Friday, October 23, 2026

👞దీంట్లో ఉన్న Logic అర్థమైతే, జీవితంలో నువ్వు తీసుకునే చాలా నిర్ణయాలు ఎంత Stupid గా ఉంటాయో నీకే తెలుస్తుంది.

 


👞దీంట్లో ఉన్న Logic అర్థమైతే, జీవితంలో నువ్వు తీసుకునే చాలా నిర్ణయాలు ఎంత Stupid గా ఉంటాయో నీకే తెలుస్తుంది. అసలు నువ్వు ఆ "అందమైన Shoes" ఎందుకెంచుకుంటున్నావో ఎప్పుడైనా ఆలోచించావా? 🌄ఎందుకంటే, నీకు journey మీద interest లేదు. నువ్వు నడిచే దారి మీద ధ్యాస కంటే, నిన్ను చూసే ఆ నలుగురి మీదే నీ ధ్యాస ఎక్కువ. You are acting for an audience. ఒక Long journey కి వెళ్లేవాడు, ఆ దారిలో ఉన్న రాళ్లూ రప్పలూ దాటడానికి తన కాళ్లకి ఏది Comfort గా ఉందో చూసుకుంటాడు. కానీ, నువ్వు ఎంచుకునే ప్రతిదీ.. అది నీ career అవ్వొచ్చు, నీ life partner కావొచ్చు, లేదా నువ్వు కొనే ఇల్లు కావొచ్చు.. అవన్నీ "పక్కోడి కంటికి ఎలా కనిపిస్తున్నాయి" అనే Parameter మీదే depend అయ్యుంటాయి. 💑ఉదాహరణకి, పెళ్లి అనే Lifelong journey నే తీసుకో. ఇదొకటి చాలు మన hypocrisy ఏంటో చెప్పడానికి. Society లో అందరూ చూసి అబ్బా అనాలి, నీ Status కి మ్యాచ్ అవ్వాలి అని Beautiful Shoe లాంటి ఒక వ్యక్తిని ఎంచుకుంటావు. ఆ Partner చూడటానికి ఒక అందమైన బొమ్మలా ఉంటాడు/ఉంటుంది. పెళ్లి మండపంలో ఫొటోలకి, Instagram reels కి ఆ షోరూమ్ బొమ్మ భలే పనికొస్తుంది. కానీ Life అనే గుంతలతో ఉండే దారిలో నడక మొదలుపెట్టాక ఏమవుతుంది? జీవితంలో వచ్చే కష్టాలు, ఎత్తు పల్లాలు, financial problems, ఇవి వచ్చినప్పుడు ఆ "అందం" నీకు ఏమైనా comfort ఇస్తుందా? ఆ అందమైన Shoes నీ కాలికి బొబ్బలు తెప్పిస్తాయి. ఆ బొబ్బలు నీ పాదాలకి కాదు, నీ మనసుకి వొస్తాయి. ప్రతిరోజూ నీకు నరకం కనిపిస్తుంటుంది. కానీ పక్కోడికి మాత్రం నువ్వు brand new premium shoes వేసుకున్నట్టే కనిపిస్తుంది. వాడి దృష్టిలో నీ life ఒక success. But నీ దృష్టిలో? అనుభవిస్తుంది నువ్వు గాబట్టి, నీకు అదొక Bloody Torture. 🚗ఇక కెరీర్ విషయంలో కూడా మనం చేసేది ఇదే. నీకు నచ్చిన పని, నీ nature కి, నీ skill కి Set అయ్యే పని (అనుకూలమైన shoe) చేయడానికి నీకు అహంకారం అడ్డు వస్తుంది. నేను చదివిన చదువుకి, నా Status కి నేను ఈ SImple పని చేస్తే నలుగురు ఏమనుకుంటారు? అని చెప్పి, ఎక్కడో ఒక Multinational Corporate Company లో ఒక Fancy Designation కి అమ్ముడుపోతావు. ఆ Designation అనే అందమైన shoe, చూడటానికి అద్భుతంగా ఉంటుంది. వేసుకోడానికి premium గా ఉంటుంది. కానీ రోజు ఉదయం లేచి ఆ Shoes వేసుకుని Office కి వెళ్లాలంటే నీ ప్రాణం పోతుంటది. నీ కాలు అందులో ఇరుక్కుపోయి ఉక్కిరిబిక్కిరి అవుతున్నా, నెలకోసారి వచ్చే salary అనే Pain Killer వేసుకుంటూ బతికేస్తుంటావు. ఎవరి కోసం ఈ నటన? 