Friday, August 7, 2026

Bore కొట్టగానే Phone తీస్తున్నారా? Bore కొట్టనివ్వండి!

Bore కొట్టగానే Phone తీస్తున్నారా? Bore కొట్టనివ్వండి!

Author Name:Shanthy Diaries

Youtube Channel Url:https://www.youtube.com/@shanthydiaries

Youtube Video URL:https://www.youtube.com/watch?v=tWMjNRTkbzk



Transcript:
(00:00) మనిషికి ఇప్పుడు ఆకలి కంటే భయం వేసేది ఏంటో తెలుసా? ఏమి చేయకుండా ఉండటం. రెండు నిమిషాలు ఖాళీగా ఉంటే ఫోన్ తీస్తాం. లిఫ్ట్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఫోన్ తీసుకుంటాం. తినేటప్పుడు వీడియో చూస్తాం. నిద్రపోయే ముందు ఏదో ఒకటి చూస్తూనే ఉంటాం. ఎందుకంటే మనకి బోర్ అంటే ఇష్టం ఉండదు. నమస్కారం. నేను మీ ప్రశాంత్.
(00:20) అసలు బోర్డమ్ అంటే ఏంటి? మీరు చేయడానికి ఏ పని లేనప్పుడు ఖాళీగా ఉండే అసౌకర్యమే బోర్డమ్ అని మనం అనుకుంటాం. కానీ అసలు విషయం ఏంటంటే మీరు బయట నుంచి ఏ స్టిములేషన్ తీసుకోకుండా ఉన్నప్పుడు మీ మనసు తనలో ఉన్న విషయాలను మీ ముందుకు తీసుకొస్తుంది. అందుకే మనకి బోర్డం అసౌకర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఎంటర్టైన్మెంట్ ఉండదు డిస్ట్రాక్షన్ ఉండదు మీరు మాత్రమే ఉంటారు.
(00:45) మీ ఆలోచనలు మీ భయాలు మీ అసంతృప్తి మీ కోరికలు అన్నీ స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఒక గ్లాస్ నీటిలో మట్టిని కలిపితే నీరు మురికిగా కనిపిస్తుంది. ఆ గ్లాస్ ని పదే పదే కదిలిస్తే ఆ మట్టి ఎప్పటికీ కింద కూర్చోదు కానీ మీరు ఆ గ్లాస్ ని కాసేపు అలాగే వదిలేస్తే మట్టి నెమ్మదిగా కింద కూర్చుంటుంది నీరు స్పష్టంగా కనిపిస్తుంది మన మనసు కూడా అంతే ఫోన్ టీవీ మాటలు పనులు నోటిఫికేషన్ సోషల్ మీడియా అని నిరంతరం మనసుని కదిలిస్తూనే ఉంటే మనకి మనం ఎప్పటికీ అర్థం కావు.
(01:18) కొద్దిసేపైనా ఏమీ చేయకుండా ఉన్నప్పుడే మన ఆలోచనలు క్రమంగా కింద కూర్చుంటాయి. అప్పుడు నిజంగా మనకి ఏం కావాలి ఏది మనల్ని బాధిస్తుంది ఏది మార్చుకోవాలి ఏది మనకి నిజంగా అవసరం అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మన చిన్నప్పుడు పిల్లలు బోర్గా ఫీల్ అయితే కొత్త ఆటం కనిపెట్టేవారు బెడ్ షీట్ తో ఇల్లు కట్టేవాళ్ళు కార్డ్ బోర్డ్ బాక్స్ తో ఇల్లు కట్టేవాళ్ళు మట్టితో ఆడుకునేవారు ఒక కర్రని స్వాడ్ గా ఊయించేవాళ్ళు కానీ ఇప్పుడు పిల్లలు బోర్ అనగానే మనం వాళ్ళ చేతికి ఫోన్ ఇస్తున్నాం.
