళ్ళనే అడిగిరా నేను పారిపోతానని భయం ఉంటే నన్ను ఈ చెట్టుకి కట్టేసి వెళ్ళు అని చెప్పాడు.
(10:24) రత్నాకరుడు మహర్షిని చెట్టు కట్టేసాడు ఈ రత్నాకరుడు చెట్టు కట్టేసిన ఆ మహర్షి పేరఏంటో తెలిసిన వాళ్ళు కామెంట్స్ లో కింద రాయండి తెలియని వాళ్ళు మీ కామెంట్స్ చూస్తారు ఇప్పుడు రత్నాకరుడు ఇంటికి వెళ్లి భార్యని అడిగాడు ఆమె అంది కుటుంబాన్ని పోషించడం నీ బాధ్యత పాపం చేయడం నీ నిర్ణయం తల్లిని అడిగాడు ఆమె కూడా అదే జవాబు పిల్లల్ని అడిగాడు ఎవ్వరు అతని పాపానికి బాగా స్వామ్యులం కాలేము అని చెప్పారు రత్నాకరుడు నిలువునా కూలిపోయాడు తిరిగివచ్చి మహర్షి కాళ్ళ మీద పడ్డాడు స్వామి ఇన్నాళ్ళు ఎవరి కోసం పాపం చేశనో వాళ్ళే నీ పాపంతో మాకు సంబంధం లేదు అంటున్నా న్నారు ఇన్నాళ్ళ నుంచి నేను
(10:53) చేసిన పాపానికి కొన్ని లక్షల జన్మలు మళ్ళీ మళ్ళీ పుట్టి శిక్షలు అనుభవించవలసి వస్తుంది నా పాపానికి విముక్తి కావాలి నాకు దారి చెప్పండి అని ఏడుస్తూ అడిగాడు అప్పుడు మహర్షి రామ రామ అని జపం చేయి అని చెప్పాడు. రత్నాకరుడు నోరు తెరిచాడు రా పలుకుతుంది మా రావట్లేదు ఎన్నిసార్లు ప్రయత్నించినా రామ అనలేకపోయాడు అప్పుడు నారదుడు ఒక ఉపాయం చెప్పాడు ముందు మ తర్వాత రా మర మర అను అని చెప్పి వెళ్ళిపోయాడు.
(11:19) రత్నాకరుడు కళ్ళు మూసుకొని మొదలు పెట్టాడు మర మర మర మొదటి రోజు రెండో రోజు వారాలు నెలలు సంవత్సరాలు అతను ఆపలేదు వర్షాలు వచ్చాయి ఎండలు కాసాయి చీమలు అతని చుట్టూ పుట్ట కట్టాయి కానీ అతని జపం మాత్రం ఆగలేదు మరా మరా మరామ రామ రామ రామ ఆ మరా మరా కాస్త ఎప్పుడో రామ రామగా మారిపోయింది మహర్షి తిరిగి వచ్చారు పుట్ట ముందు నిలబడి పిలిచారు నాయనా బయటికి రా పుట్ట పగిలింది బయటికి వచ్చాడు పాత రత్నాకరుడు కాదు మొహంలో ఆ హింస లేదు కళ్ళల్లో ద్వేషం లేదు మహర్షి ప్రేమగా అన్నాడు వాల్మీకం నుంచి పుట్టిన వాడివి ఇక నుంచి నీవు వాల్మీకి అన్నాడు. ఒకప్పుడు దారిదోపిడి చేసిన ఒక
