ఓం నమో భగవతే శ్రీ రమణాయ🙏🏻
ఈశ్వరుడు అడిగేది సంచితమనే కర్పూరాన్ని వెలిగించి హారతి ఇవ్వమని. కానీ కొందరు ఒక అణాకి కర్పూరం కొనితెచ్చి, వెలిగించి, హారతి ఇచ్చి ఈశ్వరుణ్ణి ఏమార్చాలని(మాయ చేయాలని) చూస్తారు. ఇదంతా కన్ను తుడిచే వ్యాపారం. వీటికన్నిటికీ మోసపోయేవాడుకాడు ఈశ్వరుడు.
"ఈశ్వరుణ్ణి మింగాలి కానీ తాము చావకూడదు" ఇలా ఉంటుంది కొందరి ధోరణి. అబ్బా! ఎంత ఆశ!
(సంచితం అనగా పూర్వ జన్మలో చేసినవి; వాటి ఫలితాన్ని ఇంకా అనుభవించనవి)
అనేక సంవత్సరాలపాటు మహర్షితో జీవితం గడిపిన ఒక విదేశీయుడు(కోహెన్) తరచూ ఇలా అనేవారు ఆశ్రమ సేవకులతో........
"ఆశ్రమంలో సేవచేస్తూ సమయం గడపడం మంచిదే. కాని సాధన లేనిదే ఆధ్యాత్మిక ప్రగతి సాధించలేమని" మహర్షి, మాకు ఎన్నోసార్లు గుర్తు చేసేవారు.
'స్థిరమైన సాధన' అని మాకు ఎన్నోసార్లు నొక్కి చెప్పేవారు మహర్షి. కాబట్టి "సాధనను మొదటిస్థానంలో ఉంచుకుని సేవను(శాస్త్ర అధ్యయనము) విస్తరణ క్రింద అంటే రెండవ స్థానంగా పరిగణించాలి" అని మహర్షి, మాకు చెప్పేవారు.
ప్రశ్న :
భగవాన్! ఆత్మ విచారము ఎందుకు చేయాలి?
మహర్షి :
ఆత్మ విచారం చేయకుంటే, లోకవిచారం సాగుతుంది. లేనిదానిని వెదకడంలో, స్పష్టమైన దానిని వదలుకోవడం అవుతుంది.
ఆత్మ సిద్ధించగానే విచారంగూడ ఆగిపోతుంది. అప్పుడు నీవు ఆత్మ నిష్ఠుడవు అవుతావు. దేహమును ఆత్మ అని అనుకొన్నంతకాలం, ఆత్మ నష్టమైనదనీ, దానికై వెదుకుతున్నాము అని అనుకోడమేగాని నిజంగా ఆత్మ నష్టంగాదు. అది ఎప్పుడూ ఉంది.
దేహాన్ని ఆత్మయని, ఒక ఇంద్రియాన్ని ఆత్మయని, జీవాత్మయని, పరమాత్మయని... ఇట్లు వారు పేర్కొనే ఆత్మలు వందలూ, వేలూ. ఆ వెదకడం యధార్థమైన ఆత్మ కొఱకేగాని, ఇతరవాటి కోసంగాదు.

No comments:
Post a Comment