✅ జపనీస్ పేరెంటింగ్ సీక్రెట్:పిల్లల మెదడును బలంగా చేసే 6 అలవాట్లు#viral#trending#japaneseparenting
Author Name:Mindful Parenting. 💞
Youtube Channel Url:https://www.youtube.com/@MindfulParentingbyNLP
Youtube Video URL:https://www.youtube.com/watch?v=l_CSjxEC1rM
Transcript:
(00:00) కొంతమంది పిల్లలు చాలా ప్రశాంతంగా ఉంటారు. కొత్త విషయాలను [సంగీతం] త్వరగా నేర్చుకుంటారు. సమస్య వచ్చినప్పుడు భయపడకుండా ఆలోచించి పరిష్కారం వెతుకుతారు. [సంగీతం] మరి కొందరు మాత్రం చిన్న విషయానికే చిరాకు పడతారు. ఏకాగ్రత కోల్పోతారు. [సంగీతం] ఈ తేడా ఎందుకు వస్తుంది? చాలా మంది మంచి స్కూల్, ఖరీదైన ట్యూషన్, ఎక్కువ చదువు అని అనుకుంటారు.
(00:22) [సంగీతం] కానీ చైల్డ్ డెవలప్మెంట్ పై జరిగిన అనేక పరిశోధనలు మరో విషయాన్ని చెబుతున్నాయి. [సంగీతం] ఈ తేడా తెలివి తేటల్లో కాదు ఇంట్లో ప్రతిరోజు జరిగే కొన్ని చిన్న అలవాట్లలో ఉండొచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. [సంగీతం] అయితే ప్రపంచం జపాన్ పేరెంటింగ్ ను ఎందుకు గౌరవంగా చూస్తుందో చివరివరకు చూడండి. చివరి అలవాటు చాలా [సంగీతం] మంది పేరెంట్స్ ఊహించనిది.
(00:45) పిల్లల మెదడును నిజంగా మార్చేది స్కూల్ అనా లేక ఇంట్లో జరిగే చిన్న చిన్న అలవాట్లా? [సంగీతం] పిల్లల అభివృద్ధిపై జరిగిన అనేక పరిశోధనలు చెబుతున్న విషయం ఏమిటంటే [సంగీతం] పిల్లల మెదడు మొదటి సంవత్సరాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. [సంగీతం] ఆ సమయంలో పిల్లలు అనుభవించే వాతావరణం ప్రేమ, భద్రత, నిద్ర, ఆట, సంభాషణ ఇవన్నీ వారి [సంగీతం] మెదడు నిర్మాణంపై ప్రభావం చూపుతాయి.
(01:10) అందుకే జపాన్ లో అనేక కుటుంబాల్లో కనిపించే [సంగీతం] కొన్ని పేరెంటింగ్ అలవాట్లు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని కలిగించాయి. ఈరోజు ఆ ఆరు అలవాట్లను తెలుసుకుందాం. [సంగీతం] కానీ మూడో అలవాటు విమ్మ తర్వాత చాలా మంది తల్లిదండ్రులు మన ఇంట్లో కూడా ఇదే జరుగుతోంది అని అనుకుంటారు. ఇప్పుడు [సంగీతం] ఒక చిన్న కథ చూద్దాము. ఒక మదర్ నాతో ఇలా చెప్పింది.
(01:32) మా అబ్బాయి చాలా తెలివైనవాడు కానీ చదవడానికి కూర్చోమంటే ఐదు నిమిషాల్లోనే విసిగిపోతాడు అని [సంగీతం] ఆమెకు అనిపించింది ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయించాలి అని. ప్రతిరోజు అదనంగా వర్క్ షీట్లు ఇచ్చింది [సంగీతం] చదివించింది కానీ పరిస్థితి ఇంకా కష్టమైంది. పిల్లవాడు చదువుకే భయపడటం మొదలు పెట్టాడు. కొన్ని నెలల తర్వాత ఒక చైల్డ్ [సంగీతం] డెవలప్మెంట్ ఎక్స్పర్ట్ ని కలిసింది.
(01:58) అతను మొదట అడిగిన ప్రశ్న ఏంటంటే మీ బాబు రోజు ఎంతసేపు నిద్రపోతాడు అని దానికి ఆమె [సంగీతం] ఆశ్చర్య పోయింది. తనకు సమస్య చదువులో ఉందనిపించింది. కానీ సార్ మాత్రం నిద్ర గురించి అడిగాడు. ఎందుకు అని [సంగీతం] అయితే అదే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మొదటి అలవాటు ఎస్ పేరెంట్స్ నిద్రను [సంగీతం] చదువు కంటే తక్కువగా చూడకూడదు. ఎందుకంటే మనలో చాలా మంది ఇలా అంటుంటాం.