(12:00) బందిపోటు ప్రపంచంలోని మొట్టమొదటి మహాకావ్యమైన వేల శ్లోకాల రామాయణాన్ని రాశడు. కథ ముగించి రాఘవయ్య మనవడిని అడిగాడు ఇప్పుడు చెప్పు ఈ కథలో నీకు ఏం అర్థమయింది చీకట్లో కూర్చున్న ముగ్గురు కూడా ఊపిరిని బిగబట్టి వింటున్నారు రాఘవయ్య చెప్పాడు ఏ పనైనా సరే ఆగకుండా అదే పనిగా చేస్తే అది అలవాటు అవుతుంది ఆ అలవాటు మనలో మార్పు తీసుకొస్తుంది మరా మరా అన్న ఒక మాట అదే పనిగా అనటం వల్ల రామా రామ అయింది ఒక దోపిడి దొంగని మహాకవిగా మహాత్ముడిగా మార్చింది ఈ కెరటాలు వేల ఏళ్లుగా తాకుతూ ఉండటం వల్ల గరుకురాయి నున్నగా మారింది. మనుషులు కూడా అంతేరా మనం
(12:37) ఈరోజు క్రమం తప్పకుండా చేసే చిన్న చిన్న పనులే అలవాట్లుగా మారి కొన్నేళ్లకి మనల్ని పూర్తిగా మార్చేస్తాయి. మంచి పనులు చేస్తే మంచి అలవాట్లుగా మారి మనల్ని గొప్పవాళ్ళం చేస్తాయి చెడ్డ పనులు చేస్తే చెడు అలవాట్లుగా మారి జీవితాన్ని నాశనం చేస్తాయి అంటే రేపు 10ఏళ్ల తర్వాత మనం ఎలా ఉంటాం అన్నది ఈరోజు మనం క్రమం తప్పకుండా ఏం చేస్తున్నామ అన్న దాని మీదే ఆధారపడి ఉంటుంది.
(13:02) ఇక్కడ ఒక అద్భుతమైన లైన్ ఉంది ఏ రివర్ కట్స్ త్రూ రాక్ నాట్ బికాuse ఆఫ్ ఇట్స్ పవర్ బట్ బికాuse ఆఫ్ ఇట్స్ పర్సిస్టెన్స్ అంటే నది రాయిని చీల్చేది తన బలంతో కాదు ఆగకుండా ప్రవహించే తన పట్టుదలతో ముగ్గురికి ఒళ్ళు జలధరించింది వెంటనే ముగ్గురు పరిగెత్తుకెళ్లి రాఘవయ్య కాళ్ళ మీద పడ్డారు స్వామి మీరెవరు మీరు దేవుడా నిన్న రాత్రి మా ముగ్గురి కలలోకి వచ్చి ఇక్కడికి రమ్మని చెప్పింది మీరేనా రాఘవయ్య నిజంగా ఆశ్చర్యపోయాడు నేను దేవుడు ఏంట్రా ఇదిగో ఈ పిల్లాడికి తాతయ్యని అంతే కాదు స్వామి మీరు దేవుడు కాకపోతే మా కలలోకి వచ్చిన సమస్యకే ఇప్పుడు మీరు పరిష్కారం చెప్ప చెప్పడం ఏంటి మమ్మల్ని
(13:35) రమ్మన్న చోటికే మీరు రావడం ఏంటి అప్పుడు రాఘవయి చెప్పిన ఆ మాట ఈ కథ మొత్తానికి ప్రాణం మీరు ఎవరో మీ సమస్య ఏంటో నాకు తెలియదు నేను నా మనవడికి చెప్పింది ఒక లాజిక్ అది మీ సమస్యకి పరిష్కారం అయితే పాటించండి అది వదిలేసి ఇందులో మ్యాజిక్ ఎందుకు వెతుకుతున్నారు అయినా తప్పు మీది కాదులే మనుషులకి లాజిక్ అంటే మ్యాజిక్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అని మనవడు చెయ్యి పట్టుకొని ఆ ముసలాయన నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.