🤯అసలు సమస్య ఎక్కడుందంటే.. మనం ఎంచుకునేవి మన అవసరాల కోసం కాదు, మన insecurities ని దాచుకోవడం కోసం. 👠నీ కాలికి రక్తం వస్తున్నా సరే, నువ్వు ఆ అందమైన బూట్లు విప్పడానికి ఇష్టపడవు. ఎందుకంటే అవి విప్పేసి, దారికి తగ్గట్టు ఉండే ఒక మామూలు చెప్పులు వేసుకుంటే సమాజం నిన్ను LOOSER అంటుందేమో అన్న భయం. నీకు నీ ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ పక్కోడి దృష్టిలో మాత్రం, ఎప్పుడూ నువ్వేదో ఒక పెద్ద తోపు లాగ కనపడాలి. The truth is, you are in love with your own slavery. 🌈ప్రకృతికి నువ్వు Gucci వేసుకున్నావా, Bata వేసుకున్నావా అనవసరం. Gravity కి Brands తో పనిలేదు. దానికి తెలిసింది ఒకటే.. Are you physically and mentally aligned to walk this journey? నువ్వు వేసుకున్న Shoes, నీ దారికి అనుకూలంగా లేనప్పుడు, నువ్వు ఎంత గొప్పవాడివైనా, దారి మధ్యలోనే కుప్పకూలిపోతావు. 👣🚶🏻ఒక నిజమైన Traveler కి, తను ఎంచుకున్న గమ్యం మీద ఉన్న పిచ్చిలో, అసలు తన కాలికి ఏముందో కూడా గుర్తుండదు. నువ్వు నడుస్తున్న దారి నిజంగా నీకు నీ ప్రాణం కంటే ఎక్కువైనదైతే, నువ్వు వేసుకున్న Shoes అందంగా ఉన్నాయా లేదా అని check చేసుకునే time కూడా నీకు ఉండదు. ఎప్పుడైతే నువ్వు నీ అడుగుల వైపు, నీ Shoes వైపు చూసుకుంటూ మురిసిపోతున్నావో.. అర్థం చేసుకో, "నువ్వు అసలు ఏ journey లోనూ లేవు. ఎక్కడికో నడిచేస్తున్న అని feel అయిపోతూ, ఎక్కడికీ దారి తీయని, కేవలం ఒక TREAD MILL మీద నడుస్తూ అలిసిపోతున్నావ్. అంతే. 🧠ఒక్క విషయం గుర్తు పెట్టుకో. నడిచేదీ నువ్వే, ఆ దారిలో దెబ్బలు తగిలేదీ నీకే, ఆ నొప్పులు భరించాల్సింది కూడా నువ్వే ఐనప్పుడు, ఆ Choice కూడా Practical గ, నీ Reality కి తగ్గట్టు ఉండాలి. ఎవరో చూసి చప్పట్లు కొడతారని, వాళ్ళ కోసం, నీ కాళ్లని, నీ జీవితాన్ని బలి పెట్టకు. నీ Life లో నువ్వు వేసుకున్న ఆ "అందమైన Shoes" ఏంటో ఒకసారి నీకు నువ్వే ఆలోచించు. - PRATIKULA VEDAM

https://youtube.com/post/UgkxQQOqfO92NGCU4xRm3Z5-pVh6s23EYyv4?si=jXInQ-P6bKEKpeu9

No comments:

Post a Comment