(02:23) [సంగీతం] ఇంకో 10 నిమిషాలు చదువు హోం వర్క్ పూర్తయ్యాకే పడుకో ఇది [సంగీతం] మనం ప్రేమతోనే చెబుతాం. కానీ ఇక్కడ చాలా మంది చేసే పొరపాటు ఇదే. పిల్లలు నిద్రపోతున్నప్పుడు కూడా వారి మెదడు పని చేస్తూనే ఉంటుంది. రోజంతా నేర్చుకున్న విషయాలను క్రమబద్ధీకరిస్తుంది. మెమరీస్ ను స్ట్రాంగ్ [సంగీతం] చేస్తుంది. ఎమోషన్స్ ని బాలెన్స్ చేస్తుంది.
(02:44) అయితే అనేక పరిశోధనలు చెబుతున్న విషయం ఏమిటంటే హెల్దీ స్లీప్ బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా ఇంపార్టెంట్. అయితే తగిన నిద్ర లేకపోతే పిల్లల్లో చిరాకు ఏకాగ్రత తగ్గడం, ఎమోషనల్ కంట్రోల్ లో ఇబ్బందులు కనిపించవచ్చు. అందుకు [సంగీతం] ఈ రోజు నుంచే మూడు చిన్న మార్పులు చేయండి. పడుకునే సమయాన్ని వీలైనంతవరకు ప్రతిరోజు ఒకేలా ఉంచండి.
(03:09) నిద్రకు కనీసం ఒక గంట ముందు మొబైల్ టీవీ తగ్గించండి. నిద్రకు ముందు ఒక చిన్న కథ చెప్పండి. లేదా ప్రశాంతంగా మాట్లాడండి. ఇవి చిన్న మార్పులే కానీ మెదడుకు పెద్ద గిఫ్ట్ కానీ నిద్ర ఒక్కటే సరిపోదు. నిద్రతో పాటు జపాన్ లో అనేక కుటుంబాల్లో కనిపించే మరో అలవాటు. ఇది [సంగీతం] ఖరీదైనది కాదు ట్యూషన్ అవసరం లేదు అయినా మెదడుకు అద్భుతమైన వ్యాయామం అదేంటంటే [సంగీతం] రెండు ప్రతిరోజు ప్రకృతిలో సమయం వర్షమైనా చలైనా [సంగీతం] ఎండైనా జపాన్ లో అనేక కుటుంబాలు పిల్లలను బయట ఆడేందుకు ప్రోత్సహిస్తాయి.
(03:44) ఎందుకంటే [సంగీతం] ప్రకృతి కేవలం వినోదం కాదు. అది పిల్లల మెదడుకు ఒక సహజమైన తరగతి గది. [సంగీతం] మట్టిని తాకడం, ఆకులను గమనించడం, పక్షుల శబ్దం వినడం, చెట్ల మధ్య పరిగెత్తడం ఇవి అన్ని ఇంద్రియాలను ఒకేసారి [సంగీతం] ఉత్తేజపరుస్తాయి. కొన్ని పరిశోధనలు నేచర్ లో గడిపే సమయం పిల్లల స్ట్రెస్ ను తగ్గించడంలో [సంగీతం] దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని సూచిస్తున్నాయి.
(04:10) అందుకు ప్రతిరోజు 20 30 నిమిషాలు పార్కుకు తీసుకెళ్ళండి. [సంగీతం] మొక్కలకు నీళ్లు పోయనివ్వండి. చెప్పులు తీసి గడ్డిపై నడవనివ్వండి. సురక్షితమైన చోట మాత్రమే [సంగీతం] ఈ చిన్న అనుభవాలు జీవితాంతం గుర్తుండే నేర్చుకునే క్షణాలుగా మారవచ్చు. కానీ [సంగీతం] ఇప్పుడు చెప్పబోయే మూడో అలవాటు చాలా ఇళ్లల్లో తెలియకుండానే పిల్లల ఏకాగ్రతను ప్రభావితం [సంగీతం] చేస్తోంది.
(04:33) అదేంటంటే మూడు స్క్రీన్ టైం బౌండరీస్ పెట్టడం. [సంగీతం] ఒక చిన్న ప్రశ్న. మీ పిల్లలకు బోర్ కొడుతున్నప్పుడు మీరు ముందుగా ఏమఇస్తారు? బొమ్మనా కథనా లేక మొబైల్ ఫోనా చాలా [సంగీతం] మంది తల్లిదండ్రులు ఇలా అంటారు. ఐదు నిమిషాలే కదా కానీ [సంగీతం] ఆ ఐదు నిమిషాలు ప్రతిరోజు అలవాటు మారితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన [సంగీతం] విషయం ఉంది.