(14:00) ముగ్గురు అలా నిలబడిపోయారు అప్పుడు వాళ్ళక అంతా స్పష్టంగా అర్థమయింది ఆ రాత్రి వాళ్ళ గదుల్లోకి వచ్చింది దేవుడు కాదు దెయ్యం కాదు వాళ్ళ లోపల ఎప్పటి నుంచో అరుస్తున్న వాళ్ళ గొంతే ఇలా వెళ్తే నాశనం అయిపోతావు అనే అది రోజూ చెప్తూనే ఉంది వాళ్ళు వినిపించుకోలేదు అందుకే వాళ్ళ ఫ్యూచర్ రూపంలో వాళ్ళ గదిలోకి వచ్చింది ఆ క్షణంలో ముగ్గురు ఒక నిర్ణయానికి వచ్చారు ఈ క్షణం నుంచి నా అలవాటు మారాలి ఈరోజు మారకపోతే నా జీవితం నా చేతుల్లో నుంచి జారిపోతుంది రాహుల్ రాత్రే తన ఫోన్ పక్కన పెట్టి పొద్దున ఐదు గంటలకు అలారం పెట్టుకున్నాడు వాకింగ్ చేయడానికి బాబీ ఆ రాత్రే ఒక ఆన్లైన్ కోర్సులో చేరాడు
(14:30) పింకీ ఆ రాత్రే తన గదిలో ఉన్న బాటిల్స్ అన్ని తీసి బయట పడేసింది. ముగ్గురికి ఒకటే మాట మనసులో మొదలుతుంది. మన భవిష్యత్తు అనేది మనల్ని సంతోషంగా ఆహ్వానించేలా ఉండాలి మనల్ని చంపదెబ్బ కొట్టేలా కాదు. కథ ఇక్కడితో అయిపోయింది. ఇప్పుడు మనం మన గురించి మాట్లాడుకుందాం. ఈ కథలో ముగ్గురు ఉన్నారు ముగ్గురికి వేరు వేరు సమస్యలు వేరు వేరు వయసులు కానీ ఒక్కసారి జాగ్రత్తగా చూడండి ముగ్గురిలో ఒక్కరు కూడా పెద్ద తప్పేం చేయలేదు.
(14:57) రాహుల్ ఎవరిని మోసం చేయలేదు బాబీ ఎవరికీ అన్యాయం చేయలేదు పింకీ ఏ నేరము చేయలేదు ముగ్గురు చేసింది ఒక్కటే జీవితాన్ని ప్రశాంతంగా సేఫ్ గా గొప్పగా ఉంచుకోవడానికి రోజు చేయాల్సిన చిన్న చిన్న పనుల్ని వదిలేసి ఏమీ కాదులే అనో ఆలోచించకుండానో చేసిన చిన్న చిన్న పనులు ప్రతిరోజు కన్సిస్టెంట్ గా ఆగకుండా ఆపకుండా చేసిన ఆ చిన్న చిన్న పనులు రాబోయే 10ఏళ్లలో నాశనం కాబోయే వాళ్ళ భవిష్యత్తుకి పునాది వేస్తున్నాయి.
(15:25) ఇప్పుడు ఆ మూడింటిని ఒక్కొక్కటిగా చూద్దాం ఎందుకంటే ఆ మూడింట్లో ఏదో ఒకటి ఇప్పుడు మనలో చాలా మందిలో ఉంది మొదటిది మన శరీరం రాహుల్ ఏం చేశడు ఎక్సర్సైజ్ మానేసాడు రోజు రాత్రి రెండు గంటల వరకు మేలుకొంటాడు పద్దాకా బయట తిండి తింటాడు ఇప్పుడు అంతా బాగానే ఉంటుంది కానీ అదే ప్రమాదం మన శరీరం చాలా మంచిది అది వెంటనే కంప్లైంట్ చేయదు మనం ఎంత నిర్లక్ష్యం చేసినా అది మౌనంగా భరిస్తూనే ఉంటుంది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి అది భరిస్తుంది అంటే క్షమిస్తుంది అని కాదు లెక్క రాసుకుంటుంది ఆ లెక్క ఒక రోజు మన ముందు పెడుతుంది అప్పుడు మనం ఐసియు లో ఉంటాం మన పక్కన మన