(01:48) బోర్ పోతుంది కానీ దాంతో పాటు వాళ్ళ ఇమాజినేషన్ కూడా పోతుంది. మనసుకి రెడీమేడ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వకుండా కాసేపు వదిలేస్తే అది తనంతట తాను కొత్త ఆలోచనలను క్రియేట్ చేస్తుంది. అందుకే చాలా మందికి మంచి మంచి ఐడియాస్ అన్ని వాళ్ళు నేచర్ లో నడుస్తున్నప్పుడు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు స్నానం చేస్తున్నప్పుడు వస్తాయి. ఎందుకంటే ఆ సమయంలో మనసుపై ఒత్తిడి ఉండదు.
(02:11) మేబి మనం బోర్ అంటున్నాం కానీ నిజానికి అది మన లోపల దాచుకున్న బాధ అయి ఉండొచ్చు. మనపై మనకున్న అసంతృప్తి అయి ఉండొచ్చు. మీరు వెంటనే ఫోన్ తీసుకుంటే ఆ బాధ కాసేపు కనిపించదు కానీ దాని అర్థం అది పోయిందని కాదు. ఎలా అంటే ఒక ఇంట్లో చెత్తను శుభ్రం చేయకుండా కార్పెట్ కింద దాచినట్టే ఉంటుంది. అసలు మనకి బోర్డం ఎందుకు భయమేస్తుందో తెలుసా? ఎందుకంటే మనం మనతో మనం ఉండడం నేర్చుకోలేదు.
(02:38) మనకి పక్కన వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలుసు సోషల్ మీడియాలో వాళ్ళ జీవితాలను గమనించడం తెలుసు కానీ నిశ్శబ్దంగా కూర్చొని కాసేపు మన మనసుని గమనించడం తెలియదు. సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ప్రతి ఖాళీని నింపాల్సిన అవసరం లేదు ఒక సంగీతంలో కేవలం శబ్దాలే ఉంటే అది సంగీతం కాదు ఆ స్వరాల మధ్య ఉన్న నిశశబ్దమే సంగీతానికి అందాన్ని ఇస్తుంది.
(03:00) అలాగే జీవితంలో కూడా ప్రతి క్షణాన్ని పని మాటలు ఎంటర్టైన్మెంట్ తో నింపేస్తే జీవితానికి అర్థం ఉండదు. ఖాళీ అనేది వ్యర్థం కాదు కొత్తది పుట్టే స్థలం. మరి ఈ బోర్డం ని ఎలా ఉపయోగించాలి? రోజులో కనీసం 10 నుంచి 15 నిమిషాలు ఏమీ చేయకుండా కూర్చోండి. టీవీ వద్దు ఫోన్ వద్దు మాటలు వద్దు జస్ట్ ఒక కిటికీ దగ్గర [సంగీతం] కూర్చోండి ఆకాశాన్ని చూడండి లేదా ఒక మొక్కను గమనించండి లేదా సైలెంట్ గా నడవండి.
(03:26) మొదట మీకు అసౌకర్యంగా అనిపిస్తుంది ఏదో ఒకటి చేయాలని మనసు లాగుతుంది కానీ వెంటనే స్పందించకండి నెమ్మదిగా మనసు కుదురుపడుతుంది. అప్పుడు ఆ బోర్డం నిశశబ్దంగా మారుతుంది నిశశబ్దం క్లారిటీగా మారుతుంది క్లారిటీ క్రియేటివిటీగా మారుతుంది. అందుకే కాసేపు ఓపిక్గా మీతో మీరు కూర్చోండి [సంగీతం] మీ మనసు ఏం చెప్పాలనుకుంటుందో వినే ప్రయత్నం చేయండి.
(03:47) ఇలాంటి సెల్ఫ్ గ్రోత్ స్పిరిచువాలిటీ అండ్ ప్రాక్టికల్ లైఫ్ హ్యాబిట్స్ కోసం శాంతి డైరీస్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకో మంచి మీనింగ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్కారం

No comments:

Post a Comment