(04:57) చిన్న పిల్లల మెదడు నిజమైన ప్రపంచాన్ని తాకుతూ వింటూ కదులుతూ నేర్చుకోవడానికి రూపొందించబడింది. [సంగీతం] స్క్రీన్ పూర్తిగా శత్రువు కాదు కానీ అది నిజ జీవిత అనుభవాలను భర్తీ చేయకూడదు. [సంగీతం] ఒకరోజు ఒక ఫాదర్ చెప్పిన మాట నా పాప నాతో ఆడుకోవాలని అడిగేది. [సంగీతం] నేను ఐదు నిమిషాలు నాకు వేరే పని ఉంది అంటూ ఫోన్ ఇచ్చేవాడిని తర్వాత కొన్ని డేస్ కి మా పాప నాతో కాకుండా ఫోన్ [సంగీతం] తోనే మాట్లాడటం మొదలు పెట్టింది.
(05:23) ఆ రోజు ఆ ఫాదర్ కు అర్థమయింది. ఏంటంటే [సంగీతం] పిల్లలకు ఎప్పుడూ కొత్త బొమ్మ అవసరం ఉండదు. కొన్నిసార్లు మన సమయమే చాలుతుంది. [సంగీతం] అందుకు ఈ రోజు నుంచి మూడు మార్పులు ప్రయత్నించండి. భోజనం సమయంలో ఫోన్లు పక్కన పెట్టండి. రోజుకి కనీసం [సంగీతం] 30 నిమిషాలు స్క్రీన్ లేని కుటుంబ సమయం పెట్టండి. పిల్లలు బోర్ అంటే వెంటనే ఫోన్ ఇవ్వకుండా ఒక [సంగీతం] చిన్న ఆట మొదలు పెట్టండి.
(05:49) కానీ ఫోన్ తీసేయడం ఒక్కటే సరిపోదు. ఆ ఖాళీని దేనితో నింపాలి? జపాన్ లో అనేక కుటుంబాలు దానికి చాలా సులభమైన మార్గాన్ని ఎంచుకుంటారు. అవేంటంటే నాలుగు. చేతులతో చేసే పనులే నిజమైన పాఠాలు. ఒక్కసారి గుర్తు చేసుకోండి మీ [సంగీతం] చిన్నప్పటి అందమైన జ్ఞాపకాలు వర్క్ షీట్లా లేక మట్టిలో ఆడుకున్న రోజులా చేతులతో చేసే పనులు పిల్లలకు కేవలం సరదా కాదు అవి మెదడుకు వ్యాయామం వంటలో చిన్న సహాయం క్లోత్స్ ఫోల్డింగ్ మొక్కలకు నీళ్లు పోయడం లెగోతో నిర్మాణాలు చేయడం ఇలాంటి పనుల్లో పిల్లలు [సంగీతం] ప్లాన్ చేస్తారు తప్పులు చేస్తారు మళ్ళీ ప్రయత్నిస్తారు.
(06:28) ఇదే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కి పునాది. డెవలప్మెంటల్ సైకాలజీ కూడా పిల్లలు చేసి నేర్చుకున్న విషయాలు ఎక్కువ కాలం గుర్తుంటాయని సూచిస్తుంది. అదెలా అంటే ఒకరోజు ఒక మదర్ తన కొడుకుతో ప్రతిరోజు వంటగదిలో ఐదు నిమిషాలు గడపడం మొదలు పెట్టింది. [సంగీతం] మొదట పిండి నేల మీద పడేది నీళ్లు చెందేవి. ఆమెకు చిరాకు [సంగీతం] వచ్చేది.
(06:51) కానీ కొన్ని వారాల తర్వాత అదే పిల్లవాడు తన స్కూల్ ప్రాజెక్ట్ ను ఎవరి సహాయం లేకుండా పూర్తి చేశాడు. ఎందుకంటే తప్పు చేయడానికి భయపడని ధైర్యం [సంగీతం] అతనిలో పెరిగింది. అందుకు ఈ వారం ఒక పని చేయండి. ప్రతిరోజు 15 నిమిషాలు పిల్లవాడితో కలిసి ఒక పని చేయండి. [సంగీతం] పని పర్ఫెక్ట్ గా చేయాలని ఆశించకండి. ఫలితాన్ని కాదు ప్రయత్నాన్ని ప్రశంసించండి.
(07:14) [సంగీతం] ఇప్పటివరకు చెప్పిన నాలుగు అలవాట్లు పిల్లల మెదడును బలోపేతం చేస్తాయి. కానీ ఇప్పుడు చెప్పబోయే ఐదో అలవాటు [సంగీతం] పిల్లల హృదయాన్ని బలోపేతం చేస్తుంది. అది చాలా సులభం కానీ ఈ రోజుల్లో అత్యంత అరుదుగా మారుతోంది. [సంగీతం] అదెలా అంటే ఐదు పిల్లలతో మాట్లాడే సమయాన్ని ఎవరూ భర్తీ [సంగీతం] చేయలేరు. ఒక ప్రశ్న అడుగుతాను.