(15:56) కుటుంబం ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏమనుకుంటాం అయ్యో ఆ రోజు కొంచెం జాగ్రత్త పడి ఉంటే బాగుండేది కదా అని కానీ అప్పటికే ఆలస్యం అయిపోతుంది. ఇక్కడ ఒక చేదు నిజం ఉంది ఇఫ్ యు డోంట్ మేక్ టైం ఫర్ యువర్ హెల్త్ టుడే యు విల్ బి ఫోర్స్డ్ టు మేక్ టైం ఫర్ యువర్ ఇల్నెస్ టుమారో అంటే ఈరోజు మీ ఆరోగ్యం కోసం మీరు టైం కేటాయించకపోతే రేపు మీ జబ్బు కోసం టైం కేటాయించక తప్పదు అప్పుడు అది మీ ఇష్టం కాదు తప్పనిసరి రెండోది మన సామర్థ్యం అంటే స్కిల్ బాబు ఏం చేసాడు ఏమి చేయలేదు అదే అతని తప్పు నా పని నాకు వచ్చు కదా కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది అని సొల్లుతో టైం వేస్ట్
(16:28) చేశాడు. ఈ ఒక్క వాక్యం ఎంతమంది జీవితాలు నాశనం చేసిందో తెలుసా ఒకసారి ఆలోచించండి 10ఏళ్ల క్రితం ఉన్న ప్రపంచం ఇప్పుడు ఉందా 10 ఏళ్ళ క్రితం ఉన్న ఉద్యోగాలు ఇప్పుడు ఉన్నాయా ప్రపంచం రోజు మారుతుంది మనం మారకపోతే మనం నిలబడలేం వెనక్కి జారిపోతాం ఇక్కడ మనలో చాలా మంది ఒక పొరపాటు చేస్తాం నా ఉద్యోగం సేఫ్ నా కంపెనీలో నాకు ఇబ్బంది లేదు అనుకుంటాం కానీ నిజం ఏంటంటే మన ఉద్యోగాన్ని ఎవరు లాక్కోరు అదే మన చేతుల్లో నుంచి జారిపోతుంది.
(16:51) ఎందుకంటే మనం దాన్ని పట్టుకునే సామర్థ్యాన్ని స్కిల్ ని ఎప్పుడో వదిలేసాం. కొత్తగా నేర్చుకోవడం మానేసాం. రోజు చూస్తున్నాం కదా ఆ కంపెనీలో 1000 మందిని తీసేసారు ఈ కంపెనీలో 10,000 లే ఆఫ్స్ అని ఇన్ ఏ రాపిడ్లీ చేంజింగ్ వరల్డ్ ద బిగ్గెస్ట్ రిస్క్ ఇస్ నాట్ టేకింగ్ ఎనీ రిస్క్ అంటే వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో అతి పెద్ద రిస్క్ ఏంటంటే ఏ రిస్క్ తీసుకోపోవడమే ఉన్నచోట ఉండటం సేఫ్ కాదు అది అన్నిటికంటే డేంజర్ మూడోది మన అలవాట్లు పింకీ మొదటిసారి బీరు తాగినప్పుడు ఏమనుకుంది ఇందులో పెద్ద విషయం ఏముంది అందరూ తాగుతారు కదా ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయం మిస్ అవుతున్నాం ఏ వ్యసనం
(17:23) నేను నిన్ను నాశనం చేయబోతున్నాను అని చెప్పి రాదు అది సరదాగా వస్తుంది ఫన్ గా వస్తుంది అందరూ చేస్తున్నారు కదా అని అదే మనకు అలవాటు అయిపోతుంది. మొదట్లో దాన్ని మనం కంట్రోల్ చేయలేకపోతే కొన్నాళ్ళకు అది మనల్ని కంట్రోల్ చేస్తుంది. ఫస్ట్ యు టేక్ ఏ డ్రింక్ దెన్ ద డ్రింక్ టేక్స్ ఏ డ్రింక్ దెన్ ద డ్రింక్ టేక్స్ యు అంటే మొదట నువ్వు ఒక బాటిల్ తీసుకుంటావ్ ఆ తర్వాత ఆ బాటిల్ ఇంకో బాటిల్ని తీసుకుంటుంది చివరికి ఆ బాటిల్ నిన్ను తీసుకుంటుంది.
(17:48) ఇలాగే ఉంటే పింకీ కోల్పోయేది ఏంటి కేవలం ఆరోగ్యాన్నే కాదు తల్లి అయ్యే అవకాశాన్ని తనను ప్రేమించిన మనిషిని తన కుటుంబాన్ని అన్నింటిని కోల్పోతుంది. ఒక చిన్న సరదా ఇంత కాస్ట్లీ అవుతుందని అంతా అయిపోయాక గాని ఎవరికీ అర్థం కాదు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ మూడు కథల్లోనూ ఒకటే పాటర్న్ ఉంది చూసారా ఒక చిన్న పని రోజూ ఆగకుండా పదే ఏళ్ళ తర్వాత ఒక పెద్ద విషాదం.
(18:10) కానీ ఇక్కడ ఒక అద్భుతమైన నిజం కూడా ఉంది ఈ నియమం మంచికి కూడా అలాగే పనిచేస్తుంది. రోజు 30 నిమిషాలు నడిస్తే 80 ఏళ్ల వయసులో కూడా మెట్లు ఎక్కగలుగుతాం మనవాళ్ళు మనవరాలతో ఆడుకోగలుగుతాం రోజు ఒక్క గంట కొత్త స్కిల్ నేర్చుకుంటే 10 ఏళ్ల తర్వాత మనకి కొత్త ఉద్యోగం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు ఉద్యోగాలే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి.
(18:29) ఒక్క చెడ్డ అలవాటుని వదిలేస్తే 10 ఏళ్ల తర్వాత మన చుట్టూ మనవాళ్ళు ఉంటారు లేదంటే మనల్ని మనమే వదిలి వెళ్ళే రోజు వస్తుంది. యు డు నాట్ రైస్ టు ద లెవెల్ ఆఫ్ యువర్ గోల్స్ యు ఫాల్ టు ద లెవెల్ ఆఫ్ యువర్ సిస్టమ్స్ అంటే నువ్వు నీ లక్ష్యాల స్థాయికి ఎదగవు నీ రోజు వారి అలవాట్ల స్థాయికి పడిపోతాం. లక్ష్యం అనేది మనం కోరుకునేది అలవాటు అనేది మనం నిజంగా అయ్యేది.
(18:49) ఇప్పుడు కథలోని ఆ ముగ్గురు దగ్గరికి తిరిగి వద్దాం వాళ్ళకి ఒక అదృష్టం తక్కింది పదఏళ్ల తర్వాత తాము ఎలా ఉంటారో వాళ్ళు కళ్ళారా చూశారు ఆ భయమే వాళ్ళని మార్చింది మనకు ఆ అదృష్టం లేదు మన గదిలోకి ఎవరు రారు మన చెంప మీద ఎవరు కొట్టరు కానీ ఒక క్షణం ఆలోచించండి ఆ ముగ్గురిని కొట్టింది ఎవరు శత్రువులు కాదు అపరిచితులు కారు వాళ్ళని వాళ్లే కొట్టుకున్నారు ఎందుకు కోపంతోనా కాదు ప్రేమతో ఎందుకంటే పదఏళ్ల తర్వాత ఆ నరకం అనుభవిస్తున్నది వాళ్లే నా జీవితాన్ని నేను నాశనం చేసుకోకూడదు అన్న ఆవేదనతో వాళ్ళకు వాళ్లే ముందుకెళ్లి వెనక్కి వచ్చి తమని తామే కొట్టుకున్నారు. ఇప్పుడు ఒక్క