(07:38) మీ పిల్లలకు ఈరోజు మీరు ఎంతసేపు పూర్తిగా [సంగీతం] సమయం ఇస్తున్నారు? పక్కన ఫోన్ లేకుండా టీవీ శబ్దం లేకుండా కేవలం వారి మాటలు వినడానికి చాలా మంది [సంగీతం] తల్లిదండ్రులు ప్రేమను పనుల ద్వారా చూపిస్తారు. మంచి బట్టలు మంచి స్కూల్ [సంగీతం] మంచి ఆహారం ఇవన్నీ చాలా విలువైనవే కానీ పిల్లల దృష్టిలో నన్ను నిజంగా విన్నారా అనేదే [సంగీతం] ఎక్కువ విలువైనది.
(08:02) పిల్లలతో మాట్లాడినప్పుడు వారి మెదడులో భాష [సంగీతం] మాత్రమే కాదు భద్రత, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఎమోషనల్ కంట్రోల్ ఇవన్నీ క్రమంగా అభివృద్ధి చెందుతాయి. అదెలా అంటే [సంగీతం] స్కూల్లో ఒక ఎనిమిది సంవత్సరాల అబ్బాయిని టీచర్ ఇలా అడిగింది. నీకు ఈ వారం జరిగిన మంచి విషయం ఏమిటి [సంగీతం] అని అతను కాసేపు ఆలోచించి చెప్పాడు. నాన్న ఈ వారం ఒకరోజు ఫోన్ పక్కన [సంగీతం] పెట్టి నాతో కూర్చొని మాట్లాడారు అని ఆ అబ్బాయికు అది మెమరీ లాగా గుర్తుండిపోయింది.
(08:31) అయితే [సంగీతం] అది బహుమతి కాకపోవచ్చు కానీ ఆ 20 నిమిషాలు కొన్నిసార్లు [సంగీతం] మన సమయం పిల్లలకు జీవితాంతం గుర్తుండే జ్ఞాపకంగా మారవచ్చు. అందుకు ప్రతిరోజు రాత్రి కేవలం [సంగీతం] 10 నిమిషాలు కేటాయించండి. ఈ మూడు ప్రశ్నలు అడగండి. ఈరోజు నీకు బాగా నచ్చిన విషయం ఏమిటి? ఏదైనా నిన్ను బాధ పెట్టిందా? రేపు ఏం చేయాలని అనుకుంటున్నావు? సలహా ఇవ్వడానికి తొందర పడకండి. ముందు వినండి.
(08:57) [సంగీతం] కానీ ఇంకో చివరి అలవాటు ఉంది. చాలా మంది పేరెంట్స్ మంచి ఉద్దేశంతోనే చేసే ఒక పొరపాటును ఇది మనకు [సంగీతం] గుర్తు చేస్తుంది. అదేంటంటే ఆరు మార్కుల కంటే బాల్యానికి విలువ ఇవ్వడం ఈ రోజుల్లో మూడు సంవత్సరాల పిల్లలకే అక్షరాలు, సంఖ్యలు, వర్క్ షీట్లు, క్లాసులు ఇవన్నీ మొదలవుతున్నాయి. [సంగీతం] తల్లిదండ్రుల ఉద్దేశం మంచిదే కానీ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి.
(09:23) [సంగీతం] చైల్డ్హుడ్ పోటీ కాదు అది అభివృద్ధి జరిగే సమయం. జపాన్ లో అనేక ప్రారంభ విద్యా విధానాల్లో ఆట, సహకారం, సెల్ఫ్ కంట్రోల్, [సంగీతం] సోషల్ స్కిల్స్ కు ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకంటే బలమైన పునాది ఏర్పడితే [సంగీతం] చదువు తర్వాత సహజంగానే సులభమవుతుంది. అందుకు ప్రతి పిల్లవాడు ఒకే వేగంలో ఎదగడు. ఒక మొక్కను రోజూ లాగితే అది త్వరగా పెరగదు.
(09:50) అదేవిధంగా పిల్లల అభివృద్ధికి కూడా సమయం అవసరం. ఈ వీడియో నచ్చినట్లైతే లైక్ షేర్ కామెంట్ చేయండి. మరిన్ని చైల్డ్ సైకాలజీ అండ్ పేరెంటింగ్ వీడియోల కోసం మైండ్ఫుల్ పేరెంటింగ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.
No comments:
Post a Comment