(19:19) నిమిషం కళ్ళు మూసుకొని ఆలోచిద్దాం ఈ రాత్రి మీ గదిలోకి పదేళ్ల తర్వాత మీరు వస్తే ఆ మనిషి ఎలా ఉంటాడు ఆరోగ్యంగా ధైర్యంగా గర్వంగా ఉంటాడా చుట్టూ మనుషులు చేతిలో సంపాదన మొహంలో నవ్వు ఉంటాయా లేక మెట్లెక్కలేని శరీరంతో ఉద్యోగం లేని చేతులతో ఎవరూ లేని ఇంట్లో ఉంటాడా ఇంకా ముఖ్యమైన ప్రశ్న ఆ మనిషి మిమ్మల్ని చూసి కౌగలించుకుని థాంక్యూ రా నువ్వు ఆ రోజు మారావు కాబట్టి నేను ఈరోజు ఇలా ఉన్నా అంటాడా లేక లాగిపెట్టి మీ చెంప మీద కొడతాడా జవాబు మన దగ్గరే ఉంది ఎందుకంటే అంటే ఆ మనిషిని తయారు చేస్తున్నది మనమే ఈరోజు ఈ క్షణం ఈ వీడియో చూస్తున్న ఈ
(19:53) నిమిషం కూడా ఆ మనిషిని మనమే తయారు చేస్తున్నాం. ఎవరీ యాక్షన్ యు టేక్ ఇస్ ఏ వోట్ ఫర్ ద టైప్ ఆఫ్ ఏ పర్సన్ యు విష్ టు బికమ ప్రతిరోజు నువ్వు చేసే ప్రతి చిన్న పని నువ్వు కావాలనుకునే వ్యక్తికి నువ్వు వేసే ఓటు ఈరోజు నువ్వు నీ ఆరోగ్యానికి ఓటు వేస్తున్నావా లేక అనారోగ్యానికా ఈరోజు నీ కలకు ఓటు వేస్తున్నావా లేక వాయుదాకా జీవితంలో ఈ ఎన్నిక ప్రతి రోజు జరుగుతుంది.
(20:14) చివరిగా ఒక్క మాట మనల్ని మార్చడానికి ఏ దేవుడు రాడు ఏ మ్యాజిక్ జరగదు మన గదిలోకి ఎవ్వరూ రారు కావలసింది ఒక్క లాజిక్ మాత్రమే ఈరోజు నేను ఏం చేస్తున్నానో 10 ఏళ్ల తర్వాత నేను అదే మన అలవాట్లని ఒక్క రోజులో మార్చేసుకుందాం అని నేను చెప్పట్లేదు అది జరగదు జరిగినా నిలబడదు కేవలం ఈరోజు ఒక్కరోజు మన పనికి రాని ఒక అలవాటు ప్లేస్ లో ఒక చిన్న పనిని మన భవిష్యత్తును నిర్మించుకునే పనిని చేద్దాం రేపు మళ్ళీ చేద్దాం ఎల్లుండి మళ్ళీ మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి రత్నాకరుడు కూడా ఒక్క రోజులో వాల్మీకి కి కాలేదు మరా మరా మర అంటూ ఏళ్ల తరబడి ఆగకుండా అన్నాడు ఆ
(20:48) రాయి కూడా ఒక్క కెనరటానికి నున్నగా మారలేదు మనం కూడా అంతే కానీ మారతాం ఆగకుండా చేస్తే కచ్చితంగా మారతాం. ఈ ఎపిసోడ్ మీలో కొద్దిగా ఆయన ఆలోచన రేకెత్తించి ఉంటే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇంకో పని చేయండి మీరు ఈ రోజు నుంచి మార్చుకోబోయే ఆ ఒక్క అలవాటు ఏంటో కొత్తగా చేసుకోబోయే అలవాటు ఏంటో కామెంట్స్ లో రాయండి ఎందుకంటే మనసులో అనుకుంటే అది ఒక ఆలోచనే రాస్తే మాత్రం అది ఒక కమిట్మెంట్ అవుతుంది.
(21:13) ఏదో ఒక చెడ్డ అలవాటుకు బానిసై నేను మారలేను అనుకుంటున్న మీ ప్రతి స్నేహితుడికి ఈ వీడియోని షేర్ చేయండి. మరో పవర్ఫుల్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం మర్చిపోకండి 10ఏళ్ల తర్వాతి మిమ్మల్ని ఈరోజే తయారు చేసుకోండి. కలుద్దాం జై హింద్ జై శ్రీరామ్.
No comments:
Post a